Thursday, August 6, 2009

Who R u??

చెలీ ఎవరు నీవు?
గలగల పారే ఏరువా??
సెలయేటికి నాట్యం నేర్పిన మయూరివా?
కోయిలకు రాగం నేర్పిన కోమలివా?
హంసకు హొయలు నేర్పిన హిమ శిఖరానివా?
రామచిలుకకు పలుకు నేర్పిన రాణి వాసానివా?
వెన్నెలకు వెలుగులు అద్దిన వలపు పుష్పానివా?
ఎవరు నీవు??


పాల మీగడవా ?
పున్నమి వెన్నెలవా?
సాయం సంధ్యవా?
సంధ్యా రాగానివా?
దేవ కన్యవా?
ముగ్ధ మందారానివా?
తొలకరి తోలి వాన జల్లువా?
పచ్చని పైరువా?
నవ వసంతానివా?
పెరటిలోని తుంటరి తూనీగవా?
ఎవరు నీవు??



No comments:

Post a Comment