Thursday, September 13, 2012

నాకు ఇప్పటికీ గుర్తే!
సరిగ్గా నాకు అప్పుడు "ఆరు" ఏళ్ళు!!

అప్పుడప్పుడే ఈ లోకపు అజ్ఞానాన్ని 
జ్ఞానంగా అవలోకన చేస్తున్న రోజులు!!

అలాంటి ఓ రోజు అడిగాను మా నాన్నని - "త్యాగం అంటే ఏమిటీ" అని??
మా ఇంటి తూరుపు దిక్కున ఠీవిగా నిలబడ్డ 
"కామ్రేడ్ P.S స్మృతి చిహ్నాన్ని" చూపించి చెప్పారు "త్యాగానికి" గుర్తు ఇదే అని!!!

మరో రోజు అడిగాను "మహాత్ములంటే" ఎవరు అని??

( Draft...)



డబ్బులో మునిగి, డబ్బులో తెలుతున్నాం మనం!!
ప్రపంచమంతా డబ్బు మయం!!

చట్టం, ధర్మం డబ్బుకు దాసోహం!!
ఇప్పుడు న్యాయం సైతం!!

ప్రేమ, పదవి 
సుఖం, గౌరవం
అన్నీ డబ్బు వశం!!

వరాలిచ్చే దేవుడు కాసులున్న కుబేరుల 
"Guest House" కి మకాం మార్చేశాడు!! ఎప్పుడో!!
డబ్బు మైకంలో!!

అమ్మ గర్భాన్ని సైతం అరువు తెచ్చుకునే "అలోకిక" 
స్థాయికి ఎదిగిపోయాం మనం ఇప్పుడు!! 
డబ్బు మదంతో!!
అమ్మా నన్ను కన్నందుకు వందనాలు!!
నవమాసాలు మోసినందుకు వందనాలు!!

నీ ప్రాణాన్ని నూనెగా మార్చి 
నా ఈ బతుకు దీపాన్ని 
వెలిగించినందుకు శతకోటి వందనాలు!!

నీ రక్తాన్ని పాలుగా మలచి 
నా ఆకలి తీర్చినందుకు పాదాభి వందనాలు!!

సమసమాజ స్థాపనకై "అడవి" దారిలో పోతానంటే 
వెన్ను తట్టి విజయ తిలకాలు దిద్దినందుకు 
వీరాభివందనాలు!!

బూటకపు ఎన్కౌంటర్లో నేలకొరిగిన నన్ను 
నిర్జీవమైన నీ కళ్ళతో కడసారి చూస్తూ గర్వంగా కారిన 
 కన్నీటి బొట్టుకి "విప్లవాభివందనాలు!!!