కదలి రా!!! "జననం - మరణం" మనిషికి ఎంత సహజమో..."గెలుపు - ఓటమి" ఆటకి సహజం!!! ఆటలో ఓటమి నీకు ఎదురైనపుడు తల్లడిల్లకూడదు!!! మళ్ళీ విజయ శంకం పూరించే వరకూ నువ్వు "తల వంచకూడదు"!!! అభిమానులూ నిగ్రత పాటించాలి!!! ఓటమి విజయానికి తొలి మెట్టు అని గ్రహించాలి!!! We r not supposed to put "Pressure" on our "Warriors"!!! Let us come fwd and "Boost" their "Confidence"!!
యుద్ధంలో గుండెలలో ఒక్క "బుల్లెట్" దిగింది అని "సైనికుడు" వెనుకంజ వెయ్యడు!!! బుల్లెట్ ఎందుకు దిగింది అని ఆలోచించడం కన్నా మరో సారి బుల్లెట్ దిగే "Chance" ఇవ్వకుండా ముందుకి దూస్తుకు పోతాడు!! "ధోని" రా!!! మా మనస్సులో అలుముకున్న అనుమానపు 'అమాస చీకట్లను' చీల్చుకొని ముందికి రా!!! వందకోట్ల మంది ఆశయాన్ని నీ ఆయుధం గా మలచుకొని విశ్వాసంతో ముందుకి రా!!! నీ విజయం "జాతి దిగ్విజయం" అని గుర్తుంచుకో!!! నీ విజయం "భారతావని" ముంగిట చూడ ముచ్చటి సంక్రాంతి ముగ్గవుతదని గుర్తుంచుకో!! ౩౦ వసంతాల మా కలని సాకారం చెయ్యడానికి అవతరించిన "సైన్యం" నీదని గుర్తుంచుకో!!!! మా ఊపిరి మీరని గుర్తుంచుకో!!! మా నమ్మకం మీరని గుర్తుంచుకో!!! కులాల కట్టుబాట్లు, మతాల మారణ హోమాలు, ప్రాంతీయ కేకల పక్కకు నెట్టి "దేశమంతా" ఒక్కటై పలికే "ఆకాంక్ష" మీ గెలుపని గుర్తుంచుకో!!
--------------------------------------------------
! సదువుకని ఇదేసాలకి పోయి 3 yrs తర్వాత తిరిగి వచ్చిన కొడుకుని చూసి "ఏడ్చిన" తల్లి కన్నీరు మీరు చెబుతున్న "ఏడుపు"...
30 yrs తర్వాత "వరల్డ్ కప్" గెలిచి ఆ కప్ ని దేశానికి అంకితం అని చెప్పినప్పుడు కోట్ల ప్రజల కళ్ళల్లో నుండి జాలువారే కన్నీటి కథలు మీరు చెప్పే "ఏడుపులు"!!!
క్యాంపు కి వెళ్ళిన భర్త ఎప్పుడో తిరిగోస్తాడో అని వీధి గుమ్మం దగ్గర ఎదురు చూసి - చూసి అరసేకను నిద్రలోకి జారుకున్న భార్యను "అప్పుడే" ఒచ్చిన భర్త "ఆప్యాయం" బుగ్గపై ముద్దు పెట్టుకున్నపుడు ఆ భార్య కంట కారే "కన్నీటి" చుక్క మీరు చెబుతున్న ఏడుపు!!!!
-----------------------------------------------------
No comments:
Post a Comment