Sunday, August 16, 2009

No change in Ppl

పుట్టుకతో ఎవడూ "మహాత్ముడు " కాడు..
పుట్టుకతోనే ఎవడూ "దుర్మార్గుడు" కాడు...

పుట్టినప్పుడు ఎవరూ చెడ్డవాడుగా పుట్టడు....
కాలం, పరిస్తుతులు వాళ్ళను చెడ్డ వాళ్ళు గా మారుస్తాయి ...
సమాజం, సంఘం, అవిటి ప్రభుత్వం వాళ్ళను చెడ్డవాళ్ళగా చేస్తాయి...

ఆకలి బాధకు తట్టుకోలేక "ఆయుధాన్ని" ఆశ్రయిస్తాడు ఒకడు...
ప్రజల ఆకలి కేకలను తీర్చడానికి తనని తాను "ఆయుధంగా" మార్చుకొని "అరణ్యం" వైపు అడుగులు వేస్తాడు మరొకడు..
ప్రజలకు ఆకాశంలో చందమామను "అద్దంలో" చూపి "అసెంబ్లీ" వైపు అడుగు వేస్తాడు ఇంకొకడు...

అడువుల్లోకి వెళ్ళిన వారు ప్రజల్లో చైతన్యాన్ని తెస్తారట..
అస్సంబ్లీకి వెళ్ళిన వారు "శాసన సభ" దద్దరిల్లేలా ప్రజా సమస్యలు ఏకరువు పెడతారట...

అయినా ప్రజల ఆత్మహత్యలు ఆగడం లేదు..
వారి బాధలు తీరడం లేదు..

His suicide..

చెప్పులు అరిగేలా తిరిగినా ఉద్యోగం దొరకక..
మంచంలో మాయదారి రోగంతో చావు-బతుకుల మధ్య పోరాడుతున్న ముసలి తల్లికి మందలు కొనలేక...
చేతకానివాడు అని సమాజం ముద్ర వేసిమానసికంగా వెలి వేసి,
ఓర కంట చూస్తున్న ఆ "వికారపు" చూపులను తట్టుకోలేక...
పాల వాడి, పచారి కొట్టు వాడి బాకీ తీర్చలేక....
అప్పుల బాధ తాళలేక, పేగులను మెలి వేస్తున్న ఆకలిని బాధను చంపుకోలేక..
బక్క చిక్కి, నోట మాట రాక, నీరసంతో నవ్వే కొడుకు మోము చూడలేక..
తనతో ఏడడుగులు నడిచిన దౌర్భాగ్యానికి -
పాతికేళ్ళ నవ యవ్వన ప్రాయంలో
పండు ముదుసలి తనాన్ని ఆపాదించుకున్న
భార్య ఇంకిపోయిన కన్నీటి కళ్ళలోకి చూడలేక.....

ఉరి తాడుని బంగారపు గొలుసులా మెడకు అలంకరించుకొని..
చావుని చిరు నవ్వుతో ఆహ్వానించి...
యమ భూపాలుడిని వాకిట నిలచాడు ఒక "మడిసి"

ఈ "మడిసి" చావుకు కారణం ఎవరు??
అప్పు తిరిగిమ్మని అడిగిన పాల వాడా/పచారీ కొట్టు వాడా ?
మంచంలో మూలుగుతున్న ముసలి తల్లా?
కడుపున పుట్టి కొరివి పెట్టిన కొడుకా?
పెళ్లి చేసుకొని వైధవ్యాన్ని మూటకట్టుకున్న భార్యనా?
స్వయంకృతాపరాధమా?
సమాజమా?
పాలక ప్రభుత్వ వైఫల్యమా?

Thursday, August 13, 2009

Missing u...

Missing U when I open my eyes in the Morning....
Missing u when I close my eyes in the late night....
Missing u when i am seeing the Stars in the sky...
Missing u when am feeling the Rainbow bow before me....
Missing u when am Jumping in Joy.....
Missing U when am feeling pain...
Missing u when am drowning in Rain [:(]

PULIkonda's Collection

  • When i'm walking in front of you, i'm protecting you. When i'm beside you i'm there for you, when i'm behind you, I'm watching over you. When i'm alone, i'm thinking of you.
  • We've known each other by CHANCE, became friends by CHOICE, still friends by DECISION. And when we say FRIEND FOREVER, that's definitely a lifetime PROMISE!
  • Wherever you go, whatever you do, may God's angels watch over you.
  • Friend: someone who tells you things •My friendship is not a game to play nor a word to say. It doesn't start on March and end on May but it is yesterday, today, tomorrow and everyday.
  • I may have forgotten to say that I care. I may have failed to open up and share, but though no words have been spoken, my promise of friendship won't be broken.
  • Knowing a friend like you has made me happy in a million ways and if ever I have to let you go I would find a million reasons to make you stay while you are alive, things that others tell after you die...
  • As the day turns into night, keep your worries out of sight.Close your eyes and go to sleep,All the good times are yours to keep.
  • Art of living: First of all,dont make friends. if made,dont go close to them. if gone,dont like them. if liked,then plz.. dont leave them.
  • Since ur eyes are looking tired…Let ur eye lashes hug each other for few hours. Happy journey into the world of dreams..
( Thank "U" Dear "Puli, for sharing this stuff with me)




