నా మదిలో పూయించెను మధుర మకరందాలు
ఆ నీ చిరు నగవులు ఆడెను
నా గుండెలతో చేలగాటాలు
చెలీ ఎవరు నీవు?
తొలకరి తొలి వాన జల్లువా?
సంధ్యా రాగానివా?
వెన్నెల వాసంతానివా?
ఏరువా? సెలఏరువా?
కోయిల పాటవా?
మధుర మకరందానివా?
లేడి చంగువా?
హంస వయ్యారానివా?
ఆకాశాన మెరిసే తారవా?
శతకోటి కాంతుల కల్పనవా?
కలలో నన్ను కలవరపెట్టిన కాంతవు నీవేనా?
నా మదిలో తీయటి మానసిక సంఘర్షణకు కారణం నువ్వేనా?
నీ తలపుల తుళ్ళింతలో నన్ను తాడిపావు
నీ చూపుల బాణాలతో నన్ను బంధించావు
నీ ఊహల ఊయలలో నన్ను కుదిపి కదిపావు
ఎంత మరచిపోదామన్నా మరల మరల గుర్తొచ్చి
నా గుండెల్లో గోల పెడుతున్నావు ...
తనువంతా ఏదో తీయదనంతో తడిపేస్తున్నావు..
No comments:
Post a Comment