నాపై వెలుగులు చిమ్మగానే నన్ను అంధకారంలోకి తోసేసింది నువ్వు
నాకు నవ్వడం నేర్పింది నువ్వు
నా నవ్వులను కాజేసింది నువ్వు
నాకు ఆనందం కలిగించింది నువ్వు
నాకు వ్యధను మిగిల్చింది నువ్వు
నాకు వానలో తడవడం నేర్పింది నువ్వు
నన్ను వానలో ఏడుస్తూ నిలిపింది నువ్వు
నన్ను ఆశల ఆకాశానికి ఎగరవేసింది నువ్వు
నన్ను ఒంటరి తనపు పాతాళానికి తోసేసింది నువ్వు
నా ఊహలకు రెక్కలు తొడిగింది నువ్వు
నా తొడిగిన రెక్కలను ముక్కలు చేసింది నువ్వు
నా హృదయంలో ప్రేమను పుట్టించింది నువ్వు
నా హృదయంలో ప్రళయం సృష్టించింది నువ్వు
నా జీవన సరాగంలో ఓ కొత్త రాగానివి నువ్వు
నా హృదయంలో ఓ తిరిగి రాని ఉదయం నువ్వు
నా జీ"వనం"లో సుందర "వనానివి" నువ్వు
నా డైరీలో ఓ చిలిపి పేజీవి నువ్వు
No comments:
Post a Comment