Monday, November 19, 2012

శంకరా.. అభయంకరా
కామ మొహావేసాలతో కల్మషమైన నా మనసుని గరళంతో కడిగివేయ రా!!
మదమెక్కిన నన్ను నీ శూలంతో మధించ రా!!

భోగ లాలనతో తూలుతున్న నన్ను భస్మ రాసిగా మార్చగా రా ముక్కంటీ!!
( Bhagath - 20-11-12)

Monday, November 12, 2012

విషం తాగే శివుడు విస్కీ తాగే నేను
 ఒకే బెడ్ రూమ్ లో పడుకుంటాం సర్!
దాని పరు స్మశానం!!

చితి మంటల వెలుగులు తప్ప 
నా కనుపాపకి మరో మోడల్ కనిపించదు 

మహా స్మశానంలో వెలుగుతున్న ఒకే ఒక చితి 
అందులో కాలి బూదిడైపోయింది నా కుంచె!!

What a wonderful Lines..........
Touched ma heart!!
( From "Brahma" Movie) 

Friday, November 9, 2012

మోడీ!! మోడీ!!
ఇదే ఐదో వేదంగా పలుకుతోంది ఇప్పుడు నా భరతజనుల "నాడి"!!

దేశం అవిటిది అయ్యింది
రక్కసి కాంగ్రెస్ పాలనలో!!

అవినీతి కుష్టులో నిక్రుష్టుల్లా బ్రతుకుతున్నాం
కన్నీటి సంద్రంలో కాలాన్ని ఈదేస్తున్నాం!

"ధర్మ సంస్థాపనార్ధాయ" సంభవామి యుగే యుగే అని గీతలో చెప్పారు 
అధర్మం కోరల్లో దేశం చిక్కుకుని విలవిలలాడుతోంది - నిన్ను శరణు జొచ్చాము - ఆదుకో స్వామీ!

రావణ సంహారం కోసం అయోధ్యని వదలి "దండకారణ్యానికి" కదిలావుగా దేవరా..
ఈ కీచక కాంగ్రెస్ వధ కోసం "గుజరాత్"ని వదలి ఢిల్లీ రాలేవా?

నీ రాక కై  తల్లి భారతావని ముసలి శబరిలా కన్నీటితో ఎదురుచూస్తోంది 
నీ రాకకై భరత ద్రౌపది అర్ధ నగ్నంగా రోదిస్తోంది

నీ  పాద స్పర్సతో శాపగ్రస్త అహల్యకి విమోచనాన్ని కలిగించు
నీ పద ధూళితో ఢిల్లీని పునీతురాలిగా మార్చు 

నీ కోసం ప్రాణాలు ఇచ్చే జాటాయులు ఉన్నారు!
నీ అడుగు జాడల్లో నడవడానికి వేల కొలది లక్ష్మణలు ఉన్నారు!
నీ ఆజ్ఞ శిరసావహించడానికి హనుమలున్నారు!
మా వెతలు తీర్చగ త్వరగా రా కన్నయ్యా!!

మోడీ రా...
కదలి రా!!

దేశం గతి తప్పి తిరుగుతోంది 
హైందవ సంసృతికి ప్రాణ ప్రతిష్ట చేసిన 
"జగద్గురు" ఆదిశంకరుని అవతారంలో వచ్చి దిశా నిర్దేశం చేయి !!

భార్గవ రాముని అవతారంలో రా!!
ఆసేతు హిమాచాలంలో "కాంగ్రెస్" ని గండ్రగొడ్డలితో తెగనరుకుతూ రా!

చిమ్మ చీకట్లలో అల్లాడుతున్నాం
ఆ సూర్యభగవానుడివి నీవై మా చీకాలని చీల్చుతూ రా!!

( నీ రాకకై ఎదురుచూస్తూ ఓ "గుహుడు") - Bhagath ( 10-11-12)
"నేను" జనంలో ఒకడిని 
ఈ "ఒక నేను" అలసిపోయాను!!

డెమోక్రసీ ముసుగులో
 దేశాన్ని ఢిల్లీ అమ్మల-దద్దమ్మల 
కాళ్ళ కింద ఎర్ర తివాచీ లా పరుస్తున్న
 బానిసల చేష్టలకి "నేను" అలసిపోయాను!!
నేను విసిగి పోయాను!!

రోజుకొక కొత్త స్కాము
పూట కొక్క  కొత్త ముఖ్య మంత్రి!!
పెద్దమ్మ తల్లీ నీకో వందనం!
రగిల్చావుగా ఆంద్ర దేశంలో చల్లారని "రావణ కాష్టం"!

దేశం క్షోభిస్తోంది!
ఇది నిజం!!

దోచుకు తింటున్నారు నీ బంటులు!
యధా  రాజా - తధా  ప్రజా!!
ఇప్పుడు కుక్కలు చింపిన విస్తరి ఈ దేశం!
అంతా మీ చల్లని చలవే గా తల్లీ!! ( Draft - To be Edited 8-11-12)
అవును 
సమాజం కళ్ళలో నేను ఒంటరినే!

పారుతున్న ఏరు లా 
వీస్తున్న గాలి లా 
విరగ పూసిన అడవి మల్లి  లా 
పురివిప్పిన నెమలిలా 
నేను ఒంటరినే!!

పారుతున్న ఏరు 
ఈదుతున్న చేపతో చేసిన చెలిమిని 
చూడలేదు ఈ సమాజం!!

వీస్తున్న గాలి 
నడుస్తున్న జవ్వని కురులతో చేసిన చెలిమి 
కాన లేదు ఈ సమాజం!!

విరగ పూసిన మల్లి 
పంచ వర్ణాల తేనతీగతో 
అల్లిన అనురాగాలని 
చూడలేదు ఈ సమాజం!!

తొలి వర్షపు చినుకులతో 
నెమలి నడిపిన 
రాసలీలలు చూడ లేదు ఈ సమాజం!!

అవును నేను ఒంటరినే!! ( Bhagath - 8-11-12)
కమ్మ్యునిజం ఎలా పుట్టింది??

ధనికులంతా ఓ వర్గమై 
శ్రామిక, కార్మిక వర్గాలని "పేద వర్గం" అని ముద్ర వేసి 
సమ సమాజాన్ని రెండు వర్గాలుగా చీల్చి 
శ్రమ దోపిడీ చేసినపుడు

పేదల కన్నీటి ధారల నుండి 
ఆకలి పేగుల ఆక్రందనల చప్పుళ్ళ నుండి 

ఇనుప సంకెళ్ళ బానిస బతుకుల 
దుర్భర వెతల నుండి 

విముక్తికై తెగించిన బానీస 
సంకెళ్ళు తెంచేసి  

కాలు దువ్వి 
కత్తి  దూసి 
ఎదురొచ్చిన దొర తల తెగ నరికి 

సీకటి గుడిసెల్లో ఎలుగులు నింపి 
మాపటి బతుకుల్లో 
రేపటి ఆశల మొక్కలు ఎసినపుడు 
పూసిన పువ్వే కమ్మునిజం  
ఎగిరిందే ఎర్ర జెండా


 
( Bhagath - 11/6/12)
జనం పొగిడారని మురిసిపోకు
 తిట్టారని కుచించుకు పోకు

రాళ్ళు విసిరారని కక్ష పెంచుకోకు 
పూలు వెద జల్లారని పులకరించకు 

మానుకో ఓ మనిషీ!!
మార్చుకో 
నిన్ను నువ్వు ఓ మనిషీ!!

