అమ్మా నన్ను కన్నందుకు వందనాలు!!
నవమాసాలు మోసినందుకు వందనాలు!!
నీ ప్రాణాన్ని నూనెగా మార్చి
నా ఈ బతుకు దీపాన్ని
వెలిగించినందుకు శతకోటి వందనాలు!!
నీ రక్తాన్ని పాలుగా మలచి
నా ఆకలి తీర్చినందుకు పాదాభి వందనాలు!!
సమసమాజ స్థాపనకై "అడవి" దారిలో పోతానంటే
వెన్ను తట్టి విజయ తిలకాలు దిద్దినందుకు
వీరాభివందనాలు!!
బూటకపు ఎన్కౌంటర్లో నేలకొరిగిన నన్ను
నిర్జీవమైన నీ కళ్ళతో కడసారి చూస్తూ గర్వంగా కారిన
కన్నీటి బొట్టుకి "విప్లవాభివందనాలు!!!
No comments:
Post a Comment