Monday, August 27, 2012

నిన్ను ఎక్కడో చూసినట్లు ఉందే!!
ఆ.. నువ్వు "ప్రజాస్వామ్యానివి" కదూ!!

నా దేశ నాయకుల చీకటి పడక గదిలో 
మల్లెలు పరిచిన పందిరి మంచం మీద 
పడున్నది నువ్వే కదా!!!
క్షేమమే నా????

అపుడెపుడో ఈ క్యాపిటలిష్టులంతా కలసి 
ముంబై "Red Light" ఏరియాలో 
ఒళ్లమ్ముకునే పడుపు గత్తెగా మార్చేసారుగా!!!
ఇపుడు కుశలమే నా????

సంస్కరణాల నెపంతో పట్టపగలు నిన్ను నడి రోడ్డుమీదకు లాగి 
వివస్త్రని చేసి వంతుల వారీగా మానభంగం చేసారు కదా!!
ఆ గాయాలు మాసిపోయాయా??

 ఎందుకా కన్నీరు???
ఏమిటి ఆ పిరికితనం??

భయం వలదు!!!
నిగ్రహాన్ని పెంచుకో!!

ఇదిగో నేను రాయబారిగా వచ్చా!!
అడివి నుండి నీ బిడ్డల కబురు మోసుకొచ్చా!!
వారి పోరాట కధలు నీకు చెప్పగా వచ్చా!!
ఆ విప్లవ్య విజయాలు కీర్తించగా వచ్చా!!

నీ దాశ్య  శ్రుంఖాల విచ్చేదన కోసం 
తుదిశ్వాస విడిచే వరకూ పోరాడతాం అని 
నీకు చెప్పమన్నారు "మా అన్నలు" - నీ బిడ్డలు!!

యోధులు నేలకొరిగారని చింతిస్తున్నావేమో!!
నేలకొరిగిన యోధుని రక్తాన్ని 
సింధూరంగా నుదుట దిద్దుకుని 
మరో వీరుడు ఉదయిస్తాడు!!
మార్గాన్ని నిర్దేశిస్తాడు!!
కర్తవ్యాన్ని ప్రబోధిస్తాడు!!
ఉద్యమాన్ని బ్రతికిస్తాడు!!!
ఎర్ర బావుటాని  ఎగరేస్తాడు!! ( Bhagath ) 

No comments:

Post a Comment