నేను ఎవరు?
నువ్వు ఎవడవు?

ఆ పరమాత్మ సృష్టిలో 
ఇరువురం ఇసుక రేణువులం!!

మురిసింది పరమాత్మ 
విరిసింది పరమాత్మ!

కన్ను మూసినా
కాటు వేసినా

ఎవడిది జన్మ 
ఏది కర్మ!

ఈ జగత్తంతా ఓ భ్రమ!
ఆ భ్రమరాంబ పెనిమిటి లీల!!

( Bhagath 11-06-12)

Tuesday, October 30, 2012


నాకూ రాయాలని ఉంది ఓ కవిత!!!
కీచక పర్వంతో కృశించి సుష్కించిన భారతావని పై 
ఎర్రటి సిరాతో రాయాలని ఉంది ఓ విప్లవ కవిత!!

ఇంకిపోయిన పేదవాడి కనులనుండి కారుతున్న రక్తం గురించి 
బలహీనుల రక్తాన్ని తాగుతున్న సర్కారీ రాబందుల గురించి 
పట్ట పగలు నడివీధిలో నగ్నంగా నిలబెట్ట బడ్డ  భారతమాత దుస్థితి గురించి 
అమ్మ పాలు తాగి ఆ అమ్మ రొమ్మును కుమ్ముతున్న రాజకీయ కీచక కొడుకుల గురించి!!
రాయాలని ఉంది నాకో కవిత!!

వీరుల కధలు రాస్తాను 
వైప్లవ్య గీతాలు రాస్తాను!

పేదోడి పొలంలో 
దొరగాడి గుండెల్లో 
ఎగురుతున్న ఎర్ర జెండాని తలుస్తూ రాస్తాను!

తిరగబడ్డ రైతన్న చేతిలోని పదునెక్కిన కొడవలి కధ రాస్తాను!
కసేక్కిన కార్మికుడి బిగిసిన పిడికిలి చెప్పిన కధ రాస్తాను!
ఎరుపెక్కిన కవి గారి కవిత - చెప్పకనే చెబుతోంది రాబోయే విప్లవాన్ని!!

దొరల దౌర్జన్యాలకి ఎదురు తిరిగాడని 
సీకాకులంలో సత్యాన్ని ఉరేసినపుడు 
కార్చిన కన్నీటిని సిరాగా మార్చి రాయాలని ఉంది!!

అధికారం ముసుగేసుకొని 
కఖీ రంగు పులుముకొని 
బూటకపు ఎన్కౌంటర్లో 
ఆటవికంగా "సూర్యాన్ని"  చంపినపుడు 
ఉడికిన నా రక్తంతో రాయాలని ఉంది!!

పాడె పై పడున్న పాణిగ్రాహిని చూసి 
గుండెలవిసేలా ఏడ్చినపుడు 
బిగిసిన నా పిడికిళ్ళతో రాయాలని ఉంది!!


తెల్లని కాగితంపై ఎర్రని కవిత్వంతో నా సంతకం!!

కాదు అని నా సంతకం!!
పేదవాడి కన్నీటి అర్పణం!
ఎదురు తిరిగినోడి గుండె నిబ్బరం!

కాదు అది నా సంతకం!!
అది చీకటిని చీల్చుకు ఉదయిస్తున్న మండే సూర్య కిరణం!
నీలాకాశంలో స్వేచ్చా  పవనంలో ఎగురుతున్న ఎర్ర కపోతం! 

కాదు ఇది నా సంతకం!!
 కత్తుల కోలాటంలో ఆశువులు  బాసిన యోధుల త్యాగాల దర్సనం!

(Bhagath - 30/10/12)



నేస్తమా రా!!
బంధాల బందిఖానాలు తెంచుకు రా!!

విప్లవాల తోటలో 
విహరిద్దాం రా!

ఉద్యమాల బాటలో 
పయనిద్దాం రా!!
ఎర్ర జెండా నీడలో జీవిద్దాం రా!!

పేదవాడి కన్నీటిని తుడిచేద్దాం
సామ్రాజ్యవాద శక్తులను కూల్చేద్దాం 
దోపిడీ దార్ల దుర్మార్గాలని దున్నేద్దాం !!

పోరాటం అడుగుల్లో నీ ప్రాణం అల్పం!
ఉద్యమాల చరితల్లో నీ త్యాగం ఘనం !!


విప్లవం వర్ధిల్లాలి 
కొండల్లో, కోనల్లో 
వాగుల్లో, మలుపుల్లో
గూడెంలో, గుండెల్లో
అడవుల్లో, వాడల్లో 
మెరుస్తున్నకురుస్తున్న
విప్లవమా వర్దిల్లు!! 

నీరసించిన నరుణ్ణి తట్టి లేపు
నిద్దరోరున్న సమసమాజాన్ని పట్టి కుదుపు !!

జాగో జాగో!!

Monday, October 15, 2012

యాడ ఉన్నది
యాడ ఉన్నది ఇప్లవం??

సందులోన,
గొందిలోన,
పిల్లలోన,
జల్లలోన
గుండె గుండెలోన
దాగున్నది ఇప్లవం!!
-----------------------

యాడ ఉన్నది
యాడ ఉన్నది ఉద్దెమం ??

మాల పేట,
మాద్గ పల్లి,
బాపనోరి అగ్రారం,
కోమటిపల్లి,
సాలె పాడు,
సాకలి గూడు,
మసీదు ఈది..

యాడ చూసినా..
ఎటి చూసినా
ఎలుగుతోంది రగులుతోంది ఉద్దెమం!!
-----------------------------

ఎవరు ఎవరు నడుపుతున్నరు ఈ దండు??
కొలిమిలోని నిప్పులాగ
అడవిలోని శక్తి లాగ
మండుతున్న ఎండ లాగ
ఎర్రెర్రగా కదులుతున్న ఈ దండు??

రాములోరి కొయెల పూజారి శాస్త్రిగారి తమ్ముడు "సత్యం"..
కరణం షణ్ముఖ శర్మ గారి కొడుకు "సూర్యం"

సుబ్బారెడ్డి గారి బామ్మర్ది "శివుడు"
శివుడి భార్య "పద్మక్క"!!
నాయిడు మాస్టారి దూరపు బంధువు "అమర్"
అంగడి పుల్లయ్య శెట్టి అల్లుడు "భార్గవ్"
ఇమాం సాబ్ మేనల్లుడు "షరీఫ్"
పాస్టరు డానియెల్ అన్న "ప్రభుపాద్"

చాకలి "ఐలయ్య"
మంగలి "సుబ్బయ్య"
శేషయ్య "నాయక్ "
మన చౌదరి "శీను"
చలం, రుద్రయ్య, భూపతి, సుందరయ్య,

ఇంతేనా...