Friday, August 7, 2009

U

నీ కళ్ళు కార్తీక దీపాలు
నీ చూపులు సన్నజాజులు
నీ స్వరం స్వర్ణ కమలం
నీ పాల బుగ్గలు నందివర్ధనాలు
నీ చిలిపి చెక్కిళ్ళు చిట్టి చేమంతులు
నీ పెదవులు కాశ్మీర కుంకుమ పూవులు
నీ మాటలు ముత్యాలు
నీ నవ్వులు కెంపులు
నీ తేజస్సు ఉషస్సు
నీ మనసు ఛందస్సు



Politcs

రాజకీయంలో రాక్షస పర్వం పురుడుపోసుకుంది
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోంది
సమాజంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది
జాతి, కుల, మాట, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతోంది
సమాజాన్ని చదరంగంగా మార్చి,
ప్రజలను పావులుగా మలచి,
దేశ ప్రగతి ప్రాణం తీస్తోంది..
భవితకు బంధనాలు వేస్తోంది
చీడ పురుగులను పెంచి పోషిస్తోంది..



Proverbs - 2

  1. Give a man a fish, he will eat for a day. Teach him how to fish and he will eat for ever.
  2. Don't compare yourself with any one in this world. If you compare, you are insulting urself.
  3. No one will manufacture a lock with out a key. Similarly, God won't give problems without solutions.
  4. Life laughs at you when you are unhappy. Life smiles at you when you are happy. Life salutes you when you make others happy.
  5. Every successful person has a painful story. Every painful story has a successful ending. Accept the pain and get ready for success.
  6. Easy is to judge the mistakes of others. Difficult is to recognize our own mistakes. It is easier to protect your feet with slippers than cover the earth with carpet.
  7. No one can go back and change a bad beginning. But anyone can start now and create a successful ending.
  8. If a problem can be solved, no need to worry about it. If a problem cannot be solved what is the use of worrying?
  9. Mistakes are painful when they happen. But years later collection of mistakes is called experience, which leads to success.
  10. Be BOLD when u loose. Be calm when you win. Heated Gold becomes ornament. Beated copper becomes wire. Depelted stone becomes statue. So, the more the pain you get in life, you become more valuable.
  11. Everything in life is temporary. Darkness of the night or brightness of teh day. Even Sunrise is tmp and so is sunset. If things go good, enjoy it. It won't last for ever. I things are going bad, Dont worry coz it wont last for ever. Everything just passes by.
  12. The freedom to agress or disagress is the foundation of our society and the freedom to strike is the part of it.
  13. I am a testing stone for people. They can learn about me by the way they take me.
  14. A successful man is one who can lay a firm foundation with the bricks others have thrown at him.
  15. Even a small dot can stop a big sentence. But few more dots can give a continuty.
  16. There are things that must be destroyed-or they will destroy us.
  17. A thing is not high if one can reach it. It is not great if one can reason about it. It is not deep if one can see its bottom.

Proverbs - 1

  • You may delay, but time will not
  • Love all, trust few, do wrong to none.
  • Every thing in the world has its beauty, but not everyone sees it.
  • Patterning ur life around others opinions is nothing more than slavery.
  • Peace cant be achieved through violence, it can be attained only through understanding
  • Civilisation is the process of reducing the infinite to finite.
  • We hang petty thieves and appoint the great ones to public offices.
  • Give to every other human being every right that you claim for youself.
  • If we dont change direction soon, we will end up where we are going.
  • What the world really needs is more love and less paperwork.
  • Try not to become a man of success, but rather try to become a man of value
  • Live out of imagination, not History.
  • In the middile of difficulty lies the opporutunity.
  • One drop of ink makes thousands, perhaps millions think.
  • Never be afraid of moving slowly, be afraid of standing still.
  • Terrorists are not only demolishing the foundations of bulidings. They are even demolishing the foundations of democracy.
  • The tragedy of life is not death, but what we let die inside us while we live.
  • With a mere book learning, men remain fools; the man who acts using his knowledge, he is wise.
  • He who asks question is a fool for a minute; he who asks no questions remains fool for ever.
  • We must paint our own rainbow from the colors we have been given.
  • We are not just our behaviour. We are the person managing our behaviour.
  • The home is the most important school you child will ever attend, parents the childs first most influential teachers.
  • The most imp thing that u can do for u child is to teach him how to love.
  • The larger the island of knowledge, the longer the short line of wonder.
  • To be a leader, you must lead human beings with affection.
  • If you win you need not explain, if u lose you should not be there to explain.
  • Winning doesn't always mean being first; winning means you've done better than you've done before.
  • If some one feels that they had never made a mistake in their life, that means they had never tried a new thing in their life.
  • Everyone thinks of changing the world. But no one thinks of changing himself.
  • If you start judgning people, you will be having no time to love them.
  • If we can't love the person whom we see, how can we love God, whom we can't see.
  • In a day - when u don't come across any problems, you can be sure that you are travelling in a wrong path.
  • Every thing is fair in LOVE & POLITICS.
  • No Great work is impossible. The word itself say I M Possible.
  • Good judgement comes from experience & experience comes from bad judgements.
  • When you fall, Don't see the place where you fell, instead see the place from where you slipped. Life is about correcting mistakes.

