Friday, July 31, 2009

No Fear

గుండెను గుండులు చీల్చినా...
రక్తం ఏరులై పారినా...
ఎత్తిన జెండా దించకోయ్....
అరుణ పాతాకకు జై...
మన విజయ పాతాకకు జై ...

శత్రువు విజయం పొందినా..
మృత్యు దండం నిన్ను ముద్దాడినా..
ఎత్తిన జెండా దించకోయ్....
అరుణ పాతాకకు జై...
మన విజయ పాతాకకు జై ...

చీకటి నిన్ను చుట్టినా...
ఆకలి నిన్ను చంపినా..
పోరాటానికి పొగ పెట్టకోయ్..
ఆశయాన్ని మరువకోయ్..

Will follow ur foot steps

పొండిరా పొండి...

అందరూ పొండి...

పోతూ పోతూ, దారిలో ఉన్న ముళ్ళను పక్కను తొలగించి పొండి....

నేను వస్తాను...

మీ వెనకే వస్తాను...

మీ అడుగులో అడుగు వేస్తూ వస్తాను...

మీకు రక్షణగా వస్తాను...

సమైక్యనాదమే మన నినాదం..

"ఆస్ట్రేలియా" గడ్డపై "ఎర్ర బావుటా" రెప-రెపలే మన లక్ష్యం [;)]

anna - The leader

వస్తే-గిస్తే తెలంగాణా "అన్న" నాయకత్వంలోనే రావాలే.....

గుర్రం లేకపొతే బండి యాడికి కదులుతాది???

"అన్న" లేకపొతే తెలంగాణా యాడ వస్తాది?

తెలంగాణా కోసం నెత్తురు చిందించింది ఎవరు??

ఐదు కోట్ల తెలంగాణా ప్రజల గుండె గోసను నెత్తికెత్తుకుంది ఎవరు?

దొరల ఇలాకాలో పుట్టి, దొరల దౌర్జన్యాలపై దండెత్తింది ఎవరు?

"వెలమ" కడుపున పుట్టి, "వెలి వేయబడ్డ" జనాల కోసం "ఉద్యమించిన" నాయకుడు ఎవరు?

అది "అన్న" కాక ఇంకెవరు??

సింహం అడుగు వెనక్కు వేసేది పంజా విసరనీకే...

అగ్ని పర్వతం నిశబ్ధంగా ఉండేది "బద్దలవ్వ"నీకే..

ఆకసం ప్రశాంతంగా ఉండేది "ప్రళయం' సృష్టించనీకే...

"అన్న" గమ్మునుండేది "ఉద్యమాన్ని" దౌడు తీయించనీకే..

======================

ఉద్యమం అనేది ఒక పవిత్ర యాగం.

ఆ యాగానికి "హవిస్సు" నీవై, నిను నమ్మిన ప్రజల బతుకుల్లో "ఉషస్సులు" నింపాలి....

నాయకుడికి కావలసినది త్యాగం.

"వ్యక్తి" భావాలకంటే "ఉద్యమ" భావోద్వేగాలు గొప్పవి...

నీ పదవిని త్యాగం చెయ్యలేని వాడివి -నువ్వు నాయకత్వానికి ఆర్హుడివా???

నిను నమ్మి ఐదు కోట్ల తెలంగాణా ప్రజలు నీ వెంట నడవాలా?

The Day

Will note you in my book of sweet memories..
The day we met, the day we split..
The day we cried with utmost happiness..
the day we smiled in sadness..

the day u showed me the glittering stars and the full moon..
the day u showed me the black blank sky...

the day i cried on you lap...
the day you hugged with your love..

the day you patted me on my back, when i am in depression...
the day you pulled me when i am making ladders to reach the sky..

unforgettble are those days...
which i never forget thorough out my lyf....

Untitled

A.C కార్లలో తిరిగే నా పేద దేశపు ప్రజా ప్రతినిధులారా...
ఒక్క సారి మీ కారు డోరు తీసి,
AC తెరచాటు నుండి బైటకు వచ్చి..
మీ కనుల పొరలను కప్పిన ఆ నల్ల కళ్ళద్దాలను తొలగించి చూడండి..

ఈగలు వాలిన,
దోమలు ముసిరిన,
పాచి పట్టిన పిడికెడు మెతుకుల కోసం...
చెత్త కుప్పల్లో
కుక్క పిల్లలతో
జీవన చదరంగంగపు చలగాటాలలో
పావులుగా మారుతున్న దేశ భవితను చూడండి..

ఓ! నా ప్రజాస్వామ్యపు ప్రభువులారా .....
భారతమాత కళ్ళనుండి జాలువారుతున్న కన్నీటి కడగండ్లను తుడవడం మీకు చేతకాదా??
అమ్మ పెదవులపై చిరు నవ్వుల పూవులు పూయించగల చేవ మీకు లేదా?
If So, రాజకీయాలనుండి నిష్క్రమించండి...
ఆ సత్తా ఉన్న వాడికే సైఅనండి...

Untitled

నన్ను నీవుగా..
నిన్ను నేను గా భావించిన నా ప్రేమకు జోహార్....

కలసిన కన్నుల,
కాలువని మనసుల మన మృత ప్రేమకు జోహార్...

మండిన గుండెల,
రేగిన ఘోషల గుడ్డి ప్రేమకు జోహార్...

నన్ను కాల్చిన,
నా ఆశలను కూల్చిన కపట ప్రేమకు జోహార్...

SKY

I m never alone, even if u donn come in my lyf...
Darkness is with me...
Sun rays are with me....

Silence is with me....
Shining Stars are with me...

moon lyt is with me....
kids smiles are with me....

Flowers blossoms are with me...
Boundless love of parents is with me...

Let my love on u bury 'n' die with in me...
I thank the circumstances and the people who are involved to make me understand that ........
"U can never ever reach the sky...
Even if U love it, more than thy...."

స్కూల్ days

Unforgettable are those days...
Earlier days when I cried to go to school...

Later days when I cried for going to school...


Missing those ...
Tales of He-Man's and Daburman's...

Medals of Gold,Silver & Bronze in marble games...

Galli & that Lolli Cricket....


Love stories which never End...

Juicy Gossips that never giveup...


College...
The days Which turned us Stars...

The days when our collers which never sat silently..

The days when we felt the warm and teasing looks of babies..

The days of flirting and flatting natures..[:P]

The days of Smiling faces of lecturers...

The humours days of Gang Wars b/w hardcore fan followers...


Again.......
The Love stories which never End...

The Juicy Gossips that never givesup...

The Strange interesting comments on the figures of maams[:P]
Those days when we dared to skip exams for attending politial meetings.....
Those days when we usually skip classes for watching movies....
Those days when we go to college on holidays...
Those days when we go to library for watching the cuites and making noice in the library...
Those days when we feel great to BREAK the college rules...
Those days when we feel it great when the professor shouts to leave the class...
The journey which learnt me a lot....

The journey which gave me huge companions of all sorts...

Untitled

స్మశానంలో కాలీకాలని శేవాన్నిపీక్కు తిని,
భుక్తాయాసంతో నడవలేక నడుస్తున్న
బక్క చిక్కిన నక్క నన్ను చూసి నక్కిన వేళ.....