గడప గడపకీ ఓ "అన్న"
తడిక  తడికకీ ఓ "అన్న"
ఈది ఈదికీ  ఓ "అన్న"
వాడ వాడకి ఓ "పెద్దన్న"

జనం..జనం..
బలం..బలం..

బలం..బలం..
బలగం..బలగం..

చేను చేనులో పూస్తన్నాయ్ ఉద్దేమాల "కుసుమాలు"
పొలం గట్టున గుట్టుగా పెరుగుతున్నాయ్ "ఇప్లవ బల్లాలు"
ఇంటింటా ఎలుగుతున్నాయ్ కమ్మ్యునిష్టు కాగడాల ప్రమిదలు!!
-----------------------------------------------------------

ఎటి సేత్తారంట ఈ "అన్నలు"??
మనకేటి సేత్తారంట ఈ అన్నలు??


మన సీకటి బతుకుల్లో ఎలుగులు తెత్తారంట
ఆకటి కడుపుల్లో అన్నం పెడతారంట
మనకోసం వాళ్ళ పేనాలు ఇత్తరంతా!!

ఇంకా???

మన భూమిని,
 మన ఊరిని,
 మన గూటిని,
మన నీటిని,
మన కూటిని,
మన పంటని,
మన చేలని
మన చమట
నూక్కపోతున్న కొడుకులకి కోసి కారం పెడతారంట!!
తద్దినం పెడతారంట!!

----------------------------------------
మరి మనమేటి సిద్దాం ఇప్పుడు??

అలా అడవికి పోదాం!!
ఆయుధ పూజ చేద్దాం!! ( 16-10-12)



I erased the foot-prints that you left on my heart...

నిన్నటి ప్రియతమా..
నేటి (అ)ప్రియతమా....

నా గుండెలపై నీ జ్ఞాపకాల పాద ముద్రలని చేరిపివేసాను
నీతో కలసి కట్టిన కలల కోటని కూల్చివేసాను
నీకై వ్రాసిన ప్రేమ కావ్యాలని కణకణ  మండే జమదాగ్నిలో   కాల్చివేసాను

మన ప్రేమ పాటలు పాడిన వసంత కోయిల గొంతు పెకిలివేసాను
నా గుండె గదిలో వెలుగు రేఖలని ఆర్పివేసాను

చీకటమ్మ ఒడిలో
కన్నీటి బడిలో మరో కావ్యాన్ని మొదలెట్టాను..

నేనో జగజ్జేత!
నేనో అజాత శత్రు!!
నే రుధిరాశ్రు నేత!! ( రుధిర + అశ్రు నేత)
నే హృదయాగ్ని భూత!!

నే  నిజానికి నిఘంటువు!
నే పదానికి ప్రభువు!! ( 16-10-12)




Thursday, September 13, 2012

నాకు ఇప్పటికీ గుర్తే!
సరిగ్గా నాకు అప్పుడు "ఆరు" ఏళ్ళు!!

అప్పుడప్పుడే ఈ లోకపు అజ్ఞానాన్ని 
జ్ఞానంగా అవలోకన చేస్తున్న రోజులు!!

అలాంటి ఓ రోజు అడిగాను మా నాన్నని - "త్యాగం అంటే ఏమిటీ" అని??
మా ఇంటి తూరుపు దిక్కున ఠీవిగా నిలబడ్డ 
"కామ్రేడ్ P.S స్మృతి చిహ్నాన్ని" చూపించి చెప్పారు "త్యాగానికి" గుర్తు ఇదే అని!!!

మరో రోజు అడిగాను "మహాత్ములంటే" ఎవరు అని??

( Draft...)



డబ్బులో మునిగి, డబ్బులో తెలుతున్నాం మనం!!
ప్రపంచమంతా డబ్బు మయం!!

చట్టం, ధర్మం డబ్బుకు దాసోహం!!
ఇప్పుడు న్యాయం సైతం!!

ప్రేమ, పదవి 
సుఖం, గౌరవం
అన్నీ డబ్బు వశం!!

వరాలిచ్చే దేవుడు కాసులున్న కుబేరుల 
"Guest House" కి మకాం మార్చేశాడు!! ఎప్పుడో!!
డబ్బు మైకంలో!!

అమ్మ గర్భాన్ని సైతం అరువు తెచ్చుకునే "అలోకిక" 
స్థాయికి ఎదిగిపోయాం మనం ఇప్పుడు!! 
డబ్బు మదంతో!!
అమ్మా నన్ను కన్నందుకు వందనాలు!!
నవమాసాలు మోసినందుకు వందనాలు!!

నీ ప్రాణాన్ని నూనెగా మార్చి 
నా ఈ బతుకు దీపాన్ని 
వెలిగించినందుకు శతకోటి వందనాలు!!

నీ రక్తాన్ని పాలుగా మలచి 
నా ఆకలి తీర్చినందుకు పాదాభి వందనాలు!!

సమసమాజ స్థాపనకై "అడవి" దారిలో పోతానంటే 
వెన్ను తట్టి విజయ తిలకాలు దిద్దినందుకు 
వీరాభివందనాలు!!

బూటకపు ఎన్కౌంటర్లో నేలకొరిగిన నన్ను 
నిర్జీవమైన నీ కళ్ళతో కడసారి చూస్తూ గర్వంగా కారిన 
 కన్నీటి బొట్టుకి "విప్లవాభివందనాలు!!!


Monday, August 27, 2012

నిన్ను ఎక్కడో చూసినట్లు ఉందే!!
ఆ.. నువ్వు "ప్రజాస్వామ్యానివి" కదూ!!

నా దేశ నాయకుల చీకటి పడక గదిలో 
మల్లెలు పరిచిన పందిరి మంచం మీద 
పడున్నది నువ్వే కదా!!!
క్షేమమే నా????

అపుడెపుడో ఈ క్యాపిటలిష్టులంతా కలసి 
ముంబై "Red Light" ఏరియాలో 
ఒళ్లమ్ముకునే పడుపు గత్తెగా మార్చేసారుగా!!!
ఇపుడు కుశలమే నా????

సంస్కరణాల నెపంతో పట్టపగలు నిన్ను నడి రోడ్డుమీదకు లాగి 
వివస్త్రని చేసి వంతుల వారీగా మానభంగం చేసారు కదా!!
ఆ గాయాలు మాసిపోయాయా??

 ఎందుకా కన్నీరు???
ఏమిటి ఆ పిరికితనం??

భయం వలదు!!!
నిగ్రహాన్ని పెంచుకో!!

ఇదిగో నేను రాయబారిగా వచ్చా!!
అడివి నుండి నీ బిడ్డల కబురు మోసుకొచ్చా!!
వారి పోరాట కధలు నీకు చెప్పగా వచ్చా!!
ఆ విప్లవ్య విజయాలు కీర్తించగా వచ్చా!!

