Tuesday, March 22, 2011

My Words

వినండి వినండి!!! చదలు పట్టిన చరిత్ర పుస్తకాల పేజీలలోని పాఠాలు కాదు నా మాటలు!!!
నడిచి వస్తున్న భవితకి బాటలు నా మాటలు !!!

కలలో నిన్న కట్టుకున్న ఊహల మేడలు నా మాటలు!!!!
నా ఎదను మీటి వెళ్ళిపోయే పడుచుల తేన రాగాలు నా మాటలు!!!

రక్తంతో తడిచిన కాగితపు కధలు కాదు నా మాటలు!!!
ప్రేమతో కూర్చిన మల్లెల మాలలు నా మాటలు!!

రక్తాన్ని మరిగించే 'విప్లవ జ్వాలలు' కావు నా మాటలు!!
! శిలలనైనా కరిగించే కమ్మని కావ్యాలు నా మాటలు!!!

No comments:

Post a Comment