Tuesday, March 22, 2011

Misclenous

ఎదలోతుల నుండి ఎగసి-ఎగసి పడుతున్న భావాల భావజాలాలను "నిదురిస్తున్న" నీ గుండెకు ఎలా తెలుపను!!!
నిశి రాతిరి వేళ నా మదిలో మెదిలిన ఆ ప్రేమ కావ్యాన్ని నీకెలా రుచి చూపను!!!
నా గుండె జ్ఞాపకాల శిధిలాలనుండి గుర్తుకొస్తున్న నీ పెదవులపై విరిసిన చిరునవ్వుల చేమక్కులను నీకెలా చూపను!!!


పవిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం! ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగే యుగే!!
(సజ్జన సంరక్షణకు, దుర్జన సంహారానికి, ధర్మ సంస్థాపనకు నేను అన్నీ యుగాలలో అవతరిస్తుంటాను) - "గీతలో కృష్ణ పరామత్ముడు".
ఇంకిపోయిన కర్షకుడి కన్నీటి బొట్టులోనుండి, ఎండిపోయిన కార్మికుడి చెమట బిందువులోనుండి, నీరసించిన ప్రజల నిస్సహాయతలోనుండి "జన్మించి" సామ్రాజ్య వాద శక్తుల గుండెలలో నిద్దరోయే "ఎర్ర బావుటా" నేనవుతా!! - "సామ్రాజ్యవాద యుగంలో కమ్మ్యునిష్టు". I am not finding much 'Variation' between Both of them


వస్తది!!! రేపో - మాపో ఆ రోజు వస్తది!! కల్తీ మందు తాగి నిద్దురలో జోగుతున్న మన పౌరుషానికి మెళుకువ వస్తది!!! గప్పుడు మన కళ్ళు ఎరుపెక్కుతవి!! ఆ ఎరుపెక్కిన కళ్ళలో నుండి అగ్గి పుడతాది!!! ఆ అగ్గి బడబాగ్ని లా మారి 'కాంగ్రెస్స్' శవాలని బూడిద చేస్తది!!



No comments:

Post a Comment