నీ దాశ్య  శ్రుంఖాల విచ్చేదన కోసం 
తుదిశ్వాస విడిచే వరకూ పోరాడతాం అని 
నీకు చెప్పమన్నారు "మా అన్నలు" - నీ బిడ్డలు!!

యోధులు నేలకొరిగారని చింతిస్తున్నావేమో!!
నేలకొరిగిన యోధుని రక్తాన్ని 
సింధూరంగా నుదుట దిద్దుకుని 
మరో వీరుడు ఉదయిస్తాడు!!
మార్గాన్ని నిర్దేశిస్తాడు!!
కర్తవ్యాన్ని ప్రబోధిస్తాడు!!
ఉద్యమాన్ని బ్రతికిస్తాడు!!!
ఎర్ర బావుటాని  ఎగరేస్తాడు!! ( Bhagath ) 

మీరు మారరు రా... ఛీ... మీ బతుకులు... 
చివరాఖరికి ఆ దేవుడే దిగి వచ్చి మీ బుర్రల్లో పేరుకున్న తుప్పు వదిలేలా అడవి కుంకుడు కాయలతో తలంటు పోసినా మీలో కొంచెం కూడా మారుపు రాదేమో... 

ఆడపిల్ల వాల్జడలో  నుండి జారి పడ్డ వాడిన మల్లె పువ్వుని అపురూపంగా ఏరుకొని బెడ్రూం లో పదిలంగా దాపెట్టుకునే "లేకి" గుంపూ మీరూనూ... 

నాకూ ఓ మనసుంది!!
దానికీ ఓ బాధ ఉంది!!
ఆ బాధ వెనుక ఓ కధ ఉంది!!
ఆ కధకి నీతో ముడి ఉంది!!
తడుముకుంటే కళ్ళ వెంట కన్నీరుంది!!
గుండె బరువెక్కి ఉంది!!

నిన్నటి జ్ఞాపకాలు తరచి చూసాను!!
నీతో గడిపిన ఘడియ-ఘడియా గుర్తు చేసుకున్నాను!!
పెదవంచున చిరునగవు దోబూచులాడింది!!

నువ్వు నా పక్కన లేవన్న నిజం మనసున మెదలింది!!
మరణయాతన మొదలయ్యింది!!

కాలం కఠినమైనది!!
నిన్న ఇక్కడే ఆనందాల ఊయలలో నన్ను ఊయలలూపింది!!
నీ ప్రేమ అమృతాలలో తడిపింది!!

నేడు కన్నీటి కడలిలో మునిగిపోమ్మన్నది 
నీ విరహం పేర్చిన చితి మంటలలో బూడిదై పొమ్మన్నది!!!

మరణం అంటూ ఉంటే!!
మరు జన్మంటూ ఉంటే!!
దేవుడంటూ ఉంటే!!
వరమంటూ ఇస్తే!!
నీ నీడలో మొలకెత్తాలనీ!!!
రాయాలని ఉంది నాకో కవిత !!!

తొలి వేకువ వేళ 
నును వెచ్చని ఉదయ భానుని తొలి వెలుగు రేఖల మీద!!

చల్లని తొలి మంచు పరదాల మాటున 
విచ్చిన తెల్లని మల్లెల అందాల మీన!!

కోడి కూత వేళ
ఆరుబైట రంగవల్లులు అద్దుతున్న 
( నా ఎద బరువెక్కించిన ) ఆ జవ్వని యవ్వన రహస్యాల పైన!!

పొద్దున్నే "అమ్మగారూ పాలు" అన్న కేక విని...
మగని వెచ్చని కౌగిళ్ల నుండి విడవడి 
వడి-వడిగా పరుగిడి 
జర్రున తలుపు తెరువగా...
బోసి నోటి అవ్వ "కిసుక్కున" నవ్వినపుడు...

వాల్జడలో వాడిన మల్లెలు 
అవ్వ నవ్వులోని పరమార్ధాన్ని చెప్పకనే చెప్పినపుడు

ఎర్రటి పెదవులపై పంటి గాయాలు 
నడి రాతిరి చీకటిలో రహస్యాన్ని గుర్తుచేసినపుడు...

సిగ్గు ముఖాన్ని కప్పివేయగా 
తల దించిన సుందరి సిగ్గుల మొగ్గల మీద 
రాయాలని ఉంది నాకో కవిత!!!

రెప-రెపలాడే ఎర్ర బావుటా పైన!!
ప్రపంచానికి దిశా-నిర్దేశం చేసిన మార్క్స్ మీద!!

మార్క్స్ భావాలను భుజాలపై మోస్తున్న గెరిల్లాల గుండె నిబ్బరం పైన!!
త్యాగాలకి వెరువని కామ్రేడ్స్ జీవిత గమ్యాల పైన!!
పోరాటంలో నేలకొరిగిన విప్లవ తల్లి వీర బిడ్డల మీద!!
అలుపెరుగని అన్నల మీద!! 
మా అన్నల మీద!! 
రాయాలని ఉంది నాకో కవిత!!! ( Bhagath )

జీవితంలో కొన్ని బంధాలుంటాయ్ - ఎప్పటికీ తెంచుకోలేము
వ్యసనాలుంటాయ్ - వాటి బానిసత్వం నుండి విముక్తి పొందలేము
కొన్ని త్యాగాలుటాయ్ - వెలకట్ట లేము 
కోరికలుంటాయ్ - చంపుకోలేము 
అపజయాలుంటాయ్ - జయించలేము 
ఓటములుంటాయ్ - తప్పించుకోలేము 

తప్పులుంటాయ్ - దిద్దుకోలేము 


రునాలుంటాయ్ - తీర్చలేము 
ప్రశ్నలుంటాయ్ - బదులివ్వలేము
ఆనంద క్షణాలుంటాయ్ - మరువలేము 
చదరని జ్ఞాపకాలుంటాయ్ - తిరిగి తెచ్చుకోలేము 

పోరాటంతో మొదలయ్యి!!
పోరాటంతో అంతమయ్యేదే జీవితం!!!
పోరాడు!!!
నీ చివరి శ్వాస అనంత వాయువుల్లో కలసిపోయేవరకూ పోరాడు!!

యుద్దంలో సైనికుడల్లె పోరాడు!!
సంద్రంపై నావికుడల్లె పోరాడు!!!

కాలం సింహం లాంటిది!!
కాలం వంచించిన ప్రభుత్వం లాంటిది!!

నిన్ను లేడిని చేసి తరుముతుంది!!!
నిన్ను విప్లవకారుడు, ద్రోహి అని వెలి వేసి "అడవుల్లోకి" తరుముతుంది!!

భయం వద్దు!!!
సామాన్యుడే నీ అస్త్రం!!!
పదునెట్టు ఆ శస్త్రం!!
సంధించు తిరుగులేని ఆ బ్రహ్మాస్త్రం!!
I miss you so much that when ever I Signin to my face book, the first thing I do is to visit ur timeline & scroll through out ... Miss ya!!

