ఎచట సూర్య కిరణాలు ప్రసరించునో
అచట అంధకారము అంతరించును....
ఎచట ఎర్ర బావుటా ప్రజ్వలించునో
అచట అరాచకత్వం తోకముడుచును...
ఎచట శ్రామికుడి సహనం సమాధి అగునో...
ఎచట కార్మికుడి కడుపు రగులునో....
ఎచట బూర్జువా పాలన జనియించునో...
ఆ పాలకుల గుండెల్లో ఎర్రబావుటా రెప-రేపలాడును...
అచట "విప్లవం" ఉదయించి "విజయ శంఖం" పూరించును...
No comments:
Post a Comment