నీ కోసం వేచి చూసాను....
నీ జాడ లేదు...
నీవు పలుక లేదు...
నాకు కునుకు లేదు....
నా కనులలో తడి ఆరలేదు....
నిను మరచిన క్షణం లేదు...
నిను తలువని ఘడియ లేదు...
తొలిసారి నిను చూసినపుడు
నా పెదవులపై విరిసిన
చిరు నవ్వులనడుగు...
నా చూపులతో నిను నిలువెల్లా
తదిమినపుడు ఎర్రబడ్డ నా బుగ్గలనడుగు...
మొదటిసారి నీ చేయి తాకినపుడు
పెరిగిన నా గుండె చప్పుళ్ళని అడుగు....
నిను చీర కట్టులో చూసినపుడు
నాలో చెలరేగిన సెగల-పోగలను అడుగు....
నువ్వు నను వీడి వెళ్లిపొతున్నపుడు
నా కనులనుండి జాలువారిన కన్నీళ్లను అడుగు....
No comments:
Post a Comment