ఆ నల్ల సూర్యుని మనోధైర్యం ముందు వర్ణ వివక్ష తలవంచి సలాం చేసి, గులాంగా మారిపొయింది...
శ్వేత జాతీయుల చేత అవమానించబడ్డ ఆ నల్లవాడు ఇప్పుడు శ్వేత జాతీయుల ఆరాధ్య దైవం....
అవమానించిన ఆ తనువులే నేడు ఆత్మీయతను పంచుతున్నాయి..
చీదరించుకున్న ఆ నోళ్ళే నేడు నువ్వే మా వెలుగు రేఖ అని చేతులెత్తి మొక్కుతున్నవి....
ఓ జాత్యాహంకారాన్ని జయించిన జమదగ్ని...
నిన్ను చూసి నొసలు చిట్లించిన శ్వేత సౌధం నేడు నీకు సాదర స్వాగత సుమాంజలులు పలుకుతున్నది..
సామాన్యుని అసామాన్య శక్తివి నీవు....
చరిత్రను తిరగరాసిన చతురత నీది....
నీ జాతిపై కత్తులు దూసి, కన్నెర్ర చేసిన ఆ జాత్యాహంకారులను....
క్షమించి నేడు వారి గాయాలకు శస్త్ర చికిత్స చేసి,
వారి కన్నీళ్ళ కడగళ్ళు తుడవదానికి నడుంకట్టిన అవతార మూర్తి....
నీకు నీవే సాటి......
పగ్గాలు తెంచుకొని విక్రుత చేష్టలతో పరుగులిడుతున్న ఆర్ధిక మాంద్యానికి సంకెళ్ళు వేస్తావని....
ప్రపంచను నడి బొడ్డుపై నగ్నం గా నర్తిస్తూ,
భయూత్పాదాన్ని స్రుష్టిస్తున్న ఉగ్రవాదంపై సమరశంఖం పూరించి,
శెరాఘాతాలతొ గజగజలాడించి స్మశనానికి సాగనంపి ఘోరీ కడతావని...
నీ రాక కోసం,
నీవు వాగ్ధానం చేసిన బాసల బాటల కోసం,
నీవు శ్రుష్టిస్తాను అన్న మరో ప్రపంచం కోసం,
నీవు మాలొ ప్రోది చేసిన నమ్మకాల అమ్మతనం కోసం,
రేపటి మా ఆశల సౌధాల కోసం,
భావి భవిత కోసం ...
ప్రపంచం నలుమూలల నుండీ కోటాను కోట్ల కళ్ళు ...
నీమీద నమ్మకంతో,
ఆత్మ విశ్వాసంతో,
పట్టుదలతో,
ఆశలను స్వాసలు గా చేసుకొని చూస్తున్నా నాయకుడా..
No comments:
Post a Comment