మతాల మారణ హోమం మూర్చరిల్లేలా...
తరాల తారతమ్యం తొలగిపోయెలా...
చేయి చేయి కలుపుదాం...
వసుధైక కుటుంబం వైపు అడుగులు వేద్దాం...
చిమ్మ చీకాటితో సహజీవనం చేసే
చీకటి సోదరులకు వెల్గు రేఖలము మనమవుదాం...
ఆకలితో అలమటించే అభాగ్యుల కడుపులో చల్ల మనమవుదాం..
సామ్రాజ్య వాద సెక్తుల గుండెల్లో నిద్దరోయె
ఎర్ర బావుటాలం మనమవుదాం....
బాదిత, పీడిత ప్రజల బాగోగులు మన ప్రణవ నాదాలు..
నిరుపేదల ఆర్తనాదాలు మన మంత్రోచ్చరణములు....
అభాగ్యుల సహజీవనం మన తపోవనం...
అన్నార్తుల ఆకలి కేకలు మా అస్త్ర శస్త్రాలు...
No comments:
Post a Comment