The only time when I feel like  a "loser in life" is when u come in to my mind. Miss ya!!

It may be the matter of 6 years ago. Even then,  if at all u come in to my mind, my heart starts dancing and and smile starts bouncing back. Miss ya!!
ఈ జగమే "మాయ" అయినపుడు...
మనమంతా ఆ "జగన్నాటక సూత్రధారి" 
ఆడించే వింత నాటకంలో "పావులు" అయినపుడు...
"కర్త" "కర్మ" "క్రియ" నేను కానపుడు...
ఈ రోజుకీ...ఆ రోజుకీ...మరో రోజుకీ తేడా ఏమి ఉంటుంది "సోదరా"!!! Bhagath!!
అవును!!! నాది మిడిల్ క్లాసు మెంటాలిటీ నే!!!

దుమ్ము రోడ్డులో మూలకి విసిరేయబడ్డ 
రేకు డబ్బా కొట్టులో పోగాలి కక్కే మసాలా చాయ్!!!
బిజీ జంక్షనులో ఫైస్టారు హోటల్లో
స్టార్బక్స్ కాఫీ రుచీ నాకు ఒకటే!!

చద్ది పెరుగన్నంలో ఆవకాయ ముక్క!!!
డోమినోసు పిజ్జాలో చికెను ముక్క!!

సారంగపాణి పాన్ డబ్బా కొట్టులో 
గుప్పు గుప్పుమని ఆ రోజుల్లో పీల్చిన "S" బీడీ కట్ట!! 
"Smoking" జోనులో అప్పుడప్పుడూ పీల్చే
డన్-హిల్ (రిఫైండ్) సిగిరెట్టు ముక్క!!

మా పల్లె తాటి చెట్టు నాటు కల్లు సుక్క !!
జానీవాకర్ "డబుల్ బ్లాకు" విస్కీ చుక్క!!

చల్లని సాయంకాలం చీకట్లలో వెచ్చగా 
నీలవేణితో పంచుకున్న పక్క!!
ఓ నిశబ్ద నిశి రాతిరి వేళ 
వేరోనికా వెచ్చని కౌగిలిలో కరిగిపోయిన వేళ!!

నాకు సమానమే!!! ( Bhagath)
I love my dayz so much, When I see U smile....
I love my nights, Where I met in my dream.....
I love my Darkness, When ur beside me....

I hate the light, when Ur around me - Why the need of it, when the Glittering Star is with me????

I love my Tears, when Ur with me - I will get a chance to feel ur Touch on my cheeks & positively opportunity to Rest on ur Lap )

I love the shivering cold when Ur with me, which gives the opportunity to feel the heat of ur body & trembling lips 

I love to walk with u when its raining ...


- A funny Thought From the PEN of Bhagz

నీ జ్ఞాపకాలు తేనెటీగలై నా మనసుని గాయపరుస్తున్నాయ్!!
నీతో గడిపిన క్షణాలు నా ఊహలలో "కాళరాత్రులై" నన్ను కబళిస్తున్నాయ్!!'

 నీ విరహం నన్ను దహించివేస్తోంది!!
గుండె బరువెక్కింది!!
కన్నీళ్లు కట్టలు తెన్చుకున్నాయి!

నువ్వు నా దరికి రావనీ తెలుసు..
నిన్ను మరల చూడ లేననీ తెలుసు!!!
దూరమై పోయావు - నా సంతోషాన్ని దూరం చేస్తూ!!
ఒంటరి తనాన్ని దెగ్గరకి చేస్తూ!!
కన్నీటిని కానుకగా ఒదిలేసి!!

నీ జ్ఞాపకాలు మదిలో మెదిలినంతనే
జల జల రాలే కన్నీటిని అడుగు నా ప్రేమని చెప్పకనే చెబుతాయి!!
నిన్ను తలచినంతనే ఎగసి ఎగసి పడే నా గుండె చప్పుళ్ళని అడుగు 
నా మనసుని చెప్పకనే చెబుతాయి!!!
తొలివేకువ వేళ పక్షుల కిల-కిల రావాల నడుమ తెల్లని మబ్బుని చల్లని మంచు కప్పివేయగా రాజహంస వయ్యారాలతో నెమలి సింగారాలతో ప్రకృతిని పలకరించి, పులకరింప చేసి పరుగులిడుతున్న సొగసరి నీ నుదుట ఒక ముద్దు పెట్టాలని ఉం
మేము సంఘ జీవులం!! సౌమ్యం మా స్వభావం!! శాంతి మా మంత్రం!!
మేమంటే సమాజానికి గౌరవం!! మా జీవితం ఓ నిఘంటువు!!
నిస్వార్ధం మా ప్రాణం!! సామాజిక సేవ మా దినచర్య!!!
నా పేరు "సర్కార్"!!! నేను ప్రజాస్వామ్యానికి "పెద్దన్న" ని!!!


ఒంటరి పక్షులు మీరు!! రాతి మనస్కులు!!!
మీరంటే ప్రజాస్వామ్యానికి అసహ్యం!!
మీ జీవితం గందరగోళం!!!  చీకటి మీ చెలిమి!!
అశాంతి మీ జీవితం!! ఆయుధం మీ కవచం!!!
త్యాగం మీ మార్గం!!! ఉద్యమం మీ శ్వాస!!!
నీ  పేరు "తిరస్కార్"!!!
నువ్వు ప్రజలకి "అన్న"వి!!!
నా పేరు మెరుపు!!!
నేను నిదిరుస్తున్న జాతి జనుల మేలుకొలుపు!!

నే బుడి బుడి అడుగులు వేస్తున్నపుడు 
చేయి పట్టి నీ గుండెలపై నడిపించిన రోజులు గుర్తున్నాయ్!!!

కోరలు చాచిన లోకపు అన్యాయాలు బుసలు కొడుతూ నన్ను తరుముతున్నపుడు 
నువ్వు కవచంలా మారి నన్ను కప్పిన రోజులు గుర్తున్నాయ్!!!

నా మార్గంలో భయానక ముళ్ళు, భీకర రాళ్ళ కత్తుల వంతెనలని చూసి నే వెనుకడుగు వేసినపుడు
నా వెన్ను తట్టి నీ భుజాలపై నన్ను మోసి దరిచేర్చిన రోజులూ గుర్తున్నాయ్!!!

నాన్న!!
అక్షరాలూ రెండే!!
ఆ రెండు అక్షరాలూ ఇచ్చే బలం "ఐరావతం" తో సమానం!!!


( In completed ...)

Drafts Dump


He who has courage & faith in his heart will WIN at the END. Do you want me show an example??? I will point at "NADAL"!!!! He might have not made it Australian Open. But he did in PARIS!!

