నాకూ రాయాలని ఉంది ఓ కవిత!!!
కీచక పర్వంతో కృశించి సుష్కించిన భారతావని పై
ఎర్రటి సిరాతో రాయాలని ఉంది ఓ విప్లవ కవిత!!
ఇంకిపోయిన పేదవాడి కనులనుండి కారుతున్న రక్తం గురించి
బలహీనుల రక్తాన్ని తాగుతున్న సర్కారీ రాబందుల గురించి
పట్ట పగలు నడివీధిలో నగ్నంగా నిలబెట్ట బడ్డ భారతమాత దుస్థితి గురించి
అమ్మ పాలు తాగి ఆ అమ్మ రొమ్మును కుమ్ముతున్న రాజకీయ కీచక కొడుకుల గురించి!!
రాయాలని ఉంది నాకో కవిత!!
వీరుల కధలు రాస్తాను
వైప్లవ్య గీతాలు రాస్తాను!
పేదోడి పొలంలో
దొరగాడి గుండెల్లో
ఎగురుతున్న ఎర్ర జెండాని తలుస్తూ రాస్తాను!
తిరగబడ్డ రైతన్న చేతిలోని పదునెక్కిన కొడవలి కధ రాస్తాను!
కసేక్కిన కార్మికుడి బిగిసిన పిడికిలి చెప్పిన కధ రాస్తాను!
ఎరుపెక్కిన కవి గారి కవిత - చెప్పకనే చెబుతోంది రాబోయే విప్లవాన్ని!!

దొరల దౌర్జన్యాలకి ఎదురు తిరిగాడని
సీకాకులంలో సత్యాన్ని ఉరేసినపుడు
కార్చిన కన్నీటిని సిరాగా మార్చి రాయాలని ఉంది!!
అధికారం ముసుగేసుకొని
కఖీ రంగు పులుముకొని
బూటకపు ఎన్కౌంటర్లో
ఆటవికంగా "సూర్యాన్ని" చంపినపుడు
ఉడికిన నా రక్తంతో రాయాలని ఉంది!!
పాడె పై పడున్న పాణిగ్రాహిని చూసి
గుండెలవిసేలా ఏడ్చినపుడు
బిగిసిన నా పిడికిళ్ళతో రాయాలని ఉంది!!
తెల్లని కాగితంపై ఎర్రని కవిత్వంతో నా సంతకం!!
తెల్లని కాగితంపై ఎర్రని కవిత్వంతో నా సంతకం!!
కాదు అని నా సంతకం!!
పేదవాడి కన్నీటి అర్పణం!
ఎదురు తిరిగినోడి గుండె నిబ్బరం!
కాదు అది నా సంతకం!!
అది చీకటిని చీల్చుకు ఉదయిస్తున్న మండే సూర్య కిరణం!
నీలాకాశంలో స్వేచ్చా పవనంలో ఎగురుతున్న ఎర్ర కపోతం!
కాదు ఇది నా సంతకం!!
కత్తుల కోలాటంలో ఆశువులు బాసిన యోధుల త్యాగాల దర్సనం!
(Bhagath - 30/10/12)
కాదు ఇది నా సంతకం!!
కత్తుల కోలాటంలో ఆశువులు బాసిన యోధుల త్యాగాల దర్సనం!
(Bhagath - 30/10/12)
No comments:
Post a Comment