Thursday, November 19, 2009

Wednesday, November 11, 2009

Waited for u....

నీ కోసం వేచి చూసాను....
నీ జాడ లేదు...
నీవు పలుక లేదు...

నాకు కునుకు లేదు....
నా కనులలో తడి ఆరలేదు....
నిను మరచిన క్షణం లేదు...
నిను తలువని ఘడియ లేదు...

తొలిసారి నిను చూసినపుడు
నా పెదవులపై విరిసిన
చిరు నవ్వులనడుగు...

నా చూపులతో నిను నిలువెల్లా
తదిమినపుడు ఎర్రబడ్డ నా బుగ్గలనడుగు...

మొదటిసారి నీ చేయి తాకినపుడు
పెరిగిన నా గుండె చప్పుళ్ళని అడుగు....

నిను చీర కట్టులో చూసినపుడు
నాలో చెలరేగిన సెగల-పోగలను అడుగు....

నువ్వు నను వీడి వెళ్లిపొతున్నపుడు
నా కనులనుండి జాలువారిన కన్నీళ్లను అడుగు....

U

ఆకాశంలో మెరిసే ఆ సూర్య-చంద్రులు నీ కళ్ళే కదూ.....
ఉదయ భానుని తొలి వెలుగు రేఖలు నీ జడలో విరిసిన మందారాలే కదూ...
తెల్లని చల్లని మంచు ముత్యాలు నీ చెమట బిందువులే కదూ....
వాన జల్లులు నీకై వరుణ దేవుని విరహ రాగాలే కదూ...
పాల మీగడలు నీ పెదవుల వెనుక దాగిన చిరు నవ్వులే కదూ...
చల్ల గాలులు నేను నీ ఉచ్వాస-నిచ్వాసలే కదూ...
ఈలపాట నిను చూసి మన్మధుడు పాడిన గోల పాటే కదూ...
అజంతా శిల్పానికి "మోడల్"వి నువ్వే కదూ[;)]

శ్రీ దేవి

దేవి...
శ్రీదేవీ...
తరగని అందం నీ సొంతం...
ప్రజల గుండెల్లో నువ్వు పదిలం...
అందుకే అందుకో నా ఈ నీరాజనం...


మరచిపోయాను అనుకున్నావా దేవి...
ఆ రోజులలో కొంటె నవ్వు నవ్వి...
ఓర చూపు రువ్వి
నువ్వు నాలో
రేపిన పోగల-సెగలు


Life

ప్రేతాత్మగా తిరుగుతున్న ఆత్మ మనిషిగా రూపాంతరం చెందేది "జననం"...
మహామనిషిగా రూపాంతరం చెందిన ఆత్మ పరమాత్మలో విలీనం అవడమే "మరణం".....
ఇది కాల చక్రం


జననం సత్యం..
మరణం సత్యం..
జనన మరణాల మధ్య సాగే ఈ జీవితం అంతా అసత్యం...

పుట్టిన ప్రతి జీవి కాటికి పోక తప్పదు..
.కట్టె కాలేంతవరకే ఈ బంధాలు-భవబాంధవ్యాలు..
ఆ కట్టే కాలిన తరువాత అంతా మాయ....

Politics

ఓట్ల కోసం....
ఓట్ల వలన గెలిచే సీట్ల కోసం...
గెలిచిన సీట్ల వలన సంపాదించే నోట్ల కోసం....
ఉగ్రవాదం పై మెతక వైఖరి వహిస్తూ
వారి ఉచ్చ తాగుతున్న జాతి నీటి లేని కొజ్జ రాజకీయం మనది.....