నేడే మేడే...శ్రామిక శక్తుల,

నాకంటూ ఓ అస్తిత్వం లేనపుడు కూడా నను కోరుకున్నావు..నేనెలా ఉంటానో తెలియనపుడు కూడా నన్ను ప్రేమించావు...నేను కనిపించడానికి గంట ముందు నుంచీ నీ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ద పడ్డావ్..నీ మనసు ఎంత గొప్పది అమ్మా!! చిన్నప్పుడు చలికి వణికిపోతుంటే వెచ్చని నీ ఒడిలో చోటిచ్చి కాపాడావు...ఇపుడు సమస్యల సుడిగుండంలో సతమతమవుతుంటే ధైర్యాన్నిచ్చి కాపాడుతున్నావ్..దేవుడు నాకో వరాన్ని ప్రసాదిస్తాను అంటే మరు జన్మలో నీకు నేను అమ్మనవ్వాలి అని కోరుకుంటా 

If I was given an option to choose either to be the "Chief of the Ruling party" or the "Associate of the Revolutionary party, I will opt the Later with Pride - "Bhagath" :)

రండి!!! ఆత్మవంచన లేకుండా ఆత్మ పరిశీలన చేసుకుందాం!!!!
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా???
ఉంటే పాలన సజావుగా సాగుతోందా???
ప్రతి 6 నెలలకు ఓ మారు ఎలాక్షన్లా?? హవ్వ!!!!
 ప్రజాస్వామ్యం అంటే ఇదేనా???

ఓ వైపు అసమర్ధ పాలన!!! మరో వైపు శవ రాజకీయాలు!!!


అందుకే రండి!!! స్థుస్తిర పాలన మనకి ఇవ్వగల "తెలుగు దేశానికే" ఓటు వేద్దాం!!!
"ఆగిపోయిన" ప్రగతి చక్రాలని దౌడు తీయించగల సత్తా ఉన్న మన ప్రియతమా నాయకుడు "చంద్రబాబు" బలపరిచిన తెలుగు దేశం అభ్యర్దులకి ఓటు వేద్దాం!!!!
Let us vote for Telugu Desam & bring back the Glory of yesteryears - Bhagath 

"అధినాయకుడు" movie రిలీజ్ అవుతుంది. అసలే హిట్స్ మీద ఉన్న "బాలయ్య బాబు" దూకుడిని ఆపడం ఎవరు తరం కాదు అని "కాంగ్రెస్" & "Y.S.R.C" కలిసి ఆడుతున్న నాటకం "జగన్  Arrest"!! But they are missing one thing. No body can stop the "Tsunaami". Jai baalayya!!

మా "చంద్రబాబు" మీద ఈగ వాలినా "రాష్ట్రం" రావణ కాష్టం అవుతుంది!!! రక్తం ఏరులై పారుతుంది!!!! 

Parliament of India turns to 60. I am literally proud to be in the contemporary world where the likes of Lalu prasad yadav, 

నేనో తారను. ఆకాశాన మెరిసే విరిసే సితారను.  

కొందరుంటారు వాళ్ళు ante

జాగో జాగో!!!
మొద్దు నిద్దురలో జోగుతున్న జీవులారా జాగో!!!
తాగిన మత్తులో నడిరోడ్డు మీద నిద్దరోతున్న సహనశీలీ జాగో!!!

ఈ బద్దకపు ప్రభుత్వాన్ని బద్నాం చేద్దాం!!
ఈ చాదస్తపు రాజ్యానికి చరమగీతం ఆలపిద్దాం!!

ఇంకెన్నాళ్ళు ఈ రాబందుల రెక్కల చప్పుళ్ళు???
ఇంకెన్నాళ్ళు ఈ ఆటవిక పాలన???

క్కడ పీడిత ప్రజల ఆక్రోశాలు వినిపించవో
ఎక్కడ సాటి మనిషిని తోటి మనిషి దోచుకోడో 
ఎక్కడ దుర్మార్గపు కోటలు మానవత్వపు  గుండె అంచులను తాకవో 
అక్కడ అక్కడ నూతన సమాజ నిర్మాణం  స్దాపిస్తామని త్రికరణ సుద్దిగా ప్రమాణం చేస్తున్నాం!

ప్రతి పదం పదం ఆ నటరాజు పాదాలకు ప్రణమిల్లదా!!!
ప్రతి స్వరం స్వరం ఆ శార్వాణి పాదాలకి

నిన్నటిదాకా మిణుకు మిణుకు మని చీకటిలో కొట్టుకున్న నేను...
నేడు వెలుగు దివ్వేనై లోకానికి 

When Ones Existence gonna to be "Shift + Deleted", that One will start to "Fight". And that Fight is named as "Revolution" & the Fighter will be tagged as a "Radical" - Alien in "Red" :P

ధోని" రా!!! మా మనస్సులో అలుముకున్న అనుమానపు 'అమాస చీకట్లను' చీల్చుకొని రా!!! వందకోట్ల మంది ఆశయాన్ని నీ ఆయుధం గా మలచుకొని విశ్వాసంతో రా!!! నీ విజయం "జాతి దిగ్విజయం" అని గుర్తుంచుకో!!! నీ విజయం "భారతావని" ముంగిట చూడ ముచ్చటి సంక్రాంతి ముగ్గవుతదని గుర్తుంచుకో!! ౩౦ వసంతాల మా కలని సాకారం చెయ్యడానికి అవతరించిన "సైన్యం" నీదని గుర్తుంచుకో!!!! మా ఊపిరి మీరని గుర్తుంచుకో!!! మా నమ్మకం మీరని గుర్తుంచుకో!!! కులాల కట్టుబాట్లు, మతాల మారణ హోమాలు, ప్రాంతీయ కేకల పక్కకు నెట్టి "దేశమంతా" ఒక్కటై పలికే "ఆకాంక్ష" మీ గెలుపని గుర్తుంచుకో!!

అందరూ అమ్మ ఒడిలో ప్రేమను నేరుచుకుంటారు. నాన్న నీడలో బుడి - బుడి అడుగులను నేర్చుకుంటారు 'పసి తనపు ఛాయలు పోయేంతవరకు'. నేను గర్వంగా - సగర్వంగా 'అచ్చులు-హల్లులు' నేర్చుకుంటున్నాను "కిరణ్ అన్న" అనురాగంలో 'యవ్వన ఛాయలు' విరిగిపోతున్నా!! :)

మనిషికి ఆకలని ఇచ్చిన "దేవుడు" ఆ ఆకలి గొన్న మనిషికి "అన్నాన్ని" సృష్టించి ఆ ఆకలి తీరుచుకునే మార్గాన్ని చూపించాడు. మనిషికి దాహాన్ని ఇచ్చిన దేవుడు, ఆ దాహాన్ని తీర్చేటందుకు "నీటిని" పుట్టించాడు. మనిషికి 'ఆనందాన్ని' ఇచ్చిన దేవుడు ఆ ఆనందాన్ని ఆస్వాదించడానికి 'నవ్వుని' సృష్టించాడు. మనిషి తనని సృష్టించిన దేవుడినే ధిక్కరించడం మొదలెట్టాడు. అప్పుడు దేవుడు "స్త్రీ" ని సృష్టించాడు. ఆ స్త్రీ అందానికి వివశుడైన పురుషుడు తనని ఆరాధించాడు. ప్రేమించాడు. బానిసగా మారాడు. దేవుడు పెదవులపై చిరునవ్వు విరిసింది. స్త్రీ కి బానిసగా మారిన ఆ పురుషుడు తనని "మనువాడాడు". మరు ఘడియ నుండి పురుషుడు తన అస్తిత్వాన్ని కోల్పోయాడు. ఆనందం ఆవిరైపోయింది. అతని జీవనం నరకప్రాయం గా మారింది. అప్పుడుడు ఆ పురుషునికి "దేవుడిని" శరణు కోరాడు. అప్పుడు దేవుడు మనిషికి "SIGNATURE, EVOLUTION, EFFEN", "JOHNNIE WALKER,