Bhaggu Captions - 4

  • Today I might be ZERO, but I am sure one day I will become a HERO
  • A leader shud nvr cry, he must be able to wipe the tears shedding from the eyes of his followers.
  • You cannot stop the rain drops from kissing the MUD. You can nvr stop the just born baby from reaching the mothers lap.
  • We cant make omlet with out eggs.
  • Change is the basic principle of the universe. Everything changes. Seasons, leaves, flowers, birds, morals, men and buildings. Its a dialectic process.
  • If u want something to grow, you dont nurture each seed separately. You just spread a certain fertilizer. Nature will do the rest.
  • I Love u as selfishly as the fact that I exist. As selfishly as my lungs breath air.
  • I am now like a sentry in the strom, who knows that he has to take it and has to remain there even when he can take it no longer.
  • You can devote your life to pulling out each single weed as it comes up (or) you can prepare your soil in such a manner that it will be impossible for weeds to grow.
  • One loses every thing when one loses ones sense of Humour
  • Be in the world, like the Lotus leaf whose roots are in the mud but which remains pure.
  • If an egg is broken due to the force from outside "A life Dies". If an egg is broken from within "A life Begins". Great things always being from with in "U".
  • Smooth roads never make good drivers. Calm see never make good sailors. Problem free life never make a strong person. Dont ask life - Why ME? But say- Try ME.

We, Indians

మేము కరచాలనం చేసాము -
మీరు కత్తులు దూశారు
మేము సోదర భావంతో ఆలింగనం చేసుకున్నాము -
మత చాందసవాదంతో మీరు ఆత్మాహుతి దాడులు చేసారు
మేము శాంతి కపోతాలు ఎగురవేసాము -
మీరు విషపు వాయువులు కక్కారు!!!

మా మౌనం చేత కాని తనం కాదు
ఆ మౌనం మనసు పగిలి, కడుపు మండి, కన్నెర్రబడితే
ఆ కళ్ళనుండి దూసుకు వచ్చే
నిప్పు కణికలు ఉగ్రవాదాన్ని ఉప్పు పాతర వేయగలవు
ఉగ్రవాదాన్ని మాపై ఉసిగొలుపుతున్న పోరుగుదేసాన్ని పాతాళానికి తోక్కేయ్యగలవు!!!

ఇక యుద్ధభేరి మొగిద్దాం
సమరశంఖం పూరిద్దాం
ఉగ్రవాదాన్ని తరిమికోడదాం

మన ధైర్యమే మన అస్త్రం
మన మంచితనమే మన కవచం
పృథ్వి, అగ్ని, వాయు, ఆకాష్, నాగ లే మన బలం

Who r u - 2?

నీ పెదవులపై విరిసిన చిరు మందహాసాలు
నా మదిలో పూయించెను మధుర మకరందాలు

ఆ నీ చిరు నగవులు
ఆడెను
నా గుండెలతో చేలగాటాలు

చెలీ ఎవరు నీవు?
తొలకరి తొలి వాన జల్లువా?
సంధ్యా రాగానివా?
వెన్నెల వాసంతానివా?
ఏరువా? సెలఏరువా?
కోయిల పాటవా?
మధుర మకరందానివా?
లేడి చంగువా?
హంస వయ్యారానివా?

ఆకాశాన మెరిసే తారవా?
శతకోటి కాంతుల కల్పనవా?

కలలో నన్ను కలవరపెట్టిన కాంతవు నీవేనా?
నా మదిలో తీయటి మానసిక సంఘర్షణకు కారణం నువ్వేనా?

నీ తలపుల తుళ్ళింతలో నన్ను తాడిపావు
నీ చూపుల బాణాలతో నన్ను బంధించావు
నీ ఊహల ఊయలలో నన్ను కుదిపి కదిపావు

ఎంత మరచిపోదామన్నా మరల మరల గుర్తొచ్చి
నా గుండెల్లో గోల పెడుతున్నావు ...
తనువంతా ఏదో తీయదనంతో తడిపేస్తున్నావు..


