Tuesday, June 26, 2012



నే బుడి బుడి అడుగులు వేస్తున్నపుడు 
చేయి పట్టి నీ గుండెలపై నడిపించిన రోజులు గుర్తున్నాయ్!!!

కోరలు చాచిన లోకపు అన్యాయాలు బుసలు కొడుతూ నన్ను తరుముతున్నపుడు 
నువ్వు కవచంలా మారి నన్ను కప్పిన రోజులు గుర్తున్నాయ్!!!

నా మార్గంలో భయానక ముళ్ళు, భీకర రాళ్ళ కత్తుల వంతెనలని చూసి నే వెనుకడుగు వేసినపుడు
నా వెన్ను తట్టి నీ భుజాలపై నన్ను మోసి దరిచేర్చిన రోజులూ గుర్తున్నాయ్!!!

నాన్న!!
అక్షరాలూ రెండే!!
ఆ రెండు అక్షరాలూ ఇచ్చే బలం "ఐరావతం" తో సమానం!!!


( In completed ...) - Bhagath 
మేము సంఘ జీవులం!! సౌమ్యం మా స్వభావం!! శాంతి మా మంత్రం!!
మేమంటే సమాజానికి గౌరవం!! మా జీవితం ఓ నిఘంటువు!!
నిస్వార్ధం మా ప్రాణం!! సామాజిక సేవ మా దినచర్య!!!
నా పేరు "సర్కార్"!!! నేను ప్రజాస్వామ్యానికి "పెద్దన్న" ని!!!


ఒంటరి పక్షులు మీరు!! రాతి మనస్కులు!!!
మీరంటే ప్రజాస్వామ్యానికి అసహ్యం!!
మీ జీవితం గందరగోళం!!!  చీకటి మీ చెలిమి!!
అశాంతి మీ జీవితం!! ఆయుధం మీ కవచం!!!
త్యాగం మీ మార్గం!!! ఉద్యమం మీ శ్వాస!!!
నీ  పేరు "తిరస్కార్"!!!
నువ్వు ప్రజలకి "అన్న"వి!!!
నక్షత్రాన్ని, నిన్ను ఒకే వరుసలో నిలబెట్టాను!!
నా కంటికి అందంగా అనిపించింది - నువ్వే!!
ఏమిటో ఈ మాయ అనుకున్నాను!!
అర్ధం కోసం అంతర్జాలం (Internet) ఆశ్రయించాను!!!
పరమార్ధం పేరు "ప్రేమ" అని తెలుసుకున్నాను - Bhagath 
చీకటి మబ్బులు


చీకటి మబ్బులు కమ్ముకోస్తేనే కదా 
రేపొచ్చే ఉషోదయాన్ని నువ్వు ఆస్వాదించ గలిగేది!!!

ఆకలి బాధ తెలిసోస్తే కదా
 పచ్చడి మెతుకుల రుచి నీకు తెలిసొచ్చేది??
గరళాన్ని గుటకేస్తే కదా అమృతం విలవ నీకు తెలిసేది!!!

పాడెపై పడున్న"ప్రజాస్వామ్యాన్ని చూస్తేనే కదా
నీలో దాగున్న "కమ్మునిష్టు" నిద్దుర లేచేది!!

ఇది నిద్ర లేచే సమయం!!
అదిగో యుద్ధ భేరి!!
ఇవిగో  తూటాలు!!!
పోరాడు!!!

గెలుపా??
మార్క్స్ "కలని" కన్నులారా చూద్దువు గాని!!!

ఓటమా??
భయం వలదు!!!
నీ చితి మంటల సాక్షిగా మరో యోధుడు ఉదయిస్తాడు!!!
ఉద్యమానికి ప్రాణం పోస్తాడు - Bhagath