Monday, August 27, 2012

రాయాలని ఉంది నాకో కవిత !!!

తొలి వేకువ వేళ 
నును వెచ్చని ఉదయ భానుని తొలి వెలుగు రేఖల మీద!!

చల్లని తొలి మంచు పరదాల మాటున 
విచ్చిన తెల్లని మల్లెల అందాల మీన!!

కోడి కూత వేళ
ఆరుబైట రంగవల్లులు అద్దుతున్న 
( నా ఎద బరువెక్కించిన ) ఆ జవ్వని యవ్వన రహస్యాల పైన!!

పొద్దున్నే "అమ్మగారూ పాలు" అన్న కేక విని...
మగని వెచ్చని కౌగిళ్ల నుండి విడవడి 
వడి-వడిగా పరుగిడి 
జర్రున తలుపు తెరువగా...
బోసి నోటి అవ్వ "కిసుక్కున" నవ్వినపుడు...

వాల్జడలో వాడిన మల్లెలు 
అవ్వ నవ్వులోని పరమార్ధాన్ని చెప్పకనే చెప్పినపుడు

ఎర్రటి పెదవులపై పంటి గాయాలు 
నడి రాతిరి చీకటిలో రహస్యాన్ని గుర్తుచేసినపుడు...

సిగ్గు ముఖాన్ని కప్పివేయగా 
తల దించిన సుందరి సిగ్గుల మొగ్గల మీద 
రాయాలని ఉంది నాకో కవిత!!!

రెప-రెపలాడే ఎర్ర బావుటా పైన!!
ప్రపంచానికి దిశా-నిర్దేశం చేసిన మార్క్స్ మీద!!

మార్క్స్ భావాలను భుజాలపై మోస్తున్న గెరిల్లాల గుండె నిబ్బరం పైన!!
త్యాగాలకి వెరువని కామ్రేడ్స్ జీవిత గమ్యాల పైన!!
పోరాటంలో నేలకొరిగిన విప్లవ తల్లి వీర బిడ్డల మీద!!
అలుపెరుగని అన్నల మీద!! 
మా అన్నల మీద!! 
రాయాలని ఉంది నాకో కవిత!!! ( Bhagath )

No comments:

Post a Comment