U

అతడు కన్నెర్ర చేసి కత్తి పట్టినా
గొంతెత్తి దిక్కులు పిక్కటిల్లేలా గర్జించినా
కాలంతో కలకలం సృష్టించినా
కాళ్ళకు గజ్జ కట్టి శివతాండవం చేసినా
అది బాధిత పీడిత ప్రజల కోసమే!!!

అతను వస్తాడని..
వారి చీకటి బతుకుల్లో వెలుగులు తెస్తాడని..
వారి కన్నీటి ప్రవాహాలకు ఆనకట్ట వేసి...
వారి బాధలకు సమాధి కడతాడని ఎదురు చూస్తున్నారు...

అతని రాక వారికి సంక్రాంతి
అతని బాట వారికి "క్రాంతి"
అతని మాట వారికి "వేదం" - అదే వారికి "ప్రణవనాదం"
అతడే వారికి దిశా-నిర్దేశం చేసే సూర్యోదయం
అతడు కన్నెర్ర చేస్తే అదురుతుంది భూగోళం



YOU

చీకటిలో నా చేయిపట్టి నడిపించింది నువ్వు
నాపై వెలుగులు చిమ్మగానే నన్ను అంధకారంలోకి తోసేసింది నువ్వు

నాకు నవ్వడం నేర్పింది నువ్వు
నా నవ్వులను కాజేసింది నువ్వు

నాకు ఆనందం కలిగించింది నువ్వు
నాకు వ్యధను మిగిల్చింది నువ్వు

నాకు వానలో తడవడం నేర్పింది నువ్వు
నన్ను వానలో ఏడుస్తూ నిలిపింది నువ్వు

నన్ను ఆశల ఆకాశానికి ఎగరవేసింది నువ్వు
నన్ను ఒంటరి తనపు పాతాళానికి తోసేసింది నువ్వు

నా ఊహలకు రెక్కలు తొడిగింది నువ్వు
నా తొడిగిన రెక్కలను ముక్కలు చేసింది నువ్వు

నా హృదయంలో ప్రేమను పుట్టించింది నువ్వు
నా హృదయంలో ప్రళయం సృష్టించింది నువ్వు

నా జీవన సరాగంలో ఓ కొత్త రాగానివి నువ్వు
నా హృదయంలో ఓ తిరిగి రాని ఉదయం నువ్వు
నా జీ"వనం"లో సుందర "వనానివి" నువ్వు
నా డైరీలో ఓ చిలిపి పేజీవి నువ్వు


Thursday, August 6, 2009

My path

పోరాటం నా పంధా
గెలుపే నా అజెండా

గతానికి ఘోరీ కడతా
వర్తమానంపై స్వారీ చేస్తా

బిగించిన పిడికిళ్ళు నా ఆయుధం
అలుపెరుగని సూర్య-చంద్రులే నాకు ఆదర్శం
ఉప్పొంగే ఉత్సాహం నా సొంతం...


He he eh

ఆ చూపులు చిలిపిదనాన్ని చిలకరిస్తాయి
ఆ పెదవులు కొంటెదనాన్ని పలికిస్తాయి..
ఆ నవ్వులు ఆకాశంలోని తారల కాంతులతో తలబడతాయి..
ఆ బుగ్గలు OLD బ్రాందిలా కిక్కెక్కిస్తాయి
వర్షంలో మిర్చి బజ్జి అంత HOT గా ఉంటుంది
మండుటెండలో ఐస్-క్రీం అంత KOOL గా ఉంటుంది...


Keep Smiling always dear deyyam....

చల్లని చందమామలా
తెల్లని వెన్నెల వసంతంలా
పచ్చని పైరు గాలిలా
కమ్మని కోకిలమ్మ పాటలా
తొలకరి తొలి వాన జల్లులా

చలచల్లని సాయం సంధ్యల
వెచ్చని ఉదయభానుని తొలి వెలుగు రేఖలా
కోటి అందాల కొనసీమలా
ప్రకృతి ఒడిలో పలకరించి పులకరింపచేసే పాపికొండల అందాలలా

పసి పాప చిరునవ్వులా
తాతయ్య బోసి నవ్వులా
గల-గల పారే గోదారిలా
ఏటిలా-సెలయేటిలా
నువ్వు కలకాలం నవ్వుతూ-తుళ్ళుతూ ఉండాలి నేస్తం..

Untitled

నా కవితా ప్రవాహపు తొలి అక్షరం
నీ పరిచయంతో మొదలయ్యింది..

నీ కలయికతో ఆ నా పదలాలిత్యం
ఆకాశానికి ఎకబాకింది

నీ ఊహల ఊసుల ఊయలలో
నీ తలపుల వలపు తీరాలలో
అది చిగురించింది

నీ చెలిమితో నూతన సౌందర్యాన్ని అద్డుకుంది..
నీ విరహంతో వెల వెల పోయింది



Who R u??

