తొలివేకువ వేళ
పక్షుల కిల-కిల రావాల నడుమ
తెల్లని మబ్బుని చల్లని మంచు కప్పివేయగా...
రాజహంస వయ్యారాలతో
నెమలి సింగారాలతో
ప్రకృతిని పలకరించి, పులకరింప చేసి పరుగులిడుతున్న సొగసరి సెలఏటిలా...
సుతి మెత్తని అడుగులతో నువ్వు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు....
నీ నుదుట ఒక స్వేద బిందువు జాలువారుచుండగా....
అప్పుడే ఆవలిస్తూ వళ్ళు విరుస్తూ బద్దకంగా కళ్లు తెరిచిన సూర్యుడు నిన్ను చూచుచుండగా...
మదిలో చిలిపి తలపుతో ఆ ఉదయభానుడు నీ చెక్కిలిపై జాలువారుతున్న ఆ చెమట బిందువుని చేరగా..
ఆ ఉషస్సు, నీ తేజస్సు కలసి ఆ నీ చెమట చుక్క మిల మిల మెరవగా..
సిగ్గులతో బరువెక్కిన నీ కను రెప్పలు నేలకు వాలగా....
నీ నుదుట ఒక ముద్దు పెట్టాలని ఉంది.....
No comments:
Post a Comment