కల్మషం ఎరుగని పసి పాప పెదవుల్లోని బోసి నవ్వులు..
వేకువ జామున కూసే కోయిల కమ్మని కుహు-కుహూ రాగాలు...
నిరాశా, నిస్పృహలతో నీరశించి పోతున్న యువతరంలో ఉత్తేజాన్ని నింపే మంత్రోపదేశాలు..
కర్షకుడి కనులలో ఇంకిపోయిన కన్నీరు చెప్పే కధలు..
కార్మికుడి కష్టాలలో నుండి ఉద్భవించే స్వేద బిందువు చెప్పే వ్యధలు..
ఉద్యమాలలో ప్రాణాలను త్యజించిన విప్లవ వీరుల రుధిర జ్వాలలు చెప్పే రహస్యాలు...
సమ సమానత్వాన్ని స్మరించే, తపించే విప్లవ ఇతిహాసాలు..
నిదురిస్తున్న జాతిని జాగృతం చేసే ఉద్య భానుని తొలి వెలుగు రేఖలు..
పంటి బిగువున పురుటి నెప్పులు భారితూ మరో జీవికి మార్గం సుగమనం చేసే మగువ మమతానురాగాలు..
ప్రజా కంటక ప్రభుత్వాల పునాదులను పెకిలించే ప్రజాస్వామ్యపు ఆయుధాలు..
దుర్మాగపు దీవిలో, అన్యాయాల అడవిలో భూమిని చీల్చుకు పూసే "ఎర్ర" మందారాలు..
శ్రీ శ్రీ కలం నుండి జాలువారిన కవితలు..
No comments:
Post a Comment