Wednesday, July 17, 2013

మరణ శాసనం

  మరణ శాసనం

నేను తిరిగి వస్తాను!
నేను తిరిగి లేస్తాను!!

ఆకశం ఎరుపెక్కిన వేళ
పీడిత వర్గాల పిడికిళ్ళు బిగుసుకున్న వేళ

అడవే ఆయుధమై రాజ్యాన్ని చుట్టుముట్టిన వేళ
 దగా పడ్డ యువత అగ్గిరవ్వలై ఉవ్వెత్తున ఎగసి పడే వేళ

శ్రామిక, కార్మిక వర్గాలు చురకత్తులై సమారభేరి మోగించిన వేళ
సామాన్యుడు అసామాన్యుడై పోరు కేక పెట్టిన వేళ

సామ్య వాద శక్తులు విప్లవ శంఖారావం పూరించిన వేళ
 ఉద్యమం ఉదయించే వేళ
ఉవ్వెత్తున ఎగసిపడ్డ తిరుగుబాటు ఉద్యమ కిరణాల మహోగ్ర జ్వాలలో
 రాజ్యం అస్తమించిన వేళ
చీకటి సామ్రాజ్యంలో వెలుగు పూలు పూచే వేళ !!

తల్లి భారతి సామ్యవాద కిరణాన్ని ప్రసవించిన వేళ
ప్రభవించిన ఆ ఉద్యమ నెలబాలుడు
గండ్రగొడ్డలితో వర్గ శత్రువు శిరస్సు ఖండించే వేళ  
ఆ వెచ్చటి నెత్తుటి ధారలలో భువన భవనపు బావుటా తడిచే వేళ

ఆ వేళ నా సమాధి చేరసాలని బద్దలు కొట్టి నేను మరల ఉదయిస్తాను!!
ఆవులిస్తూ నిదురలేచి కళ్ళు తెరచి  బావుటాకి "సెల్యూట్" చేస్తాను !!


నేను తిరిగి వస్తాను!!
నేను తిరిగి లేస్తాను!!

(సమయం: 17-జులై-2013, సిడ్నీ)



Monday, November 19, 2012

శంకరా.. అభయంకరా
కామ మొహావేసాలతో కల్మషమైన నా మనసుని గరళంతో కడిగివేయ రా!!
మదమెక్కిన నన్ను నీ శూలంతో మధించ రా!!

భోగ లాలనతో తూలుతున్న నన్ను భస్మ రాసిగా మార్చగా రా ముక్కంటీ!!
( Bhagath - 20-11-12)

Monday, November 12, 2012

విషం తాగే శివుడు విస్కీ తాగే నేను
 ఒకే బెడ్ రూమ్ లో పడుకుంటాం సర్!
దాని పరు స్మశానం!!

చితి మంటల వెలుగులు తప్ప 
నా కనుపాపకి మరో మోడల్ కనిపించదు 

మహా స్మశానంలో వెలుగుతున్న ఒకే ఒక చితి 
అందులో కాలి బూదిడైపోయింది నా కుంచె!!

What a wonderful Lines..........
Touched ma heart!!
( From "Brahma" Movie) 

Friday, November 9, 2012

మోడీ!! మోడీ!!
ఇదే ఐదో వేదంగా పలుకుతోంది ఇప్పుడు నా భరతజనుల "నాడి"!!

దేశం అవిటిది అయ్యింది
రక్కసి కాంగ్రెస్ పాలనలో!!

అవినీతి కుష్టులో నిక్రుష్టుల్లా బ్రతుకుతున్నాం
కన్నీటి సంద్రంలో కాలాన్ని ఈదేస్తున్నాం!

"ధర్మ సంస్థాపనార్ధాయ" సంభవామి యుగే యుగే అని గీతలో చెప్పారు 
అధర్మం కోరల్లో దేశం చిక్కుకుని విలవిలలాడుతోంది - నిన్ను శరణు జొచ్చాము - ఆదుకో స్వామీ!

రావణ సంహారం కోసం అయోధ్యని వదలి "దండకారణ్యానికి" కదిలావుగా దేవరా..
ఈ కీచక కాంగ్రెస్ వధ కోసం "గుజరాత్"ని వదలి ఢిల్లీ రాలేవా?

