Sunday, August 16, 2009

His suicide..

చెప్పులు అరిగేలా తిరిగినా ఉద్యోగం దొరకక..
మంచంలో మాయదారి రోగంతో చావు-బతుకుల మధ్య పోరాడుతున్న ముసలి తల్లికి మందలు కొనలేక...
చేతకానివాడు అని సమాజం ముద్ర వేసిమానసికంగా వెలి వేసి,
ఓర కంట చూస్తున్న ఆ "వికారపు" చూపులను తట్టుకోలేక...
పాల వాడి, పచారి కొట్టు వాడి బాకీ తీర్చలేక....
అప్పుల బాధ తాళలేక, పేగులను మెలి వేస్తున్న ఆకలిని బాధను చంపుకోలేక..
బక్క చిక్కి, నోట మాట రాక, నీరసంతో నవ్వే కొడుకు మోము చూడలేక..
తనతో ఏడడుగులు నడిచిన దౌర్భాగ్యానికి -
పాతికేళ్ళ నవ యవ్వన ప్రాయంలో
పండు ముదుసలి తనాన్ని ఆపాదించుకున్న
భార్య ఇంకిపోయిన కన్నీటి కళ్ళలోకి చూడలేక.....

ఉరి తాడుని బంగారపు గొలుసులా మెడకు అలంకరించుకొని..
చావుని చిరు నవ్వుతో ఆహ్వానించి...
యమ భూపాలుడిని వాకిట నిలచాడు ఒక "మడిసి"

ఈ "మడిసి" చావుకు కారణం ఎవరు??
అప్పు తిరిగిమ్మని అడిగిన పాల వాడా/పచారీ కొట్టు వాడా ?
మంచంలో మూలుగుతున్న ముసలి తల్లా?
కడుపున పుట్టి కొరివి పెట్టిన కొడుకా?
పెళ్లి చేసుకొని వైధవ్యాన్ని మూటకట్టుకున్న భార్యనా?
స్వయంకృతాపరాధమా?
సమాజమా?
పాలక ప్రభుత్వ వైఫల్యమా?

No comments:

Post a Comment