Tuesday, October 30, 2012


నాకూ రాయాలని ఉంది ఓ కవిత!!!
కీచక పర్వంతో కృశించి సుష్కించిన భారతావని పై 
ఎర్రటి సిరాతో రాయాలని ఉంది ఓ విప్లవ కవిత!!

ఇంకిపోయిన పేదవాడి కనులనుండి కారుతున్న రక్తం గురించి 
బలహీనుల రక్తాన్ని తాగుతున్న సర్కారీ రాబందుల గురించి 
పట్ట పగలు నడివీధిలో నగ్నంగా నిలబెట్ట బడ్డ  భారతమాత దుస్థితి గురించి 
అమ్మ పాలు తాగి ఆ అమ్మ రొమ్మును కుమ్ముతున్న రాజకీయ కీచక కొడుకుల గురించి!!
రాయాలని ఉంది నాకో కవిత!!

వీరుల కధలు రాస్తాను 
వైప్లవ్య గీతాలు రాస్తాను!

పేదోడి పొలంలో 
దొరగాడి గుండెల్లో 
ఎగురుతున్న ఎర్ర జెండాని తలుస్తూ రాస్తాను!

తిరగబడ్డ రైతన్న చేతిలోని పదునెక్కిన కొడవలి కధ రాస్తాను!
కసేక్కిన కార్మికుడి బిగిసిన పిడికిలి చెప్పిన కధ రాస్తాను!
ఎరుపెక్కిన కవి గారి కవిత - చెప్పకనే చెబుతోంది రాబోయే విప్లవాన్ని!!

దొరల దౌర్జన్యాలకి ఎదురు తిరిగాడని 
సీకాకులంలో సత్యాన్ని ఉరేసినపుడు 
కార్చిన కన్నీటిని సిరాగా మార్చి రాయాలని ఉంది!!

అధికారం ముసుగేసుకొని 
కఖీ రంగు పులుముకొని 
బూటకపు ఎన్కౌంటర్లో 
ఆటవికంగా "సూర్యాన్ని"  చంపినపుడు 
ఉడికిన నా రక్తంతో రాయాలని ఉంది!!

పాడె పై పడున్న పాణిగ్రాహిని చూసి 
గుండెలవిసేలా ఏడ్చినపుడు 
బిగిసిన నా పిడికిళ్ళతో రాయాలని ఉంది!!


తెల్లని కాగితంపై ఎర్రని కవిత్వంతో నా సంతకం!!

కాదు అని నా సంతకం!!
పేదవాడి కన్నీటి అర్పణం!
ఎదురు తిరిగినోడి గుండె నిబ్బరం!

కాదు అది నా సంతకం!!
అది చీకటిని చీల్చుకు ఉదయిస్తున్న మండే సూర్య కిరణం!
నీలాకాశంలో స్వేచ్చా  పవనంలో ఎగురుతున్న ఎర్ర కపోతం! 

కాదు ఇది నా సంతకం!!
 కత్తుల కోలాటంలో ఆశువులు  బాసిన యోధుల త్యాగాల దర్సనం!

(Bhagath - 30/10/12)



నేస్తమా రా!!
బంధాల బందిఖానాలు తెంచుకు రా!!

విప్లవాల తోటలో 
విహరిద్దాం రా!

ఉద్యమాల బాటలో 
పయనిద్దాం రా!!
ఎర్ర జెండా నీడలో జీవిద్దాం రా!!

పేదవాడి కన్నీటిని తుడిచేద్దాం
సామ్రాజ్యవాద శక్తులను కూల్చేద్దాం 
దోపిడీ దార్ల దుర్మార్గాలని దున్నేద్దాం !!

పోరాటం అడుగుల్లో నీ ప్రాణం అల్పం!
ఉద్యమాల చరితల్లో నీ త్యాగం ఘనం !!


విప్లవం వర్ధిల్లాలి 
కొండల్లో, కోనల్లో 
వాగుల్లో, మలుపుల్లో
గూడెంలో, గుండెల్లో
అడవుల్లో, వాడల్లో 
మెరుస్తున్నకురుస్తున్న
విప్లవమా వర్దిల్లు!! 

నీరసించిన నరుణ్ణి తట్టి లేపు
నిద్దరోరున్న సమసమాజాన్ని పట్టి కుదుపు !!

జాగో జాగో!!

Monday, October 15, 2012

యాడ ఉన్నది
యాడ ఉన్నది ఇప్లవం??