ఆ నిశ్శబ్దపు చీకటిలో,
పిశాచాల ఆకలి కేకలలో...
సుషుమ్నావస్తలో ఉన్న నన్ను చూసి ..
భయమన్నది ఎరుగని కాటి కాపరి కలవరపడిన వేళ....

శతాబ్దాల చరిత గల మర్రి చెట్టు
నా పట్టుదలను చూసి అచ్చెరు వొంది
నా ఉచ్వాస- నిచ్వాసాలను ఆలకిస్తున్న వేళ....

కాలుతున్న చితులనుండి రేగిన చితాభస్మం
కవచంగా మారి నన్ను కాపాడుతున్న వేళ....

Untitled

ధనిక రాబందుల కరకు బూట్ల కింద నలిగి
నీరసించి పోయేది కాదు విప్లవం...

తనపై ఉక్కు పాదాలు మోపిన వాడిని
ఉప్పెనలా చుట్టూ ముట్టి చావగొట్టేది విప్లవం...

దౌర్జన్యకారుల దురాక్రమాలకు తలవంచేది కాదు విప్లవం -
పీడిత ప్రజల కోసం దుష్టుల తలలు తెగ్గోసేదే విప్లవం....

కష్టజీవి కనీళ్ళు తుడిచేది కాదు విప్లవం -
వాడి కష్టానికి తగ్గ ప్రతిఫలం చూపేది విప్లవం..

ఆకలి గోన్నవాడికి బిచ్చం వేసేది కాదు విప్లవం -
వాడికి కడుపు నింపుకునే మార్గాన్ని చూపేది విప్లవం ..

Untitled

పాతనగరపు నడిబోడ్డుపై మత ఛాందసవాదంతో
మతాల మధ్యన కార్చిచ్చు రగిలించి
మారణహోమం సృష్టిస్తున్న
రాజకీయ కీచకులకు
కరచాలనాల అందలాలు,
గౌరవ వందనాలు -

ప్రజల అభ్యున్నతి కోసం పోరాడుతున్న
నక్సలైటు సోదరులపై అణచివేతలు,
నిషేదాజ్ఞలు,
బందిఖానాలు,
ఎన్కౌంటర్లు....
అరవై వసంతాల "నవ యవ్వన" నా దేశ రాజ్యాంగమా!!!!!
నిన్ను చూస్తుంటే జాలి వేస్తోంది....

Not so lucky

పూవునైనా కాకపోతిని ..
నీ కురుల విరుల సిరుల చేరగా..

నవ్వునైనా కాకపోతిని
నీ పెదవులను చేరగా..

"చిరు జల్లు"నైనా కాకపోతిని
నీ తనువులను తడపగా...

చిరు గాలినైనా కాక పోతిని
నీ చెక్కిలి పై సేదదీరిన చెమట బిందువుని ముద్దాడగా ;)

నీ కాలి గజ్జనైనా కాక పోతిని
నీ లేత పాదాలకు ప్రణమిల్లగా..

Untitled

ఊహల పల్లకిలో....
చెలి తలపులలో...
తొలి మలపులలో...
మలి వలపులలో....
జీవన సరాగం లో...
జీవిత పరమార్థం లో..
సంతోషం సుస్వరాలలో..
అందాల డోలాయమానాలలో..
తన చూపుల చమక్కులలో..
తన రూపపు రిథమ్ముల లో..
మస్తిష్కం లో మధుర భావనలతో...
తన అందం అనే బంధనంలో...
తన బంధం అనే కొత్త బంధుత్వం లో...
బాటసారినై..
వేటగాడినై...
కవినై...
కల్పననై...
కోటి ఆశలతో..
కొత్త మనిషినై..

Untitled

మిస్...

మీరంటే నాకిష్టం...
ఎందుకు అంటే చెప్పడం కష్టం...
చేస్తున్నా విస్పష్టం...
ఇది మనసు లోతుల నుండీ వస్తున్న సత్యం..
చాచుతున్నా....

నా స్నేహ హస్తం..
అందిస్తే మీ వామ హస్తం....
పూజిస్తా గుండెల్లొ పెట్టుకు..

ఈ నా జీవితాంతం....

Thursday, July 30, 2009

Untitled

పరస్పర విరుద్ధ భావాలా....ఘర్షణల..సంఘర్షణలు....
నా మస్తిష్కంలో.......
ఆరని మంటలు రెపగా......

నా గుండెకు గాయం చేయగా.......
నా గది లొపల.....
చీకటి లో.....
చీకటి లొపల....
నా గదిలొ.....

నేనొంటరినై......
గడిపిన చీకటి క్షణాలు......
నా కళ్ల నుంది జాలువారిన గంధక జ్వాలలు.....
నా గుండె నుండి వీచిన విష వాయువులు.....
ఏరులై.......
సెలయేరులై......
నదులై......
సముద్రాలై.....
తెగిన గాలిపటంలా......
పగిలిన అద్దం గా....
మొదలు నరికిన చెట్టులా.....
తంత్రి తెగిన వీణ లా.....
గొంతు మూగబోయిన గాన గంధర్వుని లా....
పాదాలు పరిభ్రమించిన నాట్య మయూరి లా.......
తుప్పు పత్తిన చుర కత్తి లా....

నెను ఒంటరినై......
నా గది లోపల చీకటి లొ.....
చీకటి లోపల నా గది లో........

ఆ నిరాశర.....
నిశాచరా.......
ద్వీపం నుండి.....
నన్ను రెక్క పట్టి లాగి.....
నాకు అమ్మ ప్రెమనూ......
నాన్న ఆప్యాయతనూ....
అన్న అనుభధాన్ని......

ఎందరివో...
ఆప్యాతా అనురాగాలను...
పసి పాప బోసి నవ్వును....
జవరాలి చిరునవ్వునూ...

వికలాంగుని....
మనో నిబ్బరం...

ద్రుఢ సంకల్పం...
లాంటి ఎన్నో....

ఎన్న్నెన్నో అద్భుతాలను చూపిన...

కాలమా.......
నీకు సలాం...........

మనిషికి మరపు కూడా.....
దివ్యౌషధం అని తెలిసినా....
కాల చక్రమా...
నీకు గులాం.........

kadali raa..

రా ...రా....
కదలి రా.......

కీచక పాలకుల గుండెల్లో....
ప్రళయ కాల రుద్రుని వలె కదలి రా....

స్వార్థ సోమరుల గుండెల్లో అగ్గి బరాటావై రా....
సిమ్హంలా రా....
.శివంగి లా రా......
ప్రజల గుండెల్లొ పావన మూర్తి లా రా....
రామ రాజ్య స్థాపనకు పరశురాముని లా రా....
సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం లా రా...
ప్రజల కరములో పాశుపతం లా రా....
భద్రుడిలా....
వీరభద్రుని లా రా.......
నా గుందెల్లో గూడుకట్టుకున్న లావా లా...
నింగికి ఎగజిమ్ముతూ రా.......
దేశ భవిత కోసం బంధనాలు విప్పుకు రా......
సంకెళ్లు తెంచుకు రా.....
సమర నినాదం తో రా......
సూర్య కిరణం లా రా.....
రెక్కలు విప్పుకు రా...
నా ఆశకు ఆశగా రా.....
నా శ్వాసలొ మమేకమై ర....
రామ రాజ్య స్థాపనకు రా.......
దేశ సంక్షేమానికి కదలి రా.....
దాత లా...
విధాత లా....
నవ దూత లా....
రా.....

