[red]రాష్ట్రం రావణ కాష్టంలో కాలిపోతోంది.
యుద్ద మేఘాలు కమ్ముకోస్తున్నాయ్..
ఎటు చూసినా భయానక వాతావరణం..
రాజకీయ పార్టీల సమ్మెలు, బందులు, హార్తాళ్ళు...
పోలీసుల కవాతులు...
సామాన్య ప్రజల ఇబ్బందుల పొలికేకలు
సంక్రాంతికి కోడి పందాలు లేవు..
కొత్త అల్లుళ్ళ కోలాహలాలు లేవు...
ధరలు ఆకాశానికి ఎగబాకాయి..
తెలంగాణా, ఆంధ్ర లోల్లిలో
పండుగకు కొత్త చీర కట్టుకుని
ముస్తాబు అయ్యే "సినిమా" హాళ్ళు 'మూత' బడ్డాయి..
మా గుండెల్లో నిప్పులు కురుస్తున్నాయ్..
మేము కత్తులు నూరుతున్నాం...
విషం కక్కుతున్నాం...
రాగద్వేషాలతో రగిలిపోతున్నాం...
'ప్రాంతీయ' వాద సెగలో సల-సల కాగిపోతున్నాం..
'స్వార్ధ' రాకీయ నాయకులు రగిల్చిన అగ్గిలో సమిధలైపోతున్నాం...
మా కంటికి నిదుర లేదు..
మా పెదవులపై చిరునవ్వు లేదు..
స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు...
బస్సులు లేవు, ఆఫీసులు లేవు..
కూలీ లేదు, జీతాలు లేవు..
ఆకలి తీర్చుకునే మార్గం లేదు..
మనసారా నవ్వే ఓపిక లేదు..
No comments:
Post a Comment