Friday, August 7, 2009

U

అతడు కన్నెర్ర చేసి కత్తి పట్టినా
గొంతెత్తి దిక్కులు పిక్కటిల్లేలా గర్జించినా
కాలంతో కలకలం సృష్టించినా
కాళ్ళకు గజ్జ కట్టి శివతాండవం చేసినా
అది బాధిత పీడిత ప్రజల కోసమే!!!

అతను వస్తాడని..
వారి చీకటి బతుకుల్లో వెలుగులు తెస్తాడని..
వారి కన్నీటి ప్రవాహాలకు ఆనకట్ట వేసి...
వారి బాధలకు సమాధి కడతాడని ఎదురు చూస్తున్నారు...

అతని రాక వారికి సంక్రాంతి
అతని బాట వారికి "క్రాంతి"
అతని మాట వారికి "వేదం" - అదే వారికి "ప్రణవనాదం"
అతడే వారికి దిశా-నిర్దేశం చేసే సూర్యోదయం
అతడు కన్నెర్ర చేస్తే అదురుతుంది భూగోళం



No comments:

Post a Comment