Friday, July 27, 2012

Deepika

She is not the first Girl by seeing whom, I was like " yep... It's love at first sight.. Bloody... Not Again..". This is the matter of couple of years ago. But of sure she is the "only girl" who still catches my stare, complete attention and pleasant emotions when ever our paths met....

Your just a matchless princess... Deepika... Deepika padukone...

Monday, July 23, 2012

Baadshaw

పాపాయి గా ఉన్నప్పుడు పాల సీసా... మీసాలు మొలిచినాక మోనాలిసా..
తల నెరిసినాక మందు సీసా..
ఇవే కదా మడిసి జీవితానికి నిషా...
అని లోకానికి చాటి చెబుతున్నాడు ఈ బాద్షా!!

Sunday, July 22, 2012

I may not assure you a Big-Bungalow. But I can promise you a place in my heart. I may not promise you a car, but I can assure you that I will stay beside you in all walks of life, holding ur hand. I may not promise you a millions or heaps of fortune, but I can assure you bounds of love & happiness - Alien In Red

Saturday, July 21, 2012

Quote ( Red )

భరత మాట నుదుటి పై ఎర్ర సింధూరం!!
సామ్యవాదం పెరటిలో పూచిన ఎర్ర మందారం!! ( భగత్ )!!

Thursday, July 12, 2012

ప్రపంచం ప్రశాంతంగా ముసుగు తన్ని నిద్దరోతున్న వేళ  ఆకాశంలో చుక్కల సాక్షిగా
స్మశానంలో కాలుతున్న కళేబరాల  సాక్షిగా 
కాలుతున్న పీనుగుల చుట్టూ మూగి మొరుగుతున్న  నక్కల సాక్షిగా 
నేను ఆవాహన చేస్తున్నా!!
రా కదిల రా!!!
మనిషిని మనిషి పీక్కు తినే ఈ లోకంలో 
కన్నీటికి, చమట చుక్కకి విలువ లేని ఈ దగాకోరు లోకానికి దూరంగా 
 బతుకుతున్న ప్రజాస్వామ్యం సిగలో ఎర్ర మందారల్లారా!!!
గెలుపు గురించి ఆలోచించకు -
 అడుగు ముందు వెయ్యి!!
ప్రవహించే రక్తం ఉంది నీ గుండెలలో!!
అసమాన ధైర్యం ఉంది నీ కళ్ళల్లో !!
నిప్పులు విరజిమ్మే నీ కళ్ళు చెబుతున్నాయ్ - నీ వేదనా భరిత కధలెన్నో!!
బిగించిన నీ పిడికిళ్ళు చెబుతునాయ్ - దగా పడ్డ బతుకుల వ్యధలెన్నో!!


పోరాడు!!! పోరాడు!!!
గెలిచే వరకూ పోరాడు!!!
ఓటమిని మరిచి పోరాడు!!!

- Bhagath 
నీ మరణం మాలో చీకట్లను నింపి ఉండవచ్చు
కానీ "రాజు లేని రాజ్యాన్ని - అసమానతలు లేని సామ్రాజ్యాన్ని నిర్మించాలని" నువ్వు మాలో రేపిన ఉద్యమ స్ఫూర్తి ఇంకా రగులుతూనే ఉంది!!!

నీ మరణం విప్లవ తల్లి కనులనుండి రుధిర ధారలను కార్పించి ఉండవచ్చు
కానీ మా కార్యదీక్షని కలవర పరచలేదు

నీ మరణం మా గమ్యాన్ని ఓ అడుగు దూరం చేసి ఉండవచ్చు
కానీ గమ్యం వైపు వేసే మా అడుగులలో వేగాన్ని తగ్గించలేదు!!!
దోచేస్తుండ్రు దేశాన్ని ఏలుతున్న దగాకోరు నాయాళ్ళు!!!
చేతి కాడ కూటిని - గొంతు కాడ గంజిని కూడా దోచేస్తుండ్రు ఈ దగుల్బాజీ నాయాళ్ళు!!
కులాల కుమ్ములాటలు, ప్రాంతాల పెనుగులాటలు పెట్టి పబ్బం గడుపుకున్టుండ్రు పింజారీ వెధవలు!!!


గాంధీ వారసత్వపు ముసుగులో, 
10, జనపథ్ నీడలో నీతికి నిలువునా శిలువ వేసి మానం భంగం చేస్తుండ్రు తెల్ల టోపీ పెట్టుకున్న దొంగ *** కొడుకులు!!

ఇదేం ఖర్మ???
ఇవేం బతుకులు???
తుపాకీ నీడలో "గణతంత్రమా"???
డేగ కళ్ళ నీడలో "జెండా వందనమా"???
హవ్వ!!!!!

ఓట్లకోసం ఉగ్రవాదం పై మేతక వైఖరా???
ముంబై మా"రణ" హోమాన్ని రగిలించిన "కసబ్" కి రాచ మర్యాదలా???

సిగ్గు లేదా ప్రభుత్వానికి???
చేవ లేదా ఉరి తీయడానికి???


మువ్వన్నెల జెండా రెప రెపలు మాకు కావాలి!!!
గర్వంగా, నిర్భయంగా రెప రెపలాడే "జెండా" రెప రెపలు మాకు కావాలి!!!
చల్ల గాలికి స్వేచ్చగా ఎగిరే రెప రెపలు కావాలి!!!

భయాన్ని జయించి "ధైర్యంగా" జన గణ మణ ఆలపించే రోజు మా కావాలి!!

రక్తం తో తడిసిన శవాలు, తెగి పడ్డ దేహాలు, ఆనవాళ్ళు గుర్తుపట్టలేని దేహాలు - ఇంకా గుర్తున్నాయి!!!
మర్చిపోవడానికి అది ఓ ఘటన కాదు - రక్తం తో నిండిన జ్ఞాపకం!!

అయినా...ఇంత జరిగినా... మీ వెనక మేమున్నాం అని "అండగా" నిలిచాం!!!
ఎం చేసారు మీరు మాకు???...

సమాజంలోని ధనిక-పేద అసమానతలకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎర్ర సోదరులకేమో "ఎన్కౌంటర్లు"
రాజకీయ ముసుగులో హైదరాబాద్ పాత నగర్ నడిబోడ్డులో "మత ఛాందస వాదాన్ని" పెంచి పోషితున్న ముష్కరులకి "అగ్రతాంబూలాలు"!!!

కుల రాజకీయాలు - మత రాజకీయాలు - ప్రాంతీయ రాజకీయాలు!!!


 - Bhagath