Nothing can Stop u

ఎదురులేదు సోదరా
సాగిపో ముందరా
నిన్ను ఆపువాడు పుట్టలేదు రా
జన్మించబోడు రా
నీది పరశురాముని అంశ రా
స్వార్థపరుల గుండెల్లో హింసవు నువ్వు రా
నీ మాటే ఇప్పెన
నీ చూపే చల్లన
నీ ధైర్యం ముందర
శత్రువు తోక ముడుచును రా
నీ ఆవేశం ముందర
కాలం ఆగిపోవును రా
నీ ఆలోచన ముందర
ప్రపంచమే జేజేలు పలుకును రా
నీ ఆశయం ముందర
ఎవడైనా నిలవడం దండగ
తమ్ముడూ..నీ బాట కావాలి
నలుగురికి మార్గ నిర్దేశం
జనులకు ఒక సందేశం
మరపు రాని మధురానుభూతుల ఝంఝాటం

She - That Girl

నా చెలి చిరు మందహాసం
రగిలిచెను నా గుండెలో దరహాసం
తన ఓర చూపుకే
మొదలాయెను నా మది లో తీయటి పాశం
ఆ పరవశపు జల్లులలో తడిసి
ధ్నమాయేను నా జీవుతం
కొంగొత్త భావాలను రేపే తన స్నేహం
ఇదే నాలో మార్పుకు తొలి ఉదయం
ఎపుడూ లేనిది నా మది
తన చూపుకై ఆరాటపడ్డది
కంటి నిండా నిద్ర కరువాయెను
బొజ్జ నిండా భోజనం కూడా మరచిపోయాను
రేయి పగలూ..తన ధ్యాసే
తన నామ సంకీర్తనే
చండ ప్రచండ ఉషస్సు
నాలో మొదలాయెను..అది తన మాయే కామోసు
తను నవ్వింది...నన్ను ఆ నవ్వుల్లో ముంచింది
తను ఏడ్చింది..నా గుండెను పిండి చేసింది
అదేంటో తన మాయలో
నన్ను నేను మైమరచిపోయాను
పరవశించి పోయాను
పులకరించి పోయాను..

Loneliness

వేధిస్తున్న ఒంటరితనం..
బాధిస్తున్న తుంటరితనం...
సాగిపోతున్నా కాలచక్రం..
ఆగను అంటున్నా జీవన యానం..
బ్రతుకు పొరాటం...
గెలుపు ఆరాటం...

VOTE

లుచ్ఛా రాజకీయ బచ్చాల బెండులు తీసే బ్రహ్మాస్త్రం వోట్ అస్త్రం ...
ఎలెక్షన్స్ టైం లో నాటు సారా మత్తులో .....
బిర్యాని ప్యాకెట్స్ ఎత్తులో...
వాగ్దానాల గమ్మత్తులో పడి.....
అస్త్ర సన్యాసం చేసే ...
ఆలొచనకు స్వస్తి చెబుదాము బ్రదర్.....

సారా కిక్...
రెండు గంటల్లో పోతుంది...

కానీ...
ఈ స్వార్థ రాజకీయ రక్కసి....
ఐదు ఏళ్ల వరకూ...
వెంటాడి...వేధించి...చీల్చి...చెండాడుతుంది...

Un titled

చెలి అనురాగపు సరాగాలలో....
సరాగాల రాగాల లో....
రాగాల గగనాల లో...
గగనాల గమ్యాలలో....
కన్నీటి కెరటాల లో....
పన్నీటి జలపాతాలలో.....
తన నవ్వుల నవరత్నాలను ఏర్చి కూర్చి...
రాస్తునా కవితగా

In Dream @ Mid night

నడి రేతిరి నా కలలో నీ రూపం కదలాడెను.....
నిండు వెన్నెల కూడా నీ ముందు వెల వెల పోయెను....

పున్నమి వెన్నెలవా...
దేవ కన్య వా ..
చెలీ నీవెవరు........

గజ గజ లాడే చలి లోనూ...
నీ చిలిపి చూపులతో
నాలో వెచ్చని సెగలు రేపావు....

ఆ వాలు కన్నులలో
ఎన్నెన్ని వయ్యారాలో...
ఎన్నెన్ని చమత్కారాలో.....

You & ME

సంగీతం నువ్వైతే...
సాహిత్యం నేను అవుతా...

పాటవి నీవైతే..
పల్లవి నేనవుతా..

రాగం నీవైతే....
తాళం నేనవుతా...

వీణవు నీవైతే...
తంత్రిని నేనవుతా..

అక్షరానివి నీవైతే...
జ్ఞానాన్ని నేనవుతా...

కాంతివి నీవైతే..
నేను వెచ్చదనాన్ని అవుతా...

కవితవు నీవైఏ..
నేను భావుకతనవుతా..

ఉఛ్వాసానివి నీవైఏ...
నిశ్వాశాన్ని నేనవుతా....

సాగర సమీరానివి నీవైతే...
వెన్నెల వెలుగును నేనవుతా....

వర్షించే మెఘం నీవైతే.........
వికసించే పుష్పం నేనవుతా.........

తొలకరి వానవు నీవైతే.....
తిమిర సమీరాన్ని నేనవుతా.......

నాట్యానివి నీవైతే..
నీ కాలి అందెనవుతా...

పసి పాపవు నీవైతే...
నీ బోసి నవ్వునవుతా...

ప్రేమవు నీవైతే..
నేను లాలననవుతా..

సంతోషం నీవైతే..
నీ పెదాలపై చిరునవ్వునవుతా..

బాధవు నీవైతే..
నీ కళ్లల్లొ కన్నీటిని అవుతా...

ఆశవు నీవైతే..
నీ శ్వాసను నేనవుతా...

మరు మల్లెవు నీవైతే..
సుమధుర సువాసనను నేనవుతా...

పిల్ల గాలివి నీవైతే..
చల్ల గాలిని నేనవుతా...

నిదరవు నీవైతే ...
నీ కంటి పాపను నేనవుతా...

మస్తిష్కానివి నీవైతే...
నీ ఆలొచనను నెనవుతా....

Jhendaa - The Red Flag

పుడమి తల్లి నగు మోమున సిందూరం ఆ జెండా..
వీరుని నుదుట రక్త తిలకం ఆ జెండా..
అభాగ్యుల, దౌర్భాగ్యుల,నిర్భాగ్యుల అభయ హస్తం ఆ జెండా....

స్వార్థ పరుల గుండెల్లో సిమ్హ స్వప్నం ఆ జెండా...
జలియన్వాలాబాగ్ మారణ కాందకు మరిగిన భగత్ సింగ్ రక్తపు రంగా జెండా...

క్యూబా స్వేచ్ఛా వాయువుకు శంఖారావం,ఢంకా నాదం చేసిన చే గువేరా చుర కత్తి లాంతి చూపు ఆ జెండా...
నేపాల్ లో రాజ్యాధికారాన్ని రూపు మాపి ప్రజా పాలన అందించిన జెండా....

తెలంగాణ దొరల దురాక్రమణలను ఎదురొడ్డి బాధితుల బానిస సంకెళ్లు తెంచిన జెండా...
మావొ సిద్ధాంతాలను,
లెనిన్ లెఫ్ట్ తత్వాన్ని,
కార్ల్-మార్క్స్ క్రమశిక్షణను,
స్టాలిన్ సమైక్య నినాదానికి సాక్షిగా నిలిచిన జెండా...