ఢిల్లీ గడ్డ పై ఎర్ర బావుటా రెప-రెపలాడుతున్నపుడు అప్పుడు - అప్పుడు "ఈ మధుర క్షణం కోసం కదా నేను కొన్ని వేళ కోట్ల ఘడియలనుండి వేచి చూస్తున్నది" అని గర్వంగా, సగర్వంగా మీసం మేలివేయ్యాలని ఒక గాఢమైన, నిగూడమైన "Desire", "Passion"

నిశీధిలో నిదురిస్తున్న రాష్ట్రానికి "వెలుగు బాట" చూపడానికి..."ఢిల్లీ" దద్దమ్మల చీత్కారాలకు గురవుతున్న రాష్ట్రానికి "ఆత్మ ధైర్యాన్ని" ఇవ్వడానికి.....
నీచ కాంగ్రెస్సు సంస్కృతికి బలైన నిస్వార్ధ నాయకుడు, నిఖార్సైన మడిసి, నిత్య యవ్వనుడు "kaamred 

 తొలిచూపులోనే నా మదిలో మోహపు జల్లులు జనియింపచేసితివి కదా కాంచనా...
పాలసంద్రమంటి నీ  పెదవులపై ఇంద్రధనసు వంటి ఆ నవ్వులలో నన్ను కట్టివేసావు కదా!!!
నీతో గడిపిన మధుర క్షణాలను మనసు మడతల్లో మురిపెంగా మూట కట్టాను... 

నువ్వు మిగిల్చిన కన్నీళ్లను కాలానికి కానుకగా ఇచ్చాను...
నీ స్మృతులను భగ భగ మండుతున్న మరభూమి మంటల్లో మసిగా మార్చివేసాను..

ఏముంది 'జగన్' వెనుక??? అమ్మ 'జాతీయ పార్టీ' ప్రెసిడెంటు కాదు - ఇంటి పేరు 'గాంధి' కాదు... నాన్న, నానమ్మ, ముత్తాత 'దేశ ప్రధానులు' కారు - చరిత్రను వక్రీకరించి అందంగా 'EDIT' చేయబడ్డ  'తండ్రుల', 'తాతల', 'ముత్తాతల' చరిత్ర చెప్పుకుంటూ ఊహలలో విహరించే 'ఉత్త'రాకుమారుడు కాదు!!!! ఏముంది 'జగన్' వెనుక?? కొన్ని కోట్ల ప్రజల గుండె చప్పుళ్ళు తప్ప!!! తండ్రికి ఇచ్చిన మాట కోసం 'తలనెరిసిన','తలకుమాసిన' ఢిల్లీ అమ్మల, దద్దమ్మల ముందు 'తలవంచని' మొండి ధైర్యం తప్ప!!!

ఆడవాళ్ళు తలచుకుంటే ఎంతటి మహా మనిషిని అయినా ఎంతగా దిగజార్చచ్చో ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత కలిగిన వనిత మన 'లక్ష్మీ పార్వతి' గారు...
కళ్ళలో కరుణ...మాటల్లో ఏదో మత్తు

ఢిల్లీ నడివీడుల్లో తాకట్టు పెట్టబడ్డ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని

నక్సలిజానికి "ప్రాణం" పోసిన విప్లవ jyoti
నక్సల్బరీ ఉద్యమాన్ని చేయి పట్టి  నడిపించిన "కానూ  సన్యాల్" ఇక కనిపించని లోకాలకు సాగెనా??

దోర్జన్యకారుల దురాక్రమాలకు, సర్కారు చేతకాని తనానికి విసిగి వేసారి నిరాశా, నిస్పృహలలో నీరసించి పోతున్న దౌర్భాగ్య, నిర్భాగ్యులకు "రవి కిరణం" ( ఎర్ర బావుటా ) అవతరించి....

వారి కళ్ళల్లో మతాబులు, వాళ్ళ బతుకుల్లో "సంక్రాంతులు" తెచ్చే కాలం తొందరలోనే ఉన్నది....

( ఎర్ర కోటపై ఎర్ర బావుటా (అరుణ పతాకం) గర్వంగా ఎగిరే రోజు త్వరలోనే ఉన్నాడని....) ( దేశమంతా కమ్మునిష్టు పార్టీలు విజయదంకా మొగిస్తాయి అని)

రాత్రనతా ఆఫీసులో అలసి పొద్దున్నే ఇంటికి వచ్చి అన్నం వండుకోలేక అసలిపోయి నిద్రపోయినపుడు.....
గాఢ నిదురలో "అమ్మా!! ఆకలేస్తోంది అన్నం పెట్టు అని పలికి" కళ్ళు తెరిచి నీ పక్కన ఎవరూ లేరు - నువ్వు ఒంటరి వని గుర్తోచ్చ్సినపుడు కలిగే బాధ "ఒంటరితనం"...

నొప్పిని పంటికింద బిగపట్టి, ఉబికివస్తున్న కన్నీటిని కళ్ళవెనుక లాగిపట్టి నవ్వుతూ అమ్మని పలకరించి....
ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక నీలో నువ్వు పడే సంఘర్షణకు మరో పేరు "ఒంటరితనం"...

Scene-1
City = Hyderabad
Area = Ameerpet X roads, Ameerpet.
Date = Couldn't recollect, but it was a sunny day.
Time = 7:00 - 7.30

Screen: Multiplex
I was not sure, whether it was my first class or not.
He is in the Operation "Sabarimalai Deekhsa".
First Impression: Orthodox ???
There was some "Spark" in those eyes. ( Well, Interesting. What does this spark Resembles? Need to find out!!! )
"పదునెక్కిన వేటకత్తి" గురించి వినడమేకానీ ఎప్పుడూ చూడలేదు!!!
బహుశా దాని పదును ఈ "చూపులలానే" ఉంటుందేమో!!!


Scene-2 ( Flash Back )

Screen: Black & White
Date: The calender hanging to the wall is slightly visible. The year is some what in 90's)
Time: Election Time
Place: ( Highly Confidential )
Issue: A mass attack between two groups of the village. Suddenly a kid kicked the opposition guy at point black Range. There was a "Spark" in him.
First word I spoke to him. "Swaami Saranam". Reply was the "Same" with a Smile - (Again the Spark).