చెలీ ఎవరు నీవు?
గలగల పారే ఏరువా??
సెలయేటికి నాట్యం నేర్పిన మయూరివా?
కోయిలకు రాగం నేర్పిన కోమలివా?
హంసకు హొయలు నేర్పిన హిమ శిఖరానివా?
రామచిలుకకు పలుకు నేర్పిన రాణి వాసానివా?
వెన్నెలకు వెలుగులు అద్దిన వలపు పుష్పానివా?
ఎవరు నీవు??


పాల మీగడవా ?
పున్నమి వెన్నెలవా?
సాయం సంధ్యవా?
సంధ్యా రాగానివా?
దేవ కన్యవా?
ముగ్ధ మందారానివా?
తొలకరి తోలి వాన జల్లువా?
పచ్చని పైరువా?
నవ వసంతానివా?
పెరటిలోని తుంటరి తూనీగవా?
ఎవరు నీవు??



yuvatha - desa bhavita

నీ పేరు "యువత"
నీ చేతిలోనే ఉంది దేశ "భవిత"

ముళ్ళదారిని పూల బాటగా మార్చగలవు
REVOLUTION ని పుట్టించగలవు
RESOLUTIONS ని చూప గలవు
బుల్లెట్లను ఎదిరించి గలవు
బ్యాలెట్టుతో దేశ భవితను మార్చేయ్య గలవు

కొండలను పిండి చేయగలవు
ఆకాశానికి నిచ్చెన వేసేయ గలవు

బిగించిన పిడికిళ్ళు నీ ఆయుధం
ఎగసిపడే ఆవేశం నీ సొంతం


నీకు ఆవేశం ఎక్కువ
ఆలోచన నీకు మక్కువ

అందుకే అందుకే యువతా మేలుకో
దేశాన్ని ఏలుకో!!!!!!



Met u then...

నా గదిలోపల చీకటిలో
చీకటిలోపల నా గదిలో,
నేనొంటరినై విలపించిన రోజులలో...
నా గుండెల్లోని లావా భళ్ళున పగిలి,
నా కాళ్ళ నుండి ఉప్పెనలా ప్రవహించిన రోజులలో..
నా ప్రస్తానం ప్రస్నార్ధకారంగా మారిన రోజులలో...

ఆ చీకటి-ఆకటి వేళలో నేను ప్రశాంతత కోసం
స్మశానాన్ని ఆశ్రయించి కాలుతున్న కళేబరాలతో,
కాటి కాపరితో కాలక్షేపం చేసిన రోజులలో

నువ్వు కనిపించావు!!!!



Ur Friendship

నా జీవన సరాగంలో
నీ పరిచయం ఓ మధుర జ్ఞాపకం..
చెదరని సంతకం
సుందర కాండం
నందన వనం


kalasi naduddaam

కులాల కుమ్ములాటలు కాటికి పొయెలా....
మతాల మారణ హోమం మూర్చరిల్లేలా...
తరాల తారతమ్యం తొలగిపోయెలా...
చేయి చేయి కలుపుదాం...
వసుధైక కుటుంబం వైపు అడుగులు వేద్దాం...

చిమ్మ చీకాటితో సహజీవనం చేసే
చీకటి సోదరులకు వెల్గు రేఖలము మనమవుదాం...

ఆకలితో అలమటించే అభాగ్యుల కడుపులో చల్ల మనమవుదాం..


సామ్రాజ్య వాద సెక్తుల గుండెల్లో నిద్దరోయె
ఎర్ర బావుటాలం మనమవుదాం....


బాదిత, పీడిత ప్రజల బాగోగులు మన ప్రణవ నాదాలు..
నిరుపేదల ఆర్తనాదాలు మన మంత్రోచ్చరణములు....
అభాగ్యుల సహజీవనం మన తపోవనం...
అన్నార్తుల ఆకలి కేకలు మా అస్త్ర శస్త్రాలు...



Wednesday, August 5, 2009

CAPTIONS by Bhaggu - 3


  • only fools say that nothing like love at first sight exists.I might be remained as a big fool through out my life, if I haven't met her.
  • I heard that love wil be sweet.But why am I experiencing this much pain.
  • I used to take alcohol. But never got the same kick I got when my eyes met with hers.
  • You are the Stylished version of you own stylished version
  • Turning your Slave, So staying away from ur wave.
  • Surely you have been sent from the heaven, to teach us mortals what beauty is..
  • "Sky" ki "moon" andam..."Darkness" ki "light" andam..."Pond"ki "Lotus" andam.."universe/World" ki nee "smile" andam...."Sarie" ki nuvvu "andam"
  • U neither allow me 2 sleep nor awake. Its u in d dream, zoom. Its u in the moon, d stars, d sun, the sky, d flowers, smiles,clouds,sea, wind, rain, sand, air and every where..
  • Ur my sunrise, sunset...ur my hunger, ur my thirst...ur my smile, ur my tear...ur my heart and u became its beat ;)
  • Slowly ur turning me as ur TAIL and locking me in ur JAIL.
  • ఎగసిపడే అలకు అలుపు లేదు..నా మాటకు తిరుగు లేదు..నా దారికి అడ్డు లేదు....
  • She turned me her slave, using the drug named her LOVE
  • I may die one day, will not forget u till that very day.
  • I feel proud to bow my head and kiss the feet of brave soldiers. I feel GREAT to spit on the faces of coward politicians.
  • ఆశయాన్ని అస్త్రంగా మలచి ఆలోచనతో దాన్ని పదును చెయ్యి...
  • The dimple in her smile, made me forget all my worries for a while..

