నిజంగా నువ్వు మనిషివి కాదు కదు..
శాపవశాత్తు దివి నుండి భువికి దిగి వచ్చిన గాంధర్వ కాంతవు నీవే కదూ..
అజంతా శిల్పాలకు రాణివి నువ్వే కదూ..
కాళిదాసు కలం నుండి పురుడుపోసుకున్న వసంతసేనవు నీవే కదూ...
"లియోనార్డో డ విన్సి" మనసు నుండి మొలిచిన మొనాలిసవు నువ్వే కదు..
పాల మీగడ నీ మేలిమి ఛాయే కదూ..
ఇంద్రధనసు నీ పెదవులపై విరిసిన చిరునవ్వే కదూ...
నిండు పున్నమి వెన్నెల వెలుగులు నీ కాంతులే కదూ..
కర్పూరం నీ శ్వేద బిందువే కదూ ..
సూర్య చంద్రులు నీ కనులే కదూ..
కాశ్మీర్ యాపిల్ ఎర్ర బడ్డ నీ బుగ్గలే కదూ..
ఆకాశాన మెరుపులు భువిపై నీ విరుపులే కదూ..
బ్రహ్మ దేవుని మానస పుత్రికవు నువ్వే కదూ..
సాగర మధనంలో ఉద్భవించిన మోహినివి నీవే కదూ..
నెమలికి నాట్యం-కోయిలకు రాగం నేర్పిన సుందరివి నీవే కదూ...
అలలు నీకై సముద్రుని మదిలో రేగే అలజడులే కదూ..
చిరుజల్లు వరుణుడు నీ కోసం విసిరే వలపు బాణాలే కదూ...
సౌందర్యానికి చిహ్నం నువ్వే కదూ..
ఆప్యాయతలకు అడ్రస్ నువ్వే కదూ..
మన్మధుడి ఫ్యాషన్ స్కూల్లో TOP "మోడల్" వి నువ్వే కదూ..
No comments:
Post a Comment