చల్లని చందమామలా
తెల్లని వెన్నెల వసంతంలా
పచ్చని పైరు గాలిలా
కమ్మని కోకిలమ్మ పాటలా
తొలకరి తొలి వాన జల్లులా
చలచల్లని సాయం సంధ్యల
వెచ్చని ఉదయభానుని తొలి వెలుగు రేఖలా
కోటి అందాల కొనసీమలా
ప్రకృతి ఒడిలో పలకరించి పులకరింపచేసే పాపికొండల అందాలలా
పసి పాప చిరునవ్వులా
తాతయ్య బోసి నవ్వులా
గల-గల పారే గోదారిలా
ఏటిలా-సెలయేటిలా
నువ్వు కలకాలం నవ్వుతూ-తుళ్ళుతూ ఉండాలి నేస్తం..
No comments:
Post a Comment