Saturday, August 1, 2009

Mahaa kootami

జెండాపై సామాన్యుడి అసామాన్య సైకిలు...
కర్షకుడి కంకి-కొడవలి, కార్మికుడి సుత్తి...
విజయాశ్వాలుగా రాఘవులు, నారాయణ...
కే.సి.ఆర్ రధసారధ్యం...
ప్రజా గాండీవాన్ని ధరించి, విజయ విలాసంతో చంద్రబాబు ముందుకు సాగగా...

పోరాటాల ఎర్రదండు ప్రళయ తాండవం సేయగా..
ప్రగతిశీల పసుపు సేన సునామీ సృష్టించగా...
దగా పడ్డ తెలంగాణా ఆత్మఘోష ఘీంకరించి, గర్జించగా...
పసుపు. ఎరుపు, గులాబీలు పంచకల్యాణిలై..
ప్రజాకంటక ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన నాడు...

కర్షకుని కన్నీరు కాలకూట విషంగా మారిన నాడు..
కార్మికుని మౌన రోదన యుద్ధభేరి గా మోగిన నాడు...
యువత రక్తం ఉడికిన నాడు....
సామాన్యుడి శాంతి చచ్చిన నాడు...
మధ్యతరగతి వాడి కడుపు మండిన నాడు...
పేదవాడి గూడు చెదిరిన నాడు...

ఎగసిపడే ప్రజా-ఆగ్రహహోరుగాలులలో ...
భూబకాసుర ప్రభుత్వ కోటలు బీటలు పడ్డ నాడు...

మరోమహోదయం ఉదయిస్తుంది...
ఆకాశంలో సూర్యుడు పసుపు రంగు పులుముకుంటాడు...
తెలుగు లోగిల్లు పసుపు పరవళ్ళు తొక్కుతాయి...
తెలుగు ఆడపడుచులు నుదుట పసుపు-కుంకంలతో కళ-కళలాడతారు....
ప్రజల పెదవులపై చిరు నగవుల పూలు పూస్తవి...


No comments:

Post a Comment