Wednesday, September 21, 2011

నెలవంకనడిగాను - నచ్చెలి రూపు రేఖలేమిటని!!!
స్వాతిచినుకునడిగాను - తన ఎదలోని "ఆ" తలపులేమిటని!!!
రామ చిలకనడిగాను - తన మాటల మాధుర్యం ఎలాంటిదని!!!
సాయం సంధ్యని బ్రతిమాలాను - తన సరసకి చేరు దారెటో తెలుపమని!!!
చల్ల గాలినడిగాను - తన సిరుల కొలతలేమితని!!!
ఇంద్రధనస్సుని అడిగాను - తన పెదవంచున దాగిన ఆ చిరునగవుల మర్మమేమిటని!!!
తన కారుమబ్బుల కురుల నుండి జాలువారిని మల్లెపూలనడిగాను - తన చమట బిందువు చెప్పిన రహస్యాలేమిటని