సందులోన,
గొందిలోన,
పిల్లలోన,
జల్లలోన
గుండె గుండెలోన
దాగున్నది ఇప్లవం!!
-----------------------

యాడ ఉన్నది
యాడ ఉన్నది ఉద్దెమం ??

మాల పేట,
మాద్గ పల్లి,
బాపనోరి అగ్రారం,
కోమటిపల్లి,
సాలె పాడు,
సాకలి గూడు,
మసీదు ఈది..

యాడ చూసినా..
ఎటి చూసినా
ఎలుగుతోంది రగులుతోంది ఉద్దెమం!!
-----------------------------

ఎవరు ఎవరు నడుపుతున్నరు ఈ దండు??
కొలిమిలోని నిప్పులాగ
అడవిలోని శక్తి లాగ
మండుతున్న ఎండ లాగ
ఎర్రెర్రగా కదులుతున్న ఈ దండు??

రాములోరి కొయెల పూజారి శాస్త్రిగారి తమ్ముడు "సత్యం"..
కరణం షణ్ముఖ శర్మ గారి కొడుకు "సూర్యం"

సుబ్బారెడ్డి గారి బామ్మర్ది "శివుడు"
శివుడి భార్య "పద్మక్క"!!
నాయిడు మాస్టారి దూరపు బంధువు "అమర్"
అంగడి పుల్లయ్య శెట్టి అల్లుడు "భార్గవ్"
ఇమాం సాబ్ మేనల్లుడు "షరీఫ్"
పాస్టరు డానియెల్ అన్న "ప్రభుపాద్"

చాకలి "ఐలయ్య"
మంగలి "సుబ్బయ్య"
శేషయ్య "నాయక్ "
మన చౌదరి "శీను"
చలం, రుద్రయ్య, భూపతి, సుందరయ్య,

ఇంతేనా...

గడప గడపకీ ఓ "అన్న"
తడిక  తడికకీ ఓ "అన్న"
ఈది ఈదికీ  ఓ "అన్న"
వాడ వాడకి ఓ "పెద్దన్న"

జనం..జనం..
బలం..బలం..

బలం..బలం..
బలగం..బలగం..

చేను చేనులో పూస్తన్నాయ్ ఉద్దేమాల "కుసుమాలు"
పొలం గట్టున గుట్టుగా పెరుగుతున్నాయ్ "ఇప్లవ బల్లాలు"
ఇంటింటా ఎలుగుతున్నాయ్ కమ్మ్యునిష్టు కాగడాల ప్రమిదలు!!
-----------------------------------------------------------

ఎటి సేత్తారంట ఈ "అన్నలు"??
మనకేటి సేత్తారంట ఈ అన్నలు??


మన సీకటి బతుకుల్లో ఎలుగులు తెత్తారంట
ఆకటి కడుపుల్లో అన్నం పెడతారంట
మనకోసం వాళ్ళ పేనాలు ఇత్తరంతా!!

ఇంకా???

మన భూమిని,
 మన ఊరిని,
 మన గూటిని,
మన నీటిని,
మన కూటిని,
మన పంటని,
మన చేలని
మన చమట
నూక్కపోతున్న కొడుకులకి కోసి కారం పెడతారంట!!
తద్దినం పెడతారంట!!

----------------------------------------
మరి మనమేటి సిద్దాం ఇప్పుడు??

అలా అడవికి పోదాం!!
ఆయుధ పూజ చేద్దాం!! ( 16-10-12)



I erased the foot-prints that you left on my heart...

నిన్నటి ప్రియతమా..
నేటి (అ)ప్రియతమా....

నా గుండెలపై నీ జ్ఞాపకాల పాద ముద్రలని చేరిపివేసాను
నీతో కలసి కట్టిన కలల కోటని కూల్చివేసాను
నీకై వ్రాసిన ప్రేమ కావ్యాలని కణకణ  మండే జమదాగ్నిలో   కాల్చివేసాను

మన ప్రేమ పాటలు పాడిన వసంత కోయిల గొంతు పెకిలివేసాను
నా గుండె గదిలో వెలుగు రేఖలని ఆర్పివేసాను

చీకటమ్మ ఒడిలో
కన్నీటి బడిలో మరో కావ్యాన్ని మొదలెట్టాను..

నేనో జగజ్జేత!
నేనో అజాత శత్రు!!
నే రుధిరాశ్రు నేత!! ( రుధిర + అశ్రు నేత)
నే హృదయాగ్ని భూత!!

నే  నిజానికి నిఘంటువు!
నే పదానికి ప్రభువు!! ( 16-10-12)