తోడేళ్ళు తోడుదొంగలు తరుముకొచ్చే ఈ నిశీధిలో నన్ను ఒంటరిగా ఒదిలేసి...
కారు మబ్బులు, కష్టాలూ, కన్నీళ్లు కమ్ముకొస్తున్న ఈ నిశాచర లోకంలో నన్ను ఒంటరిగా వదిలేసి...
నా వలపు రాగాలు, విరహ వేదనలు వదిలేసి...
నా ఆశల హరివిల్లులను అంధకార కారాగృహంలో ఖైదీ గా చేసేసి..
నా కళలను నీ ముద్దు ముద్దు కాళ్ళతో తన్నేసి...
నా ప్రేమను పాతాళానికి తోసేసి...
బాధ్యతల గండాల సుడిగుండాలలో బాధితురాలిగా మారి వెళ్ళిపోయావా...
నను వీడి నీవు వెళ్ళినా...
నువ్వు పండించిన సంతోషాల సరాగాలు నా చెవిలో రాగాలాపన చేస్తూనే ఉంటాయి..
నీ చిరునవ్వుల పువ్వులు నన్ను పలకరిస్తూనే ఉంటాయి....
No comments:
Post a Comment