Friday, November 9, 2012

అవును 
సమాజం కళ్ళలో నేను ఒంటరినే!

పారుతున్న ఏరు లా 
వీస్తున్న గాలి లా 
విరగ పూసిన అడవి మల్లి  లా 
పురివిప్పిన నెమలిలా 
నేను ఒంటరినే!!

పారుతున్న ఏరు 
ఈదుతున్న చేపతో చేసిన చెలిమిని 
చూడలేదు ఈ సమాజం!!

వీస్తున్న గాలి 
నడుస్తున్న జవ్వని కురులతో చేసిన చెలిమి 
కాన లేదు ఈ సమాజం!!

విరగ పూసిన మల్లి 
పంచ వర్ణాల తేనతీగతో 
అల్లిన అనురాగాలని 
చూడలేదు ఈ సమాజం!!

తొలి వర్షపు చినుకులతో 
నెమలి నడిపిన 
రాసలీలలు చూడ లేదు ఈ సమాజం!!

అవును నేను ఒంటరినే!! ( Bhagath - 8-11-12)

No comments:

Post a Comment