Tuesday, August 4, 2009

Bhaggu Sir captions -2

  • Smiles are back: Not only on my LIPS but also on my HEART :)
  • Using my BRAIN a lot these days...atuvanti balaheena kshanam lo monna office lo naa netti meeda mokkajonna kanndey kaalchukunnaru...ufff anta gaa FIRE coming out from BRIAN :(
  • knchm tikka, knchm tingari, knchm tuntari, knchm mental, knchm tolu mandam ( Telugu)
  • Only 2 things in the world really mesmerized me from inner heart....Glittering Stars in the sky, Sparking smiles on ur pink lips ...
  • Yesterdays TEAR DROP of mine, turned as a PEARL today....
  • Bhaggu Sir ki chinna accident jarigindi....Sir, mokaaliki debba tagilindi....Evarini gurtu pattadam ledu...FANS andaroo samyamanam paatindi
  • నీ జననం అనామకం ఐతే అది నీ తప్పు కాదు...కాని నీ మరణం సంచలనం కాకపోతే అది కచ్చితంగా నీ తప్పే... - Bhagath Castro :)
  • Is there any doctor who can put a full-stop for the regular accidents to my HEART??? [;)]... I am afraid, one day it might BREAK...[:(].
  • pakshula kila kila raavaalu, udaya bhaanuni le leta kiranaalu, naa toli palukulu, virisee viriyani poovulu, pasi paapala bosi navvulu, ..everthing came to wish u Gud Morning ;)
  • kastaalu, kanneellu undavule chaannaallu..Yet 25 days 2 GO. Babu will come to power 2 plant the seeds named SMILES on our faces :)
  • నిజంగా నాదేశానికొక నియంత కావాలి....పొరుగుదేశపు పాకీయులు నా భరత మాత గుండెలపై గుళ్ళ వర్షం కురిపిస్తే కన్నెర్ర చేయలేని చేత కాని, చేవలేని కొజ్జా రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి...
  • when i am happy she is my smile,when i cry she is my tear,when i promise she is my swear.At EOD she is my dear
  • Few of the pages in my Dairy are filled with Tears and ur a chapter in it....
  • Till now so called Clevers ruled the country and left it in a mess. Once give a chance to me. I will show you the POWER of the stone in Fools hand :P
  • I mi8 be a FOOL now and the ball hit by me mi8 be FOUL...No sooner, I will be considered as WISE and the ball kicked by me will turn as GOAL...
  • రక్తాన్ని చిందించి, ప్రాణాలు అర్పించి, బంధాలు త్యజించి ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల నుండి ప్రభుత్వంపై జరిగే ప్రజా తిరుగుబాటు విప్లవం
  • my heart is hard disk. It has many partitions
  • Is it manners 4 u to come in to my dreams with out knocking my heart??? If u repeat it again, I will seriously think of lodging a nuisance case against U..
  • Fans call me DONKEY, Donga Moham, Donga, Stupid, Tingarodu......Franky Speaking, I am a TESTING STONE 4 pupil, they can LEARN from me, by the way they TAKE me [:D]
  • nee kalaloki nenu vochchi ninnu kalavara peditE adi naa tappaaa?? Mari nuvvu naa kalaloki vochchi naannu kalavara pettinappudo???
  • Prajaa sankshemam naa DHYEYAM...prajalu naa DAIVAM.....vaare naa DHAIRYAM....Ide naa NINAADAM.....
  • అన్నప్రాసన రోజే గన్ను, పెన్ను పట్టుకున్నా. విప్లవం నేను తాగిన ఉగ్గు పాలు....ఉద్యమ సాహిత్యం నాకు పెదబాల శిక్ష...
  • Battle Started. I m sure at the end its me who is going to kiss and Hug the victory. Bcz, I am going to kill the defeat....Its my Dream and my aim....
  • one beauty naa manasu looty chesindi....
  • ఆ చూపులు అంధకారాన్ని పారద్రొలే వెలుగు రెఖలు ...ఆ మాటలు ఉత్సాహాన్ని నింపే విధుత్తరంగాలు..
    ఆ నవ్వులు ప్రజల గుండెల్లో పూయించును పువ్వులు...అవి స్వార్ధ పాలకుల గుండెల్లో భగ భగ మండే కాగడాల దివ్వెలు...
  • 24/7 నీ తలపుల...వలపుల మత్తుల గమ్మత్తుల లో

