జీవితంలో కొన్ని బంధాలుంటాయ్ - ఎప్పటికీ తెంచుకోలేము
వ్యసనాలుంటాయ్ - వాటి బానిసత్వం నుండి విముక్తి పొందలేము
కొన్ని త్యాగాలుటాయ్ - వెలకట్ట లేము
కోరికలుంటాయ్ - చంపుకోలేము
అపజయాలుంటాయ్ - జయించలేము
ఓటములుంటాయ్ - తప్పించుకోలేము
తప్పులుంటాయ్ - దిద్దుకోలేము
రునాలుంటాయ్ - తీర్చలేము
ప్రశ్నలుంటాయ్ - బదులివ్వలేము
ఆనంద క్షణాలుంటాయ్ - మరువలేము
చదరని జ్ఞాపకాలుంటాయ్ - తిరిగి తెచ్చుకోలేము
పోరాటంతో మొదలయ్యి!!
పోరాటంతో అంతమయ్యేదే జీవితం!!!
పోరాడు!!!
నీ చివరి శ్వాస అనంత వాయువుల్లో కలసిపోయేవరకూ పోరాడు!!
యుద్దంలో సైనికుడల్లె పోరాడు!!
సంద్రంపై నావికుడల్లె పోరాడు!!!
కాలం సింహం లాంటిది!!
కాలం వంచించిన ప్రభుత్వం లాంటిది!!
నిన్ను లేడిని చేసి తరుముతుంది!!!
నిన్ను విప్లవకారుడు, ద్రోహి అని వెలి వేసి "అడవుల్లోకి" తరుముతుంది!!
భయం వద్దు!!!
సామాన్యుడే నీ అస్త్రం!!!
పదునెట్టు ఆ శస్త్రం!!
సంధించు తిరుగులేని ఆ బ్రహ్మాస్త్రం!!
No comments:
Post a Comment