వెన్నెలను నీకు "గిఫ్ట్"గా ఇద్దాం అనుకున్నా....
వెన్నెల నన్ను అడిగింది - "అప్పు" కంటి వెలుగులకు మించిన వెలుతురు ఉంటుందా అని..
రామ చిలుకను నీకు "గిఫ్ట్" గా ఇద్దాం అనుకున్నా...
ఆ చిట్టి చిలక నవ్వి చెప్పింది - తనకు పలుకులు నేర్పింది "నువ్వే" అని...
వాన జల్లుని నీకు "గిఫ్ట్"గా ఇద్దాం అనుకున్నా...
ఆ చిరు జల్లు చెప్పింది - నీ పెదవులపై చిరునవ్వు తనే అని....
కోకిల గొంతుని నీకు గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నా....
కోకిలమ్మ చెప్పింది తనకు గొంతు అరువు ఇచ్చింది "నువ్వే" అని...
హంస నడకను నీకు గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నా...
హంస చెప్పింది తనకు చేయి పట్టి నడక నేర్పింది నువ్వే అని....
చల్లగాలిని నీకు "గిఫ్ట్"గా ఇద్దాం అనుకున్నా...
తను చెప్పింది - తను ఉండేది నీ పక్కనే అని...
No comments:
Post a Comment