25 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ లో రెప రెప లాడుతున్న జెండా...
రష్యా,చైనా,లాటిన్ అమెరికాలలో ఆత్మ విశ్వాసం తో ఎగురుతున్న జెండా...

భగ్గున మండింది ఉగ్రత నిండిన సూర్యుడిలా అగుపించే జెండా...
నమ్మిన సిద్ధాంతాల కోసం అరణ్య వాసం చేస్తూ ప్రాణాలను పణంగా పెట్టి
ప్రజల కోసం సర్వస్వాన్ని పరిత్యజించి
అరణ్య వాసం లో ఆకులూ అలమలూ తింటూ
ప్రజలకోసం పాటు పడుతూ
వీర మరణం పొందే వీరుల
రుధిర జ్వాలల తో నూతనోత్తేజం నింపుకునే జెండా....

Bhagath Singh - A Real Hero

భగత్ సింగ్
అతని మాట-తూటా..
అతని చూపు-చురకత్తి...
మొండితనం-సహజ లక్షనం.....
బాట-శత్రు దుర్భేద్యం...
మీసం-భారతీయ పౌరుషానికి నిదర్శనం....
నరనరాల్లో-విప్లవ చైతన్యం....
ఆ విగ్రహం-ఆంగ్లేయుల గుండెల్లో సిమ్హ స్వప్నం...
ప్రేమ,-మరో కోణం....

నీ రూపం -100 కోట్ల భారతీయుల మదిలో చెరగని ప్రతిరూపం..
చరిత మరువదు నీ చతురత....
ఓ మహాత్మా....

My Life

నా జీవితంఒక తెరచిన పుస్తకం...
ఒక అలుపెరుగని పోరాటం..
మలుపుల నాటకం..
ఒక ఉదయించిన కిరణం...
ఒక ప్రజ్వలించిన అగ్ని శకలం....
ఒక సుందర, సుమధుర స్వప్నం...

ఆకాశపు అంచులనూ తాకాను....
పాతాళపు పల్లాలన్నీ చూశాను....

అంతులేని ఆనందాన్ని అనుభవించాను....
మరువలేని విషాదాన్ని దిగమింగాను...

నిండు పున్నమి వెన్నెలని ఆస్వాదించాను...
చిమ్మ చీకట్ల అమావాశ్యనూ చూశాను...

చెప్పలేని ప్రేమనూ పొందాను...
భరించలెని ఒంటరితనాన్ని అనుభవించాను...

పంచభక్ష్య పరమాన్నలను భుజించాను...
గంజి నీటిని తాగాను....

ఓ కంట కన్నీటిని కార్చాను....
మరొ కంట ఆనంద భాష్పాలనూ రాల్చాను....

Lord Siva - The Communist Lord

తలపై గంగమ్మ...
తనువు లో సగం గౌరమ్మ...

నుదుట చితాభస్మం...
పెదవుల పై చెరగని చిరునగవు...
మెదలొ నాగాభరణం...
కంఠాన హాలాహలం...
నిలువెల్లా నీకు నీరాజనం....

ఓహ్ సూర్య చంద్ర తేజం...
ఆది మధ్యాంత రహితం....
అసలు సిసలు కమ్యూనిస్టు జాలం..
నీవేలే స్మశాన వాసి.....
భక్తుల గుండెల నివాసి...

U R our Inspiration

నీ అడుగే...
మాకు ముందడుగు..

నీ గమ్యం..
మా లక్ష్యం..

నీ ఆశలు...
మా ఆశయాలు..

నీ ఊహలు..
మా ఉఛ్వాశ,నిశ్వాసాలు..

నీ జీవన యానం..
మాలో రగుల్చును నూతనోత్తేజం...

నీ స్వరం...
ఒక ప్రభంజనం...
మా యుద్ధ నినాదం...

నీవు రగిల్చిన దేశ భక్తి...
మా ఆయుధ సంపత్తి..

నీ మాతల తూతాలు...
మా అస్త్ర శస్త్రాలు...

నీవు విప్లవాగ్ని...
ప్రజా కంటకుల పాలిట బడబాగ్ని...

Untitle

కర్మ ఫలం నీ తోడుండగా..

కాంతి పుంజం నీ ముందుండగా..

భయమేల నీకు దండగా..

బ్రతుకె కదా ఒక పండగ...

భగీరథుని బాటా..

విక్రమార్కుని వీరత్వం..

పరశురాముని పౌరుషం..

అభిమన్యుని తెగువ....

ఉన్నాయి నీ రక్తం లో...

అవి సాన పెట్టడమె కావాలి....

Its U - Again U

నా మస్తిష్కం లో మెదిలే ...
ఆశల..
శ్వాసల...
బాసల...
భాష నీవే...

నా ఊహల...
ఊడల....
ఊయల ...
వలపూ...
నీవే...

నా కలల...
కల్పనల...
కెరటాల...
ఆరాటం నీవే..

నా మధుర...
మకరంద మందారం నీవే...

నా రాతల....
పాటల..
గీతాల...
మాటల ...
అభినేత్రీ నీవే

Myself

ఎవరు నువ్వు?..........
ఆకాశం లో చందమామను అడగండి...
పసి పాప బోసి నవ్వును అడగండి........
నింగికి ఎగిరే పక్షిని అడగండి....
తళుక్కున మెరిసే తారను అడగండి....
మొగ్గ తొడిగిన పుష్పాన్ని అడగండి...
శ్మశానం లో కాటి కాపరిని అడగండి....
ఉదయించే సూర్యుడిని అడగండి.....
బిగించిన పిడికిలిని అడగండి.....
రగిలిన చితి మంటను అడగండి....

నా పేరు మీకు చెబుతాయి.......
నన్ను ఎన్నడూ మరువలేను అంటాయి......


నిండు పున్నమిని అడగండి....
నిశి రాత్రిని అడగండి....
కారు మబ్బులను అడగండి....
సముద్ర తీరాన్ని అడగండి....
ప్రళయ కాలన్ని అడగండి....
ప్రభంజనాన్ని అడగండి....
రెవల్యూషన్ ని అడగండి....
రెసల్యూషన్ ని అడగండి....

నా పేరు మీకు చెబుతాయి....
నేను వాటి దోస్తు ని అంటాయి.......

మా ఊరి మర్రి చెట్టు ని అడగండి....
మా పలనాటి సీమ ముఖ ద్వారాన్ని అడగండి...
మా ఇంటి పక్క కుక్క పిల్లని అడగండి...
మా పెరటి లోని అరటి చెట్టు ని అడగండి....

నా పేరు చెబుతాయి.....
నేను వాటి దోస్త్ ని అని చెబుతాయి.......

nenu - I

పసి పాప బోసి నవ్వును నేను......
చందమామ చల్లని వెలుగును నేను...
అస్తమించని సూర్యుడను నేను...
మడమ తిప్పని సైనికుడను నేను....
పద్మవ్యూహాన్ని చేధించే అభిమన్యుడను నేను...
చెడును చెండాడే బ్రహ్మాస్త్రాన్ని నేను...
శ్రీ..శ్రీ...కవితను నేను...
చాణక్యుని రాజనీతిని నేను...
జర్నలిస్ట్ చేతిలోని కలాన్ని నేను...
గాంధి చేతిలోని కరవాలాన్ని నేను...
భగత్ సింగ్ శాంతి వచనాన్ని నేను..

