మేము సంఘ జీవులం!! సౌమ్యం మా స్వభావం!! శాంతి మా మంత్రం!!
మేమంటే సమాజానికి గౌరవం!! మా జీవితం ఓ నిఘంటువు!!
నిస్వార్ధం మా ప్రాణం!! సామాజిక సేవ మా దినచర్య!!!
నా పేరు "సర్కార్"!!! నేను ప్రజాస్వామ్యానికి "పెద్దన్న" ని!!!
ఒంటరి పక్షులు మీరు!! రాతి మనస్కులు!!!
మీరంటే ప్రజాస్వామ్యానికి అసహ్యం!!
మీ జీవితం గందరగోళం!!! చీకటి మీ చెలిమి!!
అశాంతి మీ జీవితం!! ఆయుధం మీ కవచం!!!
త్యాగం మీ మార్గం!!! ఉద్యమం మీ శ్వాస!!!
నీ పేరు "తిరస్కార్"!!!
నువ్వు ప్రజలకి "అన్న"వి!!!
No comments:
Post a Comment