Monday, August 27, 2012


బురఖాల మాటున బ్రతికేటి బతుకులు మనకేల మిత్రమా??
పరదాల తెరలని తొలగించి చూద్దాం ఈ లోకపు అందాలని ఇకనైనా!!!

-------------------------------------------------------------------------------------

నీ మరణం మాలో చీకట్లను నింపి ఉండవచ్చు
కానీ "రాజు లేని రాజ్యాన్ని - అసమానతలు లేని సామ్రాజ్యాన్ని నిర్మించాలని" నువ్వు మాలో రేపిన ఉద్యమ స్ఫూర్తి ఇంకా రగులుతూనే ఉంది!!!

నీ మరణం విప్లవ తల్లి కనులనుండి రుధిర ధారలను కార్పించి ఉండవచ్చు
కానీ మా కార్యదీక్షని కలవర పరచలేదు

నీ మరణం మా గమ్యాన్ని ఓ అడుగు దూరం చేసి ఉండవచ్చు
కానీ గమ్యం వైపు వేసే మా అడుగులలో వేగాన్ని తగ్గించలేదు

ఆంపసెయ్యపై రక్తపు మడుగులో శాశ్వత నిద్దురలో సేదతీరుతున్న
 నీ పార్ధివ శరీరాన్ని వాత్సల్యంతో ముద్దాడుతున్న ఆ "ధవళ వస్త్రం"
తన సహజ సిద్దమైన "శాంత" గుణాన్ని పక్కకు పెట్టి "ఎర్ర కాంతులను" పులుము కుంటున్నపుడు

తడి నిండిన కనులతో, బిగించిన పిడికిళ్ళతో, ఎర్ర బడ్డ కళ్ళతో, బరువెక్కిన గుండెలతో 
శిరసు వంచి నీ పాదాలపై ప్రణమిల్లి చేస్తున్నా కడసారి "లాల్ సలాం"

----------------------------------------------------------------------------------

అసలు ఆ  రోజుల్లో.........
చిటపట  చిటపట  వాన  చినుకులు కురుస్తుంటే 
ఆ వానలో వయ్యారాలు ఒలకబోస్తూ  గల గల పారే సెలయేరులా 
వరూధిని నడుస్తూ ఆనందంతో ముసి ముసి నవ్వులు రువ్వుతుంటే 
ఇంద్రధనసులా .... మిల మిల మెరిసే మెరుపులా కనిపించేవి..

ఆ రోజులే వేరులే!!!
అవి చెదరని జ్ఞాపకాలు 

---------------------------------------------------------------------------------------------

' మా ఊరి కన్నీటి  కథ '  
పొలాలు బీడుబారాయి
చెరువులు ఎండిపోయాయి 
ఊరు ఎడారి అయ్యింది 
ప్రకృతి కన్నెర్ర చేసింది 
చిరునవ్వు నిన్నటి జ్ఞాపకంలా మిగిలిపోయింది 
మా ఊరి నూలుమిల్లు మూతబడింది 

ధైర్యం సన్నగిల్లింది 
ఆకలి రంకెలేస్తోంది
తల్లి రొమ్ములో పాలు నిండుకున్నాయి 
అది ఎరుగని ఊయలలోని చంటి పిల్లాడు ఆకలితో గుక్కపట్టాడు 
రాములోరి కోవెల కళతప్పింది
నిత్యనైవేద్యం అందుకునే ఉత్సవమూర్తి పస్తులుంటున్నాడు 

అగ్రహారం బాపనయ్య "జంధ్యం" పోగులూడింది
సుబ్బి శెట్టి చెప్పులు అరిగిపోయాయి 
మంగలి సూర్య ఊరొదిలి వలసపోయాడు
చాకలి ఐలయ్య మాయరోగంతో మంచం పట్టాడు 
ప్రెసిడెంటు సుబ్బారెడ్డి ఉత్తరీయం చిరుగులు పట్టింది 
మాలపల్లి ఎసుబాబు రక్తం కక్కుతున్నాడు 
కమ్మరి సుబ్బయ్య ఉరేసుకున్నాడు 
షేక్ మస్తాన్ వలి పురుగుమందు తాగి అల్లాలో ఐక్యమయ్యాడు 
స్మశానం ఎవడో ఒకడి కాష్టం కాలుతూనే ఉంది అనునిత్యం 

తుఫానుకి కరెంటు పోలు కొట్టుకుపోయింది 
చీకటి బ్రతుకు అలవాటైపోయింది 
సర్కారోళ్ళు పన్ను మా ఊరిని మర్చిపోయారు 
అసెంబ్లీ మా ఊరిని (పన్నులు కట్టడం లేదని) వెలి వేసింది 
మా M.L.A మొహం చాటేశాడు 
బయట ప్రపంచం తో మా అనుబంధాలు తెగిపోయాయి 
పెపరోళ్ళు మా ఊరి గురించి పట్టించుకోడం మానేశారు !!!

అప్పుడు.....సరిగ్గా అప్పుడు .....
ఓ రోజు కోడి కూసే వేళకు అడుగు పెట్టారు
 మా ఊళ్ళో "నలుగురు" కుర్ర వాళ్ళు, ఓ మధ్య వయసు మనిషి!!

చురకత్తుల్లాంటి చూపులు 
బల్లాల్లాంటి బాహువులు 
నెలవంక లాంటి కనుబొమ్మలు 
చెరగని చిరునవ్వు 
నడకల రాజసం 
శిఖరం లాంటి ఆకారం
కట్టి పడేసే ఆహార్యం 
మాటల్లో ఆవేశం 
ఆలోచన పాదరసం

---------------------------------------------------------------------------------------------


పీల్చే గాలి, 
తాగే నీరు, 
పారే ఏరు, 
పండే పైరు, 
దున్నే భూమి, 
కురిసే వాన, 
మొలిచే మొక్క, 
మండే నిప్పు మీద సమాజానికి సమాన హక్కు ఉండాలని - 
రక్తాన్ని చిందించి, 
ప్రాణాలు అర్పించి,
 బంధాల బందిఖాలు పక్కకెట్టి, 
ప్రజల కష్టాలను,
 కన్నీళ్లను తమ నెత్తినెట్టి 
బ్రతుకు ఆరాటంలో 
"పోరాటానికే" సై అని 
సమాజం కోసం 
సమాజం వెలుపలి నుండి పోరాడుతున్న యోధులారా!!
 "మార్క్స్" చూపిన తీరానికి మీ ప్రాణాలతో రాదారులు నిర్మిస్తున్న "పోరాట వీరులారా"
 మీకిదే నా "అక్షర నైవేద్యం" 

---------------------------------------------------------------------------------------------------------

మా చుట్టు పక్కల మీరు లేకపోవచ్చు!
కానీ  అప్పుడూ - ఇప్పుడూ - ఎప్పుడూ రాష్ట్ర  రాజకీయాలు మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి!!

మీకు మేము గుడులూ గోపురాలు కట్టించి ఉండకపోవచ్చు 
కానీ మా గుండె గుడిలో మీకు ఎల్లపుడూ అగ్రతాంబూలమే!!

గాడాంధకారంలో నిదురిస్తున్న తెలుగు వాడి గుండెల్లో ఉత్తేజాన్ని నింపిన "ఉద్యమ భానుడా"!!
తెలుగువారి ప్రతి గడప గడపా కొలువై ఉన్న "రామ చంద్రుడా" నీకివే మా అక్షర నీరాజనాలు!!! 

------------------------------------------------------------------------------------------------------------------

ఆయన రాకకై కోట్లాది కనులు ఎదురుచూశారు!!

ఆయన  అభయ కష్టం కోసం "పాహిమాం పాహిమాం" అంటూ నా ఆంధ్ర రాష్ట్రం ఎదురుచూసింది!!

ఆయన రాకతో చీకటి నిండిన మా బతుకుల్లో వెలుగు పూలు పూసాయి!!

ఆయన  రాకతో నీరసించిన మా గుండెల్లో ఉత్సాహం పరవళ్ళు తొక్కింది!!
ఆయన పేరు వినినంతనే  "ఢిల్లీ" పునాదులు ప్రకంపించాయి!!


నాయకా!!! 
మా చుట్టు పక్కల మీరు లేకపోవచ్చు!
కానీ అప్పుడూ - ఇప్పుడూ - ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాలు మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి!!

మీకు మేము గుడులూ గోపురాలు కట్టించి ఉండకపోవచ్చు 
కానీ మా గుండె గుడిలో మీకు ఎల్లపుడూ అగ్రతాంబూలమే!!

గాడాంధకారంలో నిదురిస్తున్న తెలుగు వాడి గుండెల్లో ఉత్తేజాన్ని నింపిన "ఉద్యమ భానుడా"!!
తెలుగువారి ప్రతి గడప గడపా కొలువై ఉన్న "రామ చంద్రుడా" నీకివే మా అక్షర నీరాజనాలు!!! 



దశాబ్దాల చరిత మీది!! 
ఓటమి ఎరుగని కాంగ్రెస్ విష వృక్షాన్ని కూకటి వేళ్ళతో సహా పెకిలించిన చతురత మీది!!! 
ఆంధ్రుడికి ఆత్మ గౌరవాన్ని ప్రసాదించిన కరుణాతత్ప హృదయం మీది!!! 
తెలుగు వాడి నరనరాల్లో పౌరుషాగ్ని రగిలించి ఢిల్లీ దద్దమ్మల గుండెలలో ప్రళయ జ్వాలా తరంగాలను మోగించిన మహోగ్ర రూపం తమరిది!!
ఓ మహాశయా  వందనం!! అభివందనం!! పాదాభివందనం!!!
మీకిదే నా అక్షర నీరాజనం!! 
జై తెలుగు దేశం!!!
 జోహార్ "అన్న" N.T.R

Physically you might not be with us anymore, but you are not the person whom this soil forgets ever. You stole our hearts. You changed our lives. We will be in debt to you throughout for the "Political awareness you taught to us - The then slaves under the Govts of Congress. Long live NTR. Long Live!!

---------------------------------------------------------------------------------------------------------

(  By Bhagath ) 

No comments:

Post a Comment