నేనొక పెను సంచలనాన్ని.......
నేనొక వింత స్వభావిని...
నేనొక మనసున్న మడిసిని.....

Meet me then

నీ ఆశయాలు ఆవిర్లు అయినప్పుదు…
కోరికలు కరిగిపోయినప్పుదు…
దారులు మూసుకు పోయినప్పుదు…
కళ్లు చెమర్చుతున్నప్పుడు…
గొంతు మూగ బోయినప్పుడు…
జీవితం అంధకార కారాగృహం గా మారినప్పుడు..
నా అనుకున్న వాళ్లు నీకు దూరం అయిపోయినప్పుదు...
చీకటే నీ నేస్తం అయినప్పుడు...
నీకు ఎవరూ చేయూత నివ్వనప్పుడు...

నీకు తోడు గా..
నీ నీడగా....
నేను ఉంటాను అని మరువకు నేస్తం...

Life

కన్ను తెరిస్తే జననం…
కన్ను మూస్తేమరణం..
ఇదేనా జీవితం…
కాదా ఇదిశాశ్వతం…
మరి దేనికి బతుకు మీద ఈ మమకారం…
కోరికల వ్యామోహం...

Who R U??

చెలీ ఎవరు నీవు?
తెలుగు దేశం లో .....వెలుగు రేఖవా???
ఆంధ్ర రాష్ట్రం లో....ముగ్ధ మందారానివా??
నా హృదయ సీమ లో.....సన్నజాజివా????
నా మతులకు గమ్మత్తులు నేర్పిన.......మల్లెమాలవా??
నా కలల కనకాంబరానివా???
నా తలపుల తామరవా??
నా వలపుల వాన చినుకువా???
ఎవరు నీవు??

That very Girl - One of my friend


దూసుకు వచ్చే కిరణం ..

ఎగసి పడే కెరటం...

ప్రశాంత సంద్రం...

నిస్సేబ్ధ విప్లవం...

చెరగని చిరు నగవు ...

సడలని మనో ధైర్యం ...

లక్ష్యం కోసం వెదకే కళ్ళు...

అలక్ష్యం చేయని చూపులు....

స్నేహ హస్తం చాచే చేతులు...

ఆలోచింప చేసే మాటలు...

ఆపదలో అదుకునే తత్త్వం..

కలుపు గోలు మనస్తత్వం...

Untitled

అమ్మ నుని వెచ్చని పొత్తిళ్ళలో ఆదమరచి నిద్దరోతున్న పాపాయిలా...

చిమ్మ చీకట్లను పారద్రోలే ఉదయ భానుని తోలి వెలుగు రేఖ లా...

ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని నింపే తొలకరి తోలి వాన జల్లు లా...

అంతరించి పోతున్న విలువలకై మదన పడే కుర్ర జెర్నలిస్టు లా....

శాంతి కోసం తపన పడే గాంధేయ వాడి లా..

బాదితుల, పీడితుల కోసం బందూకులు పట్టిన విప్లవ వీరుని లా..

One day when u left me...

అర్ధరాత్రి ....
ఊరి బైట ...
సెలయేటి గట్టు కాడ ...
నీకోసం ఎదురు చూసాను నేస్తం ..

నువ్వు రావు అని...
కాలం ఆగదని ..
నేను వొంటరిని తెలుసు ...

ఎగసి పడే అలకు తెలియదా ..
తను మరల సంద్రం లో కలసి పోవాలి అని...

పున్నమి చంద్రునికి తెలియదా...
అమావాస్యకు తానూ మరల మూగ బూతాను అని...

వికసించిన పుష్పానికి తెలియదా ..
తను మరల వడలి పోతాను అని...

గర్జించే మేఘాని తెలియదా..
తన గొడవ లిప్త కాలమని...

Its my life

ఆకాశానికి నిచ్చెన వేస్తా...
భూమి పైన చిందులు వేస్తా...
చందమామకు కబుర్లు చెబుతా...
వెన్నెలమ్మకు సైటు కొడతా...
కన్నె పొరికి కన్ను కొడతా...
నా ఇష్టం!!!!

The day u left me lonely...

వెళ్ళిపొయావా నేస్తమా............
నన్ను ఒంటరితనపు తుంటరి తనంలోకి నెట్టేసి..............
నా ఆశలు అనే శ్వాసలను ఆర్పేసి...............
నా ఎదను తీరని రొదతో నింపేసి.............
నీ మత్తులు అనే గమ్మత్తులలో నను ముంచేసి.......

ఎన్నెన్ని కలలో, ఎన్నెన్ని కధలో.........
అన్నిటినీ చెరిపేసి.................
శాస్వతంగా తుడిచేసి..................
వెళ్ళిపొయావా నేస్తమా............

One day @ The day I was bowled..

కాళ్ళకు పసుపు, కళ్ళకు కాటుక....

బుగ్గల్లో సిగ్గులు, జెడలో విరిసిన మల్లెల మొగ్గలు...

నుదుట సింధూరం, చేతిలో మందారం...

మాటలు ముత్యాలు, చూపులు బాణాలు..

నెమలి సింగారం, హంస వయ్యారం......

కామాసు, ఫుల్ స్తాపులు ....లేకుండా...

తను గల, గలా మాట్లాడుతుంటే...

తన మాటలకు ...

లయ బద్దం గా ...

తన చెవులకు వున్న బుట్టలు నాట్యం చేస్తుంటే...

వుఫ్!!!!!!!!

తను మాటలు ఆలకించ కుండా....

నేను తన చెంపలను తాకుతున్న బుట్టల అద్రుస్టాన్ని ...చూస్తూ...

కుళ్ళుకుంటుంటే...

అది చూసి తను సిగ్గు పడుతుంటే...

ఆ సిగ్గులలొ.....

ఆ బుగ్గలు బరువెక్కుతుంటే...

హ హ హ హ ....

choopulu

ఆ చూపులు చిలిపిదన్నాని చిలకరించాలి....
ఆ పెదవులు కొంటెదనాన్ని పలికించాలి....
ఆ నవ్వులు నయాగరాతో తలబడాలి....
ఆ బుగ్గలు ఓల్డ్ బ్రాందిలా, పాయసం లా ఉండాలి....
వర్షంలో మిరిపకాయ బజ్జి అంత హాట్ గా ఉండాలి.....
సుమ్మర్ లో ఐస్ క్రీం అంత కూల్ గా ఉండాలి.... [:P][;)][:D]

Wanna to walk with u....

[red]మరో మహోదయం నా కోసం వస్తే........

బ్రహ్మ నా నుదుటి రాతను మారుస్తాను అంటే..

కాల చక్రాన్ని వెనుకకు తిప్పే సత్తా నాకుంటే...

నీతో కలసి 7 అడుగులు నడవాలని....

నూరు ఏళ్ళు గడపాలని...

ఆనందాన్ని పంచుకోవాలని....

బాధను తుంచుకోవాలని....

నీ పెదవులపై చిరు నవ్వుల జల్లులు చూడాలని..

నీ సుప్రభాతంతో సూర్యొదయాన్ని ఆహ్వానించాలని....

