Friday, August 7, 2009

We, Indians

మేము కరచాలనం చేసాము -
మీరు కత్తులు దూశారు
మేము సోదర భావంతో ఆలింగనం చేసుకున్నాము -
మత చాందసవాదంతో మీరు ఆత్మాహుతి దాడులు చేసారు
మేము శాంతి కపోతాలు ఎగురవేసాము -
మీరు విషపు వాయువులు కక్కారు!!!

మా మౌనం చేత కాని తనం కాదు
ఆ మౌనం మనసు పగిలి, కడుపు మండి, కన్నెర్రబడితే
ఆ కళ్ళనుండి దూసుకు వచ్చే
నిప్పు కణికలు ఉగ్రవాదాన్ని ఉప్పు పాతర వేయగలవు
ఉగ్రవాదాన్ని మాపై ఉసిగొలుపుతున్న పోరుగుదేసాన్ని పాతాళానికి తోక్కేయ్యగలవు!!!

ఇక యుద్ధభేరి మొగిద్దాం
సమరశంఖం పూరిద్దాం
ఉగ్రవాదాన్ని తరిమికోడదాం

మన ధైర్యమే మన అస్త్రం
మన మంచితనమే మన కవచం
పృథ్వి, అగ్ని, వాయు, ఆకాష్, నాగ లే మన బలం

No comments:

Post a Comment