CAPTIONS by Bhaggu - 1

  • Teddy I bought for you is shedding tears, just like me
  • Your silence is developing unberable violence in my heart.
  • Slowly my Tears are being replaced with the flowers blossomed with ur smiles.
  • Life is always not a BED of roses. At times you also need to sleep on Thrones. Be prepared to it.
  • When the world is vibrating in violence, he stepped in to the world and turned as Chilly for the wounded hearts and became the weapon in their hands. His intension is not to save them from the intruders, but to zeroin the intruders.
  • Life has become a best teacher for me. Every day its teaching me a unique lesson and turning me much more tougher. Thanks for each and every circumstances that are shaping me like a ROCK.
  • My heart is Empty. Win with love.
  • nee kanu saigato naa dil kabjaa chesaav(Telugu).
  • churaa liyaa meraa dil tujhne ( Hindi).
  • nee dhyaasalo dimaak kharaab(Telugu)
  • Calm before Strom.

The Princess from the Heaven...

నిజంగా నువ్వు మనిషివి కాదు కదు..

శాపవశాత్తు దివి నుండి భువికి దిగి వచ్చిన గాంధర్వ కాంతవు నీవే కదూ..
అజంతా శిల్పాలకు రాణివి నువ్వే కదూ..
కాళిదాసు కలం నుండి పురుడుపోసుకున్న వసంతసేనవు నీవే కదూ...
"లియోనార్డో డ విన్సి" మనసు నుండి మొలిచిన మొనాలిసవు నువ్వే కదు..

పాల మీగడ నీ మేలిమి ఛాయే కదూ..
ఇంద్రధనసు నీ పెదవులపై విరిసిన చిరునవ్వే కదూ...
నిండు పున్నమి వెన్నెల వెలుగులు నీ కాంతులే కదూ..
కర్పూరం నీ శ్వేద బిందువే కదూ ..
సూర్య చంద్రులు నీ కనులే కదూ..
కాశ్మీర్ యాపిల్ ఎర్ర బడ్డ నీ బుగ్గలే కదూ..
ఆకాశాన మెరుపులు భువిపై నీ విరుపులే కదూ..

బ్రహ్మ దేవుని మానస పుత్రికవు నువ్వే కదూ..
సాగర మధనంలో ఉద్భవించిన మోహినివి నీవే కదూ..
నెమలికి నాట్యం-కోయిలకు రాగం నేర్పిన సుందరివి నీవే కదూ...

అలలు నీకై సముద్రుని మదిలో రేగే అలజడులే కదూ..
చిరుజల్లు వరుణుడు నీ కోసం విసిరే వలపు బాణాలే కదూ...

సౌందర్యానికి చిహ్నం నువ్వే కదూ..
ఆప్యాయతలకు అడ్రస్ నువ్వే కదూ..
మన్మధుడి ఫ్యాషన్ స్కూల్లో TOP "మోడల్" వి నువ్వే కదూ..



Sunday, August 2, 2009

The letter

రాయాలని ఉంది నీకొక లేఖ
కట్టలు తెంచుకు వస్తున్న నా కన్నీటికి ఆనకట్ట కట్టలేక...
ఇకపై నిన్ను చూస్తానో లేదో అన్న బాధ గుండె లోతుల్లో దాచుకోలేక...
నువ్వంటే నాకు ఎంత అనురాగమో నీకు చెప్పలేక...
ఈ నా ఆవేదనను ఎవరితో పంచుకోలేక..
రాయాలని ఉంది నీకొక లేఖ

ఒంటరిగా ఉండలేక...
ఎవరినీ కలవలేక..
కలసినా మాట్లాడలేక..
ఆకలి లేక..
నిద్ర రాక..
నిన్ను మరచిపోలేక - అది నాకు చేత కాక..
రాయాలని ఉంది నీకొక లేఖ ..

తడిసిన కనులతో,
అదురుతున్న గుండెతో,
వణుకుతున్న చేతులతో,
బొంగురుపోయిన గొంతుతో ..
రాయాలని ఉంది నీకొక లేఖ ..

నా ఈ బాధకు నువ్వు కారణం కాదు అని తెలిసినా..
అందులో నీ తప్పేమీ లేదని తెలిసినా..
నా వల్ల నువ్వు కూడా బాధ పడుతున్నవని తెలిసినా...
నువ్వు నా స్నేహాన్ని వదలవని తెలిసినా..
మనసు ఒప్పుకోక రాయాలని ఉంది నీకొక లేఖ..

నా ఈ పిచ్చి రాతలతో
నిన్ను బాధిస్తే కోపగించక మన్నించుమా నన్నికి..




Saturday, August 1, 2009

One day @ Train

Its Raining...

I am dancing..