నీ ఒడిలో సెద దీరుతూ పున్నమి వెన్నెల అందాలను ఆస్వాదించాలని....

నీ జోల పాటతో జగాన్ని మరవాలనీ, జాబిల్లిని చూడాలనీ...క

న్న కలలు అన్నీ కల్లలు కాదనీ..

ఎలుగెత్తి చాటాలనీ...

గొంతెత్తి పాడాలనీ ఉంది నేస్తం [;)][:P]

UnTitled

ప్రజలు నాకు ప్రణవనాదాలు...

పేదల ఆర్తనాదాలు నా మంత్రోచ్చరణాలు...

అభాగ్యుల సహజీవనం నా తపోవనం...

అన్నార్తుల ఆకలి కేకలు నా అస్త్ర-శస్త్రాలు....

స్వార్ధ పాలకులపై శంఖారావం నా సంధ్యావందనం...

నా పేరు ఉషస్సు,

నేను పీడిత ప్రజల తేజస్సు...

Obamaa"ism"...

ఆ నల్ల సూర్యుని మనోధైర్యం ముందు వర్ణ వివక్ష తలవంచి సలాం చేసి, గులాంగా మారిపొయింది...
శ్వేత జాతీయుల చేత అవమానించబడ్డ ఆ నల్లవాడు ఇప్పుడు శ్వేత జాతీయుల ఆరాధ్య దైవం....

అవమానించిన ఆ తనువులే నేడు ఆత్మీయతను పంచుతున్నాయి..
చీదరించుకున్న ఆ నోళ్ళే నేడు నువ్వే మా వెలుగు రేఖ అని చేతులెత్తి మొక్కుతున్నవి....

ఓ జాత్యాహంకారాన్ని జయించిన జమదగ్ని...
నిన్ను చూసి నొసలు చిట్లించిన శ్వేత సౌధం నేడు నీకు సాదర స్వాగత సుమాంజలులు పలుకుతున్నది..

సామాన్యుని అసామాన్య శక్తివి నీవు....
చరిత్రను తిరగరాసిన చతురత నీది....

నీ జాతిపై కత్తులు దూసి, కన్నెర్ర చేసిన ఆ జాత్యాహంకారులను....
క్షమించి నేడు వారి గాయాలకు శస్త్ర చికిత్స చేసి,
వారి కన్నీళ్ళ కడగళ్ళు తుడవదానికి నడుంకట్టిన అవతార మూర్తి....
నీకు నీవే సాటి......

పగ్గాలు తెంచుకొని విక్రుత చేష్టలతో పరుగులిడుతున్న ఆర్ధిక మాంద్యానికి సంకెళ్ళు వేస్తావని....
ప్రపంచను నడి బొడ్డుపై నగ్నం గా నర్తిస్తూ,
భయూత్పాదాన్ని స్రుష్టిస్తున్న ఉగ్రవాదంపై సమరశంఖం పూరించి,
శెరాఘాతాలతొ గజగజలాడించి స్మశనానికి సాగనంపి ఘోరీ కడతావని...

నీ రాక కోసం,
నీవు వాగ్ధానం చేసిన బాసల బాటల కోసం,
నీవు శ్రుష్టిస్తాను అన్న మరో ప్రపంచం కోసం,
నీవు మాలొ ప్రోది చేసిన నమ్మకాల అమ్మతనం కోసం,
రేపటి మా ఆశల సౌధాల కోసం,
భావి భవిత కోసం ...

ప్రపంచం నలుమూలల నుండీ కోటాను కోట్ల కళ్ళు ...
నీమీద నమ్మకంతో,
ఆత్మ విశ్వాసంతో,
పట్టుదలతో,
ఆశలను స్వాసలు గా చేసుకొని చూస్తున్నా నాయకుడా..

tanu - malli tane

ఆల్చిప్పలో మెరిసే ముత్యంలా తను హంస తూలికా తల్పం పై సేద దీరిన వేళ,
ఏకాంతంలో ఆ కాంత నుండి ఎగసిపడే కాంతులతో ఆ గది లోపల చీకటి చిద్విలాసం చేయుచుండగా,
ఆ తరుణి తనువుని తాకుతున్నాను అన్న చిలిపి తలపుతో చల్లగాలి తన్మయత్వంలో తడసి ముద్దవగా...
ఆ గాలితో చెట్టా-పట్టాలు వేస్తూ తన కురులు నౄత్యం సేయగా...
ఆ సుందరి సౌందర్యాన్ని శ్రీనాధుడు వర్ణిస్తున్నాడా అన్నట్లు, వెనక నుండి మంద్రంగా సంగీతం వినిపిస్తుండగా..
ఆ కళ్ళలో కొంటెదనాన్ని,
ఆ చూపులలో చిలిపిదనాన్ని,
ఆ పాల బుగ్గలలో పాల పుంతలను చూసి ఆకాసంలో వెన్నెలమ్మ వలపు రాగాలు పాడగా...
ఆ కలువ అందాలకు ముగ్ధుడై కరి మబ్బుల చాటునుండి చందమామ చల్లగా విరహ బాణాలు సంధించగా..
ఆ పాలరాతి శిల్పం పెదవులపై విరిసిని చిరు దరహాసాలు నా మదిలో మధుర మకరందాల మందారాలు పూయించగా....
తన చూపుల బాణాలు నాలో చిలిపి ఆశలను రగిల్చి నన్ను తీయని చిత్ర వధకు గురిసేయగా...
తన తలపుల వలపులలో నేను తరించిన వేళ...
ఆహా ఏమి భాగ్యము...
ఎంత సుమధురము..
ఆ మధురము..

One sunday

అదివారం నాడు....

వేకువ జామున బద్దంకం గా వళ్ళు విరిచి నిద్ర లేచి అలా బైటకు వెళ్ళాను....

పక్షుల కిలకిల రాగాలు,

చల్లని మంచు పొరలను చీల్చుకు వస్తున్న ఉదయ భానుని వెచ్చని లేలేత కిరణాలు...

ఎందుకో తెలీదు నీ తీయటి మాటలు వినాలి అనిపించింది...

నీకు కాల్ చేసాను....

మోనమే నీ సమాధానం అయ్యింది [:(]

Title less

నా కన్నీటిని కిలోలలో అమ్మాలని ఉంది.....
ఆ నా జాలువారుతున్న కన్నీటితో నీ పాదాలను కడగాలని ఉంది..
అవి నువ్వు నాకు మిగిల్చిన తీపి గాయాలని లోకాని చూపాలని ఉంది....
నా ఎద రోదనను ఎలుగెత్తి చాటాలని ఉంది..

Un named

నా పెదవుల పై
నవ్వుల పువ్వుల నీడన దాగిన వాడిన బాధ...

చూపుల చాటున మాటున చిక్కిన నక్కిన కన్నీటి గాద...
గాయ పడ్డ గుండెల గోడల లోపలి మౌన రోదనలు...
విరిగిన మనసున రేగిన భీకర వడగాలుల హాహాకారాలు...
సోకపు సునామీలు...

Wanna to be Aloneeee

చీకటమ్మ ఒడిలో ...
చిద్విలాసాల బడిలో...
చికాకులన్నీ, చిరాకులన్ని చుట్టి చితిలో వేసి...
చల్లగా నిద్దరోవాలని ఉంది...

