Wednesday, November 11, 2009

Un titled..

శనివారమేగా ఇంకొంచెం సేపు నిద్దరోదాం అనుకున్నా...
నా కలలో నీ కళ్ళలోకి చూస్తూ కాలగమనాన్ని కూసేపు మరచిపోదాం అనుకున్నా..
నీ ఒడిలో తలపెట్టి ఆకాశంలో ఆ తారల ముసి ముసి నవ్వులను మనసారా ఆస్వాదిద్దాం అనుకున్నా..
మన ఇద్దరినీ అలా చూసి సిగ్గుతో చిక్కిపోతున్న చందమామను చూసి వెక్కిరిద్దాం అనుకున్నా...

పూవునైనా కాకపోతిని నీ కురుల విరుల సిరుల చేరగా..
నవ్వునైనా కాకపోతిని నీ పెదవులను చేరగా..
"చిరు జల్లు"నైనా కాకపోతిని నీ తనువులను తడపగా...
చిరు గాలినైనా కాక పోతిని నీ చెక్కిలి పై సేదదీరిన చెమట బిందువుని ముద్దాడగా ;)
నీ కాలి గజ్జనైనా కాక పోతిని నీ లేత పాదాలకు ప్రణమిల్లగా॥

No comments:

Post a Comment