Beauty is passing...

My eyes started twinkling..

Heart started shivering..

Cuty started laughing...

I started mesmerizing..

she is now and then watching....

Train felt jelous and started moving...

Sweety left me crying....



MIss

Miss...
Let me not miss my heart...
Bless me with your love....
That makes every day a joy to live...

Let me not loose my life....
In the thoughts of u......

Show me ur smile...
Which makes me forget entire world for a while...

U made me cry....
with the utmost joy......

Your presence made me a kid...
Where I recollected my childhood......

Ur though brought me jackpot...
Ur eyes....made me ice...

My heart felt the pressure of pleasure.
My mind revolved around u like wind...
The barriers were buried with the heat of our love...
Nature too became naughty with our thoughts.

Let me chill in the feel of u....
Sun too became nothing with ur silky hair...
Ur bubbly cheeks recollected me of moonly thoughts.

Ur joy made be enjoy....
U made me ur slave.....
That made me forget even my Grave.

Ur talk....Made me walk....
Ur walk.......Made me Rock.
U made me strong.....
Ur love made me MAD...
That made doctor Grand...

Why don't u express....
That made me depress.....
However your very thought .....
Changed me like a human a lot.....



Wanna a Dictator

నిజంగా నాదేశానికొక నియంత కావాలి....

పొరుగుదేశపు పాకీయులు నా భరత మాత గుండెలపై గుళ్ళ వర్షం కురిపిస్తే

కన్నెర్ర చేయలేని చేత కాని,

చేవలేని కొజ్జా రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి...

నిజంగా నా దేసానికొక నియంత కావాలి..

ఆకలితో పోరాడలేక "ఆకలి చావులను" కౌగలించుకుంటున్న

అన్నదాతల ఆక్రోసాలని ఆర్పేటందుకు...

నిరాశతో నీరసించి పోతున్న నిరుద్యోగుల కళ్ళల్లో కాంతులు రగిలించడానికి...



Mahaa kootami

జెండాపై సామాన్యుడి అసామాన్య సైకిలు...
కర్షకుడి కంకి-కొడవలి, కార్మికుడి సుత్తి...
విజయాశ్వాలుగా రాఘవులు, నారాయణ...
కే.సి.ఆర్ రధసారధ్యం...
ప్రజా గాండీవాన్ని ధరించి, విజయ విలాసంతో చంద్రబాబు ముందుకు సాగగా...

పోరాటాల ఎర్రదండు ప్రళయ తాండవం సేయగా..
ప్రగతిశీల పసుపు సేన సునామీ సృష్టించగా...
దగా పడ్డ తెలంగాణా ఆత్మఘోష ఘీంకరించి, గర్జించగా...
పసుపు. ఎరుపు, గులాబీలు పంచకల్యాణిలై..
ప్రజాకంటక ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన నాడు...

కర్షకుని కన్నీరు కాలకూట విషంగా మారిన నాడు..
కార్మికుని మౌన రోదన యుద్ధభేరి గా మోగిన నాడు...
యువత రక్తం ఉడికిన నాడు....
సామాన్యుడి శాంతి చచ్చిన నాడు...
మధ్యతరగతి వాడి కడుపు మండిన నాడు...
పేదవాడి గూడు చెదిరిన నాడు...

ఎగసిపడే ప్రజా-ఆగ్రహహోరుగాలులలో ...
భూబకాసుర ప్రభుత్వ కోటలు బీటలు పడ్డ నాడు...

మరోమహోదయం ఉదయిస్తుంది...
ఆకాశంలో సూర్యుడు పసుపు రంగు పులుముకుంటాడు...
తెలుగు లోగిల్లు పసుపు పరవళ్ళు తొక్కుతాయి...
తెలుగు ఆడపడుచులు నుదుట పసుపు-కుంకంలతో కళ-కళలాడతారు....
ప్రజల పెదవులపై చిరు నగవుల పూలు పూస్తవి...


untitled

లోకమంతా చమ్మ చీకట్లు, భరించలేని నిశ్శబ్దం - నా మనసులాగే....
ఆకాశంలో అంధకారాన్ని పారద్రోలే తారలు- నీ నవ్వులా..


untitled

నిను మరచిన క్షణం లేదు..

నిను తలువని ఘడియ లేదు...

నా ఎదలో అలజడివి,

నా మదిలో చిలిపి సవ్వడివి నీవే....

ఉదయ భానుని తొలి వెలుగు రేఖవు,

సాయం సమయాన సెలయేటి స..రి..గ...మ..ప..ద...ని...సల సరాగానివి నీవే...



Fight

సంధి పొసగలేదు..

సుషుమ్నావస్తలో సేదదీరుతున్న సైనికులారా...

కదం తొక్కండి...

కాల యముని వలె గర్జించండి..

విప్లవ శంకం పూరించండి..

విజయ బావుటా ఎగరేయండి..