ఎడారిలో గుడారం వేసుకొని ఒంటరిగా గడిపేయాలని ఉంది...
సమాజాన్ని మరచి, ప్రపంచాన్ని విడిచి ...
నా కోసం నేను అని తపించే, పరితపించే స్వార్ధానికి సలాము చెయ్యాలని ఉంది...

అమ్మ కడుపులో ఉన్నప్పుడు అనుభవించిన ..
ఆ ఒంటరి తనాన్ని మరలా ఆహ్వానించాలని ఉంది..

వెళుతురు కనపడని.. వేకువ వినపడని... మెళుకువ అక్కరలేని ...శాశ్వత నిద్దర పోవాలని ఉంది...

నాకు దూరంగా వెళ్ళిపోతున్న నా వాళ్లకు ఊహలకు చిక్కకుండా ..
సుదూర తీరాలకు తరలి పోవాలని ఉంది...

మనుషులు ఎవరూ కనపడని...
మాటలు ఏవీ వినపడని...
మరో ప్రపంచానికి పారిపోవాలని ఉంది...

ఆకలి - దప్పిక లేని..
కలతలు - కన్నీరు లేని...
ఆశలు - ఆవేశాలు లేని...
ప్రేమ - ద్వేషం లేని..
కోరిక - విరహం లేని...
గెలుపు - ఓటమి లేని..
గమనం - గమ్యం లేని..
దౌర్జన్యాలు - దురాక్రమణలు లేని..
కుట్రలు - కుతంత్రాలు, మోసాలు - మంచితనాలు లేని...
మరో ప్రపంచానికి పారిపోవాలని ఉంది...

ఆప్యాయతలను అరచేతితో ఆర్పేసి...
బంధాల బందిఖానాను బద్దలు కొట్టి...
అనురాగాల రాగాలను తెంపి వేసి, మనుషులు కనపడని,
మనసులు తెగిపడని మరో లోకానికి పారిపోవాలని ఉంది..
నన్ను నేను ప్రేమించుకోవాలని ఉంది...
నాకు నేను శిక్షించుకోవాలని ఉంది...

nene - anni nene

గగనమే నా గమ్యం..
జగడమే నా జీవం...

రాముడు నా వాడు...
రావణుడు నా వాడు...

కృష్ణుడు నా వాడు..
కంసుడు నా వాడు...

కత్తులు దూసేది నీనే..
శాంతి వచనాలు పలికేదీ నేనే ...

స్వరం నాదే...
జపం నాదే...
తపం నాదే...
సమిధను నేనే...

ఉదయించేది నేనే...
అస్తమించేది నేనే...

వెన్నెల నేనే ...
చీకటి నేనే...
కాంతిని నేనే...
కాటుక నేనే...

రాజును నేనే..
బంటుని నేనే..

రుధిరం నేనే..
మధురం నేనే..

కాటి కాపరిని నేనే..
ప్రజల ఊపిరిని నేనే..

కన్చుని నేనే..
మంచుని నేనే..

nuvvu - YOU

నిను మరచిన క్షణం లేదు..

నిను తలువని ఘడియ లేదు..

ఉదయ భానుని తోలి వెలుగు రేఖలో నీవే...

సాయం సంధ్యా వేల సెలయేటి స..రి.. ..గ..మ..ప..ద..ని సల సరాగానివీ నీవే...

నా ఎదలో అలజడివీ..

నా మదిలో మోహన రాగానివీ నీవే..


మనసులు దేగ్గరైన వేళ,

మాటలు మూగబోతాయి..

తనువులు దేగ్గరైన వేళ,

ఆసలు ఆవిర్లు గా మారతాయి...



vaadu - HE

ప్రజాస్వామ్య వాదుల గరళం నుండి గర్జించిన సమైక్యవాద రాగం అతను...
సామ్యవాద రధసారధుల సమర నినాదాల నుండి ఉద్భవించిన శంకారావం అతడు..
చీకటి గుండెను చీల్చుకు వచ్చే ఉషోదయపు తొలి వెలుగు రేఖ అతడు..

కర్షకుల, కార్మికుల చెమట బిందువుల నుండి జనిచిన ఓంకార బీజాక్షరం అతడు..
పడి లేచే కెరటం వాడు..
ప్రవహించే గాత్రం వాడు..
కదిలించే కావ్యం వాడు..
పోరాడే పాశుపతం వాడు..
నవ్వించే నేస్తం వాడు..
నడిపించే నాయకుడు వాడు...
సమర శంకం వాడు..
విజయ నినాదం వాడు..
విప్లవోద్యమం వాడు..
ప్రజల ప్రణవ నాదం వాడు..
జనం వాడు...
ప్రభంజనం వాడు..


nenu - ME

యతిని నేను..

.గతిని నేను..

ప్రజాస్వామ్య ప్రగతిని నేను..

గగనాన్ని నేను..

గమ్యాన్ని నేను..

కాలాన్ని నేను..

కరవాలాన్ని నేను...

గడ్డి పరకను నేను..

గడ్డ పారను నేనే...

కాలాన్ని నేను..

భావజాలాన్ని నేను..

జననాన్ని నేను..

మరణాన్ని నేను..

జనన మరణాలకు అతీతుడిని నేను..

మనిషిని నేను...

మహాత్ముడిని నేను..

మనుషుల్లో మహాత్ముడిని నేను..

రాతను నేను..

తలరాతను నేను..

తలరాతలు రాసే తాతకు మనవడిని నేను..

మధురాన్ని నేను..

రుధిరాన్ని నేను..

మధుర, రుదిరాలు కలబోతను నేను...


నడవండి......నడవండి ...

విప్లవం కోసం వేల సంఖ్యలో ప్రాణలు విడిచిన వీర కిశోరులారా......

మీ పోరాటం మీతో సమాధి కాలేదు......

అది గెరిల్లా యుద్ధ తంత్రంలా గమ్యం వైపు దూసుకుపోతోంది....

విజయమో లేక వీర మరణమో.....

భయం లేదు నేను ఈ ప్రయాణంలో ప్రాణాలు విడిచినా.....

ధనిక రాబందుల దౌర్జన్యాలు చెల్లవు ఇకపైన...

క్యాపిటలిష్టుల కలలు కల్లలే ఇకపైన...

సామ్రాజ్యవాద రాధసారదుల రుధిర జ్వాలలే ఇక పైన...

సామ్యవాదానికే పట్టాభిషేకం ఇక భువిపైన...

అల్లూరికి వారసులారా...

భగత్ సింగ్ బందూకులారా..

చేగువేరా చురకత్తులారా...

స్టాలిన్ - మార్క్స్ సైనికులారా ...

ఎర్ర బావుటా నిగానిగాలారా...

నడవండి......నడవండి ...

ఇక మనదే రాజ్యం..

ఇది ప్రజా పూజ్యం...

ఆత్మబలమే మీకు ఆయుధం...

ప్రజాబలమే మీకు పాశుపతం..

నిర్భాగ్యుల ఆకలి కేకలే మీ శంకారావాలు...

శ్రీశ్రీ కలం మీదే...

పుచ్చలపల్లి "పవర్" మీదే...

పొలం మనది..

హలం మనది..

పండించే జలం మనది...

ఫలం వాడిదా??

సాగవు ఈ దారుణ దురాగతాలు ఇకపైన...

ఎర్ర బావుటా మన ఆయుధం ఇకపైన.