Scene - 1 ( Continued...)
With in two or three days, we became a moderate friends.
Then entered two things between both of us - Telugu desam party & Baalayya babu

Then at last I found the meaning of spark behind his eyes.
Its the Spark that a leadership demands.
Its the Spark that shows what a leader can do to back his followers.
Its the Spark that is going to En-light & bring back the forgotten glory of Telugudesam. 
Its the Spark of "Teja - As the name says"


నేను ఒంటరి తనపు చీకట్లలో చిక్కుకున్నపుడు తను నాకు దారిచూపే "వెలుగు రేఖ"....నేను దారి తప్పినపుడు తను నాకు మార్గాన్ని చూపే "మార్గదర్శి"...నేను తప్పటడుగు వేస్తున్నపుడు తను నా చొక్కా పట్టుకుని లాగి అడుగు పక్కకు వేయించే "ఆత్మీయురాలు"...నేను ఏడుస్తున్నపుడు నా వెన్ను తట్టి ధైర్యం చెప్పి నన్ను ప్రోత్సహించే "నేస్తం"...అందుకే తను నాకు చల్లని వెన్నెల  కురిపించే చందమామతో "సరి సమానం"...

2)
నాకంటే నిన్నే ఎక్కువగా ప్రేమించా...
అలా నిన్ను ప్రేమించినందుకు ఇపుడు నన్ను నేను ద్వేషిస్తున్న!!!
 
3) చీకట్లలో ఉన్న నన్ను చేయి పట్టి నీ వైపు నడిపించింది నువ్వు..
    నీ దరి చేరగానే  నన్ను ఒంటరిగా అంధకారంలోకి తోసేసింది నువ్వు!! భగత్!!

నేను ఒంటరిని కాదు...
ఒంటరితనం నన్ను ఎప్పుడూ తాకలేదు...

చీకట్లు నాతో ఉన్నాయ్
సూర్యుని వెలుగు రేఖలు నాతో ఉన్నాయ్..

నిశ్శబ్దం నాతో ఉంది..
ఆకాశాన తలుకులీనే తారలు నాతో ఉన్నాయ్

చందమామ నాతో ఉన్నాడు
పసిపాపల bosi 


మూగబోయిన నీ గొంతుని చూసి విప్లవ తల్లి గుండె పగిలే ఉంటుంది........
చలనం లేని నిన్ను చూసి  కలకత్తా కాళి జల-జలా కన్నీరు  కార్చే ఉంటుంది.........
నిర్జీవమైన నీ పార్ధివ శరీరాన్ని చూసి  ఎర్ర బావుటా నల్లరంగు పులుముకునే ఉంటుంది...
25 వత్సరాలు నిన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకున్న  "బెంగాల్" రాజ్య సింహాసనం నీ అంతిమ యాత్రను చూసి గుండెలవిసేలా ఏడ్చే ఉంటుంది...
బెంగాలు బెబ్బులి నీకు కడసారి "లాల్ సలాం" పలికే ఉంటుంది...
ప్రపంచ కమ్మునిష్టు సానుభూతి పరుల మనసులు మూగబోయే ఉంటాయి...

అయనా నువ్వు ఎక్కడకు పోయావు???
ఉదయించే సూర్యుడిలో మాకు నువ్వు కనిపిస్తావ్...
ఉవ్వెత్తున ఎగసిపడే ఉద్యమ జ్వాలల్లో నువ్వే కనిపిస్తావ్....
బింగించిన పిడికిళ్ళలో నువ్వు కనిపిస్తావ్...
తల ఎత్తుకు ఎగిరే ఎర్ర బావుటాలో నీ చెదరని చిరు నవ్వే కనిపిస్తుంది...
చీకటి మాటున ఎగసిపడే వేకువ "జ్యోతుల్లో" నీ అడుగు జాడలే కనిపిస్తాయి..
సామ్రాజ్యవాదుల వెన్నులో పుట్టే చలిలో మాకు నువ్వు కనిపిస్తావ్...
భస్మాసుర, బకాసుర ప్రభుత్వాల పై జరిగే విప్లవ పోరాటాల్లో నీ పొలికేకలు మాకు వినిపిస్తాయి..
విజయ గర్వంతో మేము చేసే "లాల్ సలాముల్లో" నీ పేరే వినిపిస్తుంది....

అయనా నువ్వు ఎక్కడకు పోయావు???
స్టాలిన్, లెనిన్, కార్లమాక్సుల చెంతకేగా...
చేగువేరా, పుచ్చలపల్లి, తరిమెల నాగిరెడ్డి పిలుపు మేరకే గా..
స్వర్గంలో ఎర్రబావుటా ఎగరేయడానికే గా...

నీ మరణానికి విప్లవ తల్లి కళ్ళనుండి రక్తం కారే ఉంటుంది...... 
నీ మరణానికి సంఘీభావంగా ఎర్ర బావుటా నల్లరంగు పులుముకునే ఉంటుంది...
 

నువ్వు పలకరించగానే గతాన్ని మరచి నీ వెనక తోక ఉపుకుంటూ తిరగడానికి
నేనేమి నీ పెంపుడు కుక్కని కాదు...

నువ్వు నీ ఇష్టం ఒచ్చినట్లు ఆడుకోవడానికి నా మనసు నీ అల్మారాలో ఆట వస్తువు కాదు..

నాకు ఒక మనసు ఉంటుంది అని...
దానికీ స్పందనలు-ప్రతి స్పందనలు ఉంటాయి అని...
మరిచి పోయావా?

రక్తం రుచిమరిగిన రాబందులు ఈ రాజకీయ నాయకులు

నీ పెదవులపై విరిసిన చిరు మందహాసాలు
నా మదిలో పూయించెను మధుర మకరందాలు

ఆ నీ చిరు నగవులు ఆడెను
నా గుండెలతో చేలగాటాలు

చెలీ ఎవరు నీవు?
తొలకరి తొలి వాన జల్లువా?
సంధ్యా రాగానివా?
వెన్నెల వాసంతానివా?
ఏరువా? సెలఏరువా?
కోయిల పాటవా?
మధుర మకరందానివా?
లేడి చంగువా?
హంస వయ్యారానివా?

ఆకాశాన మెరిసే తారవా?
శతకోటి కాంతుల కల్పనవా?

కలలో నన్ను కలవరపెట్టిన కాంతవు నీవేనా?
నా మదిలో తీయటి మానసిక సంఘర్షణకు కారణం నువ్వేనా?

నీ తలపుల తుళ్ళింతలో నన్ను తాడిపావు
నీ చూపుల బాణాలతో నన్ను బంధించావు
నీ ఊహల ఊయలలో నన్ను కుదిపి కదిపావు

ఎంత మరచిపోదామన్నా మరల మరల గుర్తొచ్చి
నా గుండెల్లో గోల పెడుతున్నావు ...
తనువంతా ఏదో తీయదనంతో తదిపెస్తున్నావు  


చూపించాల్సినవి చూపిస్తూ..
చూపించ కూడనివి చూపించకుండా...
అంది అందనట్లు ఉండే చందమామ "చీర"