Tuesday, November 3, 2009

Got that day....

నిన్నటి రోజు గుర్తుకొచ్చింది.....

వద్దు వద్దు అని నేను మారాం చేస్తుంటే
నాకు గోరుముద్దలు తినిపించిన అమ్మ గుర్తొచ్చింది....

పగలంతా గాలి తిరుగుల్లి తిరిగి వచ్చి నిద్రలో నేను కళ్ళ నొప్పులు అంటుంటే
రోజంతా పని చేసి అలసిపోయి అప్పుడే ఇంటికి వచ్చిన నాన్న నా కాళ్ళు పిసికిన రోజు గుర్తొచ్చింది....

వాన జల్లులో పీల్చిన ఆ మట్టి వాసన గుర్తొచ్చింది....
ఖద్దరు చొక్కా వేసుకొని కాలరు ఎగరేసిన ఆ రోజు గుర్తొచ్చింది....

వాన పడ్డప్పుడు వచ్చే కమ్మటి మట్టి వాసన గుర్తొచ్చింది....
డాబాపై అమ్మ పక్కన పడుకుని ఆకాశంలో తారలను లెక్కపెట్టడం గుర్తొచ్చింది...
నా వెనక తోక ఊపుకుంటూ తిరిగే మా వీధి కుక్క పిల్ల గుర్తొచ్చింది...

No comments:

Post a Comment