Prabhaakaran - The Tiger

జాత్యాహంకార సింహళీయుల నిరంకుశత్వంలో..
నిస్పృహతో నిదురిస్తున్న తన జాతి జనుల చీకట్లను పారద్రోలి,
వారి కళ్ళలో వెలుగురేఖలు పూయించడానికి..
ప్రభవించెను ఒక "ప్రభాకరం"...

తన జాతి జనుల భావవ్యక్తీకరణ పై
జరుగుతున్న చిరకాల దాదులకు చరమగీతం పాడ వికసించెను ఆ "మందారం"...

తన జాతి రక్తపు మరకలతో తడిసిన నేలను చూసి....
పగిలిన, రగిలిన గుండెతో పంజా విసిరెను ఆ "బంధూకం",
నింగికి ఎగిరెను ఆ "సింధూరం"...

అయినా జాఫ్నా నది వీదుల్లో జనం నడియాడినంత కాలం..
వినిపిస్తూనే ఉంటుంది ఆ విజయ నినాదం..

రాలిపోయింది "నువ్వు" మాత్రమే...
చెదరని, సడలని నీ "మనో"ధైర్యం కాదు..
బింగించిన నీ పిడికిళ్ళు కాదు...
తెగించిన నీ ధైర్యం కాదు..
ఉద్యమించిన నీ "ఊపిరి" కాదు...
ప్రవహించిన, ప్రవచించిన నీ "స్వతంత్ర" భాషల భావాలు కాదు...



kalam - The PEN

నీ కలం కావాలి ...
అమర వీరుల నుదుట సింధూరం...
విప్లవ యోధుల చేతుల్లొ బందూకం...
స్వార్థ పాలకుల గుండెల్లో కరవాలం..

నీ కలం ...
కష్ట జీవుల కళ్లల్లో కన్నీళ్ల కడగళ్లు తుడవాలి...
బడుగు బలహీనుల గుండెల్లొ బలాన్ని నింపాలి...
అవినీతిని అంతం చేసే అణ్వాస్త్రం కావాలి...
భరత మాత మోము పై చెరగని చిరునగవులు చిందించాలి...
చెడును చీల్చి చెండాడాలి...
మంచితనానికి మనస్సాక్షిగ నిలవాలి...
స్వార్థపరుల గుండెల్లో శివతాండవం చెయ్యాలి....
రాజకీయ రాబందుల రుధిర ధారలు చూదాలి...
ప్రజల్లో చైతన్యాన్ని నింపాలి....
పాలకుల గుండెల్లో ప్రళయాన్ని సృష్టించాలి....

అవని లో భారతావని ని తలమానికం చెయ్యాలి.....

నీ కలం తేవాలి .....
ఈ రాక్షస రాజ్యం లో...
ప్రజాస్వామ్యం....


Wednesday, July 29, 2009

Sri Sri kavitalu

చిమ్మ చీకట్లలో ఉషోదయాన్ని నింపే వెలుగు దివ్వెలు...
కల్మషం ఎరుగని పసి పాప పెదవుల్లోని బోసి నవ్వులు..

వేకువ జామున కూసే కోయిల కమ్మని కుహు-కుహూ రాగాలు...
నిరాశా, నిస్పృహలతో నీరశించి పోతున్న యువతరంలో ఉత్తేజాన్ని నింపే మంత్రోపదేశాలు..
కర్షకుడి కనులలో ఇంకిపోయిన కన్నీరు చెప్పే కధలు..
కార్మికుడి కష్టాలలో నుండి ఉద్భవించే స్వేద బిందువు చెప్పే వ్యధలు..

ఉద్యమాలలో ప్రాణాలను త్యజించిన విప్లవ వీరుల రుధిర జ్వాలలు చెప్పే రహస్యాలు...
సమ సమానత్వాన్ని స్మరించే, తపించే విప్లవ ఇతిహాసాలు..

నిదురిస్తున్న జాతిని జాగృతం చేసే ఉద్య భానుని తొలి వెలుగు రేఖలు..
పంటి బిగువున పురుటి నెప్పులు భారితూ మరో జీవికి మార్గం సుగమనం చేసే మగువ మమతానురాగాలు..

ప్రజా కంటక ప్రభుత్వాల పునాదులను పెకిలించే ప్రజాస్వామ్యపు ఆయుధాలు..
దుర్మాగపు దీవిలో, అన్యాయాల అడవిలో భూమిని చీల్చుకు పూసే "ఎర్ర" మందారాలు..
శ్రీ శ్రీ కలం నుండి జాలువారిన కవితలు..



Sri Sri - Unnadaa

శ్రీశ్రీ అంటే ఒక తేజస్సు ......
శ్రీశ్రీ అంటే మనిషిలో దాగి ఉన్న నిప్పు రవ్వ ...

శ్రీశ్రీకి మరణం లేదు .......
విప్లవం బతికి ఉన్నంతవరకు ...

శ్రీశ్రీకి మరణం లేదు....
తెలుగు వాడు ఉన్నంతవరకు"...

శ్రీశ్రీ కి మరణం లేదు....
తెలుగు కవిత కాటికి పోయేవరకూ"...


Sri Sri - Atadhu

అతడు...
తెలుగు కవితను నవ్వించాడు..
నడిపించాడు..
తరిమాడు...
ఉరిమాడు...
లాలించాడు...
పాలించాడు...
మెరిపించాడు...
మురిపించాడు...
తడిపాడు...
కుదిపాడు...
కదిలించాడు..
ఏడిపించాడు...
కవ్వించాడు...
ఖండించాడు....
కొంగ్రొత్త సొగసులు అద్దాడు..

పంజరంలో బందీగా ఉన్న కవిత బంధనాలు తెంచాడు...

ధనిక వర్గాల పడక గదులకు పరిమితమైన కవితను...
సామాన్యుల ఆడపడుచుగా మార్చాడు...

అణగారిన వర్గాలకు ఆత్మగా పరమాత్మగా మారాడు...
సాయుధ సైనికులకు సర్వం తానై నిలచాడు..


Sri Sri ( Srirangam Sreenivisa Rao)

తన కవితతో విషం కక్కాడు శ్రీశ్రీ ...
ఆ విషం కాల కూట విషానికి విరుగుడుగా మారింది...

తన కలంతో గుండెలపై గాయం చేసాడు శ్రీశ్రీ..
మనుషుల్లో ఉన్న చెడు రక్తం బైటకు దూసుకు వచ్చింది..

శ్రీశ్రీ ఏక్ బడా చోర్!!!!!!!
నిర్దాక్షన్యంగా ప్రజల గుండెలను తన కవితావేసాలతో దోచేసాడు..

శ్రీశ్రీ ఖూనీ ఖోర్ ..
తన "ఖడ్గ సృష్టితో" ప్రజా కంటకులను ముక్కలు ముక్కలుగా ఖండించేసాడు..

శ్రీశ్రీ ఒక పిచ్చివాడు..
రాజు - పేద భేదం లేని సమ సమాజం వస్తుందని కలలు కన్నాడు..

శ్రీశ్రీ ఒక మూర్ఖుడు...
ఆకలిగొన్న ప్రజలే నా ప్రణవనాడులు అన్నాడు..

శ్రీశ్రీ ద్రోహి....
తర తరాలుగా సామాన్యుడికి అందని కవిత్వాన్ని, అందరికీ అందించాడు..