నీ రాక కై  తల్లి భారతావని ముసలి శబరిలా కన్నీటితో ఎదురుచూస్తోంది 
నీ రాకకై భరత ద్రౌపది అర్ధ నగ్నంగా రోదిస్తోంది

నీ  పాద స్పర్సతో శాపగ్రస్త అహల్యకి విమోచనాన్ని కలిగించు
నీ పద ధూళితో ఢిల్లీని పునీతురాలిగా మార్చు 

నీ కోసం ప్రాణాలు ఇచ్చే జాటాయులు ఉన్నారు!
నీ అడుగు జాడల్లో నడవడానికి వేల కొలది లక్ష్మణలు ఉన్నారు!
నీ ఆజ్ఞ శిరసావహించడానికి హనుమలున్నారు!
మా వెతలు తీర్చగ త్వరగా రా కన్నయ్యా!!

మోడీ రా...
కదలి రా!!

దేశం గతి తప్పి తిరుగుతోంది 
హైందవ సంసృతికి ప్రాణ ప్రతిష్ట చేసిన 
"జగద్గురు" ఆదిశంకరుని అవతారంలో వచ్చి దిశా నిర్దేశం చేయి !!

భార్గవ రాముని అవతారంలో రా!!
ఆసేతు హిమాచాలంలో "కాంగ్రెస్" ని గండ్రగొడ్డలితో తెగనరుకుతూ రా!

చిమ్మ చీకట్లలో అల్లాడుతున్నాం
ఆ సూర్యభగవానుడివి నీవై మా చీకాలని చీల్చుతూ రా!!

( నీ రాకకై ఎదురుచూస్తూ ఓ "గుహుడు") - Bhagath ( 10-11-12)
"నేను" జనంలో ఒకడిని 
ఈ "ఒక నేను" అలసిపోయాను!!

డెమోక్రసీ ముసుగులో
 దేశాన్ని ఢిల్లీ అమ్మల-దద్దమ్మల 
కాళ్ళ కింద ఎర్ర తివాచీ లా పరుస్తున్న
 బానిసల చేష్టలకి "నేను" అలసిపోయాను!!
నేను విసిగి పోయాను!!

రోజుకొక కొత్త స్కాము
పూట కొక్క  కొత్త ముఖ్య మంత్రి!!
పెద్దమ్మ తల్లీ నీకో వందనం!
రగిల్చావుగా ఆంద్ర దేశంలో చల్లారని "రావణ కాష్టం"!

దేశం క్షోభిస్తోంది!
ఇది నిజం!!

దోచుకు తింటున్నారు నీ బంటులు!
యధా  రాజా - తధా  ప్రజా!!
ఇప్పుడు కుక్కలు చింపిన విస్తరి ఈ దేశం!
అంతా మీ చల్లని చలవే గా తల్లీ!! ( Draft - To be Edited 8-11-12)
అవును 
సమాజం కళ్ళలో నేను ఒంటరినే!

పారుతున్న ఏరు లా 
వీస్తున్న గాలి లా 
విరగ పూసిన అడవి మల్లి  లా 
పురివిప్పిన నెమలిలా 
నేను ఒంటరినే!!

పారుతున్న ఏరు 
ఈదుతున్న చేపతో చేసిన చెలిమిని 
చూడలేదు ఈ సమాజం!!

వీస్తున్న గాలి 
నడుస్తున్న జవ్వని కురులతో చేసిన చెలిమి 
కాన లేదు ఈ సమాజం!!

విరగ పూసిన మల్లి 
పంచ వర్ణాల తేనతీగతో 
అల్లిన అనురాగాలని 
చూడలేదు ఈ సమాజం!!

తొలి వర్షపు చినుకులతో 
నెమలి నడిపిన 
రాసలీలలు చూడ లేదు ఈ సమాజం!!

అవును నేను ఒంటరినే!! ( Bhagath - 8-11-12)
కమ్మ్యునిజం ఎలా పుట్టింది??

ధనికులంతా ఓ వర్గమై 
శ్రామిక, కార్మిక వర్గాలని "పేద వర్గం" అని ముద్ర వేసి 
సమ సమాజాన్ని రెండు వర్గాలుగా చీల్చి 
శ్రమ దోపిడీ చేసినపుడు

పేదల కన్నీటి ధారల నుండి 
ఆకలి పేగుల ఆక్రందనల చప్పుళ్ళ నుండి 

ఇనుప సంకెళ్ళ బానిస బతుకుల 
దుర్భర వెతల నుండి 

విముక్తికై తెగించిన బానీస 
సంకెళ్ళు తెంచేసి  

కాలు దువ్వి 
కత్తి  దూసి 
ఎదురొచ్చిన దొర తల తెగ నరికి 

సీకటి గుడిసెల్లో ఎలుగులు నింపి 
మాపటి బతుకుల్లో 
రేపటి ఆశల మొక్కలు ఎసినపుడు 
పూసిన పువ్వే కమ్మునిజం  
ఎగిరిందే ఎర్ర జెండా


 
( Bhagath - 11/6/12)