ఆల్చిప్పలో మెరిసే ముత్యంలా తను హంస తూలికా తల్పం పై సేద దీరిన వేళ,
ఏకాంతంలో ఆ కాంత నుండి ఎగసిపడే కాంతులతో ఆ గది లోపల చీకటి చిద్విలాసం చేయుచుండగా,
ఆ తరుణి తనువుని తాకుతున్నాను అన్న చిలిపి తలపుతో చల్లగాలి తన్మయత్వంలో తడసి ముద్దవగా...
ఆ గాలితో చెట్టా-పట్టాలు వేస్తూ తన కురులు నౄత్యం సేయగా...
ఆ సుందరి సౌందర్యాన్ని శ్రీనాధుడు వర్ణిస్తున్నాడా అన్నట్లు, వెనక నుండి మంద్రంగా సంగీతం వినిపిస్తుండగా..
ఆ కళ్ళలో కొంటెదనాన్ని,
ఆ చూపులలో చిలిపిదనాన్ని,
ఆ పాల బుగ్గలలో పాల పుంతలను చూసి ఆకాసంలో వెన్నెలమ్మ వలపు రాగాలు పాడగా...
ఆ కలువ అందాలకు ముగ్ధుడై కరి మబ్బుల చాటునుండి చందమామ చల్లగా విరహ బాణాలు సంధించగా..
ఆ పాలరాతి శిల్పం పెదవులపై విరిసిని చిరు దరహాసాలు నా మదిలో మధుర మకరందాల మందారాలు పూయించగా....
తన చూపుల బాణాలు నాలో చిలిపి ఆశలను రగిల్చి నన్ను తీయని చిత్ర వధకు గురిసేయగా...
తన తలపుల వలపులలో నేను తరించిన వేళ...
ఆహా ఏమి భాగ్యము...
ఎంత సుమధురము..
ఆ మధురము..
No comments:
Post a Comment