Friday, November 9, 2012

జనం పొగిడారని మురిసిపోకు
 తిట్టారని కుచించుకు పోకు

రాళ్ళు విసిరారని కక్ష పెంచుకోకు 
పూలు వెద జల్లారని పులకరించకు 

మానుకో ఓ మనిషీ!!
మార్చుకో 
నిన్ను నువ్వు ఓ మనిషీ!!

నేను ఎవరు?
నువ్వు ఎవడవు?

ఆ పరమాత్మ సృష్టిలో 
ఇరువురం ఇసుక రేణువులం!!

మురిసింది పరమాత్మ 
విరిసింది పరమాత్మ!

కన్ను మూసినా
కాటు వేసినా

ఎవడిది జన్మ 
ఏది కర్మ!

ఈ జగత్తంతా ఓ భ్రమ!
ఆ భ్రమరాంబ పెనిమిటి లీల!!

( Bhagