Monday, August 27, 2012

నాకూ ఓ మనసుంది!!
దానికీ ఓ బాధ ఉంది!!
ఆ బాధ వెనుక ఓ కధ ఉంది!!
ఆ కధకి నీతో ముడి ఉంది!!
తడుముకుంటే కళ్ళ వెంట కన్నీరుంది!!
గుండె బరువెక్కి ఉంది!!

నిన్నటి జ్ఞాపకాలు తరచి చూసాను!!
నీతో గడిపిన ఘడియ-ఘడియా గుర్తు చేసుకున్నాను!!
పెదవంచున చిరునగవు దోబూచులాడింది!!

నువ్వు నా పక్కన లేవన్న నిజం మనసున మెదలింది!!
మరణయాతన మొదలయ్యింది!!

కాలం కఠినమైనది!!
నిన్న ఇక్కడే ఆనందాల ఊయలలో నన్ను ఊయలలూపింది!!
నీ ప్రేమ అమృతాలలో తడిపింది!!

నేడు కన్నీటి కడలిలో మునిగిపోమ్మన్నది 
నీ విరహం పేర్చిన చితి మంటలలో బూడిదై పొమ్మన్నది!!!

మరణం అంటూ ఉంటే!!
మరు జన్మంటూ ఉంటే!!
దేవుడంటూ ఉంటే!!
వరమంటూ ఇస్తే!!
నీ నీడలో మొలకెత్తాలనీ!!!

No comments:

Post a Comment