Wednesday, July 17, 2013

మరణ శాసనం

  మరణ శాసనం

నేను తిరిగి వస్తాను!
నేను తిరిగి లేస్తాను!!

ఆకశం ఎరుపెక్కిన వేళ
పీడిత వర్గాల పిడికిళ్ళు బిగుసుకున్న వేళ

అడవే ఆయుధమై రాజ్యాన్ని చుట్టుముట్టిన వేళ
 దగా పడ్డ యువత అగ్గిరవ్వలై ఉవ్వెత్తున ఎగసి పడే వేళ

శ్రామిక, కార్మిక వర్గాలు చురకత్తులై సమారభేరి మోగించిన వేళ
సామాన్యుడు అసామాన్యుడై పోరు కేక పెట్టిన వేళ

సామ్య వాద శక్తులు విప్లవ శంఖారావం పూరించిన వేళ
 ఉద్యమం ఉదయించే వేళ
ఉవ్వెత్తున ఎగసిపడ్డ తిరుగుబాటు ఉద్యమ కిరణాల మహోగ్ర జ్వాలలో
 రాజ్యం అస్తమించిన వేళ
చీకటి సామ్రాజ్యంలో వెలుగు పూలు పూచే వేళ !!

తల్లి భారతి సామ్యవాద కిరణాన్ని ప్రసవించిన వేళ
ప్రభవించిన ఆ ఉద్యమ నెలబాలుడు
గండ్రగొడ్డలితో వర్గ శత్రువు శిరస్సు ఖండించే వేళ  
ఆ వెచ్చటి నెత్తుటి ధారలలో భువన భవనపు బావుటా తడిచే వేళ

ఆ వేళ నా సమాధి చేరసాలని బద్దలు కొట్టి నేను మరల ఉదయిస్తాను!!
ఆవులిస్తూ నిదురలేచి కళ్ళు తెరచి  బావుటాకి "సెల్యూట్" చేస్తాను !!


నేను తిరిగి వస్తాను!!
నేను తిరిగి లేస్తాను!!

(సమయం: 17-జులై-2013, సిడ్నీ)



No comments:

Post a Comment