యుద్దంలో రక్తంతో తడిచిన సైనికుల శవ పేటికలపై చిల్లర ఏరుకున్న సచ్చరిత్ర ఒక సైన్యాధ్యక్షుల వారిది..
నోరులేని పశువుల నోటి దగ్గరి గ్రాసాన్ని దొంగలించిన దౌర్భాగ్యపు నాయకుడు ఇంకొకడు...
శాసనసభ సాక్షిగా అతివ వలువలు తొలచిన "దుశ్శాసన" కుమారుడు ఒకడు..
భారతమాటకు సంకెళ్ళు వేసి చీకటి కారాగృహానికి తోసిన వీర నారి ఒకరు...
"బోఫోర్సు" పేరుతో "ఎయిర్ ఫోర్సునే" తాకట్టు పెట్టిన "తల్లికి తగ్గ" తనయుడు ఇంకొకరు..
తర తరాలుగా "ప్రధాని" పదవి తమ కుటుంబ సొత్తుగా భావిస్తున్న "గాంధేయ" వాదులు ఇంకొకరు...
ఓట్ల కోసం ఉగ్రవాదుల పై మెతక వైఖరి వహిస్తూ వారి ఉచ్చ తాగుతున్న జాతి, నీతి లేని చేతకాని,
చేవలేని కొజ్జా రాజకీయం మనది..

మౌనం చేతకాని తనం కాదు...
ఆ మౌనం కడుపు మండి, కన్ను ఎర్ర బడితే...
ఉగ్రవాదం గుండెల్లో గుళ్ళ వర్షం కురుస్తాది...
ఉగ్రవాదం అనే మాట మాడి మసై పోతాది..
టెర్రరిజం తునాతునకలై పోతాది..


Un titled

తొలివేకువ వేళ
పక్షుల కిల-కిల రావాల నడుమ
తెల్లని మబ్బుని చల్లని మంచు కప్పివేయగా...

రాజహంస వయ్యారాలతో
నెమలి సింగారాలతో
ప్రకృతిని పలకరించి, పులకరింప చేసి పరుగులిడుతున్న సొగసరి సెలఏటిలా...

సుతి మెత్తని అడుగులతో నువ్వు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు....

నీ నుదుట ఒక స్వేద బిందువు జాలువారుచుండగా....

అప్పుడే ఆవలిస్తూ వళ్ళు విరుస్తూ బద్దకంగా కళ్లు తెరిచిన సూర్యుడు నిన్ను చూచుచుండగా...
మదిలో చిలిపి తలపుతో ఆ ఉదయభానుడు నీ చెక్కిలిపై జాలువారుతున్న ఆ చెమట బిందువుని చేరగా..
ఆ ఉషస్సు, నీ తేజస్సు కలసి ఆ నీ చెమట చుక్క మిల మిల మెరవగా..
సిగ్గులతో బరువెక్కిన నీ కను రెప్పలు నేలకు వాలగా....
నీ నుదుట ఒక ముద్దు పెట్టాలని ఉంది.....

Vellipoyaavaaaaaa

తోడేళ్ళు తోడుదొంగలు తరుముకొచ్చే ఈ నిశీధిలో నన్ను ఒంటరిగా ఒదిలేసి...
కారు మబ్బులు, కష్టాలూ, కన్నీళ్లు కమ్ముకొస్తున్న ఈ నిశాచర లోకంలో నన్ను ఒంటరిగా వదిలేసి...
నా వలపు రాగాలు, విరహ వేదనలు వదిలేసి...
నా ఆశల హరివిల్లులను అంధకార కారాగృహంలో ఖైదీ గా చేసేసి..
నా కళలను నీ ముద్దు ముద్దు కాళ్ళతో తన్నేసి...
నా ప్రేమను పాతాళానికి తోసేసి...
బాధ్యతల గండాల సుడిగుండాలలో బాధితురాలిగా మారి వెళ్ళిపోయావా...

నను వీడి నీవు వెళ్ళినా...
నువ్వు పండించిన సంతోషాల సరాగాలు నా చెవిలో రాగాలాపన చేస్తూనే ఉంటాయి..
నీ చిరునవ్వుల పువ్వులు నన్ను పలకరిస్తూనే ఉంటాయి....

Un titled..

నిజంగా నువ్వు మనిషివి కాదు కదు..

శాపవశాత్తు దివి నుండి భువికి దిగి వచ్చిన గాంధర్వ కాంతవు నీవే కదూ..
అజంతా శిల్పాలకు రాణివి నువ్వే కదూ..
కాళిదాసు కలం నుండి పురుడుపోసుకున్న వసంతసేనవు నీవే కదూ...
"లియోనార్డో డ విన్సి" మనసు నుండి మొలిచిన మొనాలిసవు నువ్వే కదు..

పాల మీగడ నీ మేలిమి ఛాయే కదూ..
ఇంద్రధనసు నీ పెదవులపై విరిసిన చిరునవ్వే కదూ...
నిండు పున్నమి వెన్నెల వెలుగులు నీ కాంతులే కదూ..
కర్పూరం నీ శ్వేద బిందువే కదూ ..
సూర్య చంద్రులు నీ కనులే కదూ..
కాశ్మీర్ యాపిల్ ఎర్ర బడ్డ నీ బుగ్గలే కదూ..
ఆకాశాన మెరుపులు భువిపై నీ విరుపులే కదూ..

బ్రహ్మ దేవుని మానస పుత్రికవు నువ్వే కదూ..
సాగర మధనంలో ఉద్భవించిన మోహినివి నీవే కదూ..
నెమలికి నాట్యం-కోయిలకు రాగం నేర్పిన సుందరివి నీవే కదూ...

అలలు నీకై సముద్రుని మదిలో రేగే అలజడులే కదూ..
చిరుజల్లు వరుణుడు నీ కోసం విసిరే వలపు బాణాలే కదూ...

సౌందర్యానికి చిహ్నం నువ్వే కదూ..
ఆప్యాయతలకు అడ్రస్ నువ్వే కదూ..
మన్మధుడి ఫ్యాషన్ స్కూల్లో TOP "మోడల్" వి నువ్వే కదూ..

Un titled..

శనివారమేగా ఇంకొంచెం సేపు నిద్దరోదాం అనుకున్నా...
నా కలలో నీ కళ్ళలోకి చూస్తూ కాలగమనాన్ని కూసేపు మరచిపోదాం అనుకున్నా..
నీ ఒడిలో తలపెట్టి ఆకాశంలో ఆ తారల ముసి ముసి నవ్వులను మనసారా ఆస్వాదిద్దాం అనుకున్నా..
మన ఇద్దరినీ అలా చూసి సిగ్గుతో చిక్కిపోతున్న చందమామను చూసి వెక్కిరిద్దాం అనుకున్నా...

పూవునైనా కాకపోతిని నీ కురుల విరుల సిరుల చేరగా..
నవ్వునైనా కాకపోతిని నీ పెదవులను చేరగా..
"చిరు జల్లు"నైనా కాకపోతిని నీ తనువులను తడపగా...
చిరు గాలినైనా కాక పోతిని నీ చెక్కిలి పై సేదదీరిన చెమట బిందువుని ముద్దాడగా ;)
నీ కాలి గజ్జనైనా కాక పోతిని నీ లేత పాదాలకు ప్రణమిల్లగా॥

Sunday, November 8, 2009

Bhagavad Geeta

అయిందేదో మంచికే అయింది...
అవుతున్నదేదో కూడా మంచికే అవుతుంది...
అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది..

నువ్వేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావ్??
నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకున్నావు?
నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది?


నీవు ఏదైతే పొందావో అవి ఇక్కడినుండే పొందావు...
ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు....

ఈనాడు నీవు నా సొంతం అనుకున్నదంతా, నిన్న ఇంకొకరి సొంతం కాదా?
మరి రేపు మరొకరి సొంతం కాగలదు..
పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ..
కావున జరిగేదేదో జరగక మానదు...
అనవసరంగా ఆందోళన పడకు...
ఆందోళన అనారోగ్యానికి మూలం..


ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు -
ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు



Bhagavad Geeta

అయిందేదో మంచికే అయింది...
అవుతున్నదేదో కూడా మంచికే అవుతుంది...
అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది..

నువ్వేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావ్??
నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకున్నావు?
నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది?


నీవు ఏదైతే పొందావో అవి ఇక్కడినుండే పొందావు...
ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు....

ఈనాడు నీవు నా సొంతం అనుకున్నదంతా, నిన్న ఇంకొకరి సొంతం కాదా?
మరి రేపు మరొకరి సొంతం కాగలదు..
పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ..
కావున జరిగేదేదో జరగక మానదు...
అనవసరంగా ఆందోళన పడకు...
ఆందోళన అనారోగ్యానికి మూలం..


ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు -
ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు



అఖిల - The Bla..Blaa...Blaaa's About me

Heaven won't have me and hell's afraid i'll take over !

'Coz

*I shout(aaaaaaaaaaa...!)

*I eat anything n everything(sup... sup!)

*have ego problems(sigh!)

*non-stop blabberrrin...(blaa..blaa..blaah)

*very impatient n restless all the time (hmmmmmmm....!)

*i crave for adventure n thrill in life...(uuuuhhhhhoooooooo...!)

*have d guts to slap sumone in public wen um outta my mind(pattakkkk....!)

*I drag my feet while I walk..n walk like a duck(quack..quack!)

*I fall dwn every every 2nd day...(BANG!! BANG!! )

*have great dressing sense(ahem! ahem!) n can have a gud laugh at my"own"self....

*cant wear high heels(slip...slip!)

*love to sing loud n dance on my own tunes(la la la laaaaaaaaa...!)

*have tried my hand at drawing (stroke! stroke!)

*Hate to shop (pheww...!)

*love bunkin classes...(yippiee yippiee yaa yaa..!)

*hate to read n write(Yuk.. Yuk...!)

*fite wid my frenz(grrrrrrr...!)

*I “push” da door wen it is 2 b pulled..N “pull” it wen it’s 2 b pushed (Oops..Oops..!)

*I talk wid food in my mouth...(um-phum-whum-furfur-ferwher)

*I get very rude at times(Huh...)

*I sit on d steps in d street n wont get up wen umm tired...(Waaaa...waaa...)

*I sip d strawberry smoothie till d last drop in d glass (slurp...slurp!)


BUT from inside um a simple girl who finds pleasure in the often unnoticed beauties of lyf...

* Feeling the freshness n smell of a road flanked by trees wen it has just rained...

* eating i-scream in d rain...

* listenin to d soothin sound of d rain...

* smelling onions when they have been just dropped in hot oil...

* seeing a moonlight bathed terrace...

* loving somethin deeply

* The trees swaying n the leaves blowing around on the ground

* old wrinkled couple holding hands while crossing roads...


* Hugs from good friends

dats wat I am...n I love myself to the core!!! n 'm highly self obsessed...n u knw wat? itz not dat eazy bein soo adorable

**P.S::sumone has rightly said...“Well behaved girls rarely make history”!!!!!!



Tuesday, November 3, 2009

Got that day....

నిన్నటి రోజు గుర్తుకొచ్చింది.....

వద్దు వద్దు అని నేను మారాం చేస్తుంటే
నాకు గోరుముద్దలు తినిపించిన అమ్మ గుర్తొచ్చింది....

పగలంతా గాలి తిరుగుల్లి తిరిగి వచ్చి నిద్రలో నేను కళ్ళ నొప్పులు అంటుంటే
రోజంతా పని చేసి అలసిపోయి అప్పుడే ఇంటికి వచ్చిన నాన్న నా కాళ్ళు పిసికిన రోజు గుర్తొచ్చింది....

వాన జల్లులో పీల్చిన ఆ మట్టి వాసన గుర్తొచ్చింది....
ఖద్దరు చొక్కా వేసుకొని కాలరు ఎగరేసిన ఆ రోజు గుర్తొచ్చింది....

వాన పడ్డప్పుడు వచ్చే కమ్మటి మట్టి వాసన గుర్తొచ్చింది....
డాబాపై అమ్మ పక్కన పడుకుని ఆకాశంలో తారలను లెక్కపెట్టడం గుర్తొచ్చింది...
నా వెనక తోక ఊపుకుంటూ తిరిగే మా వీధి కుక్క పిల్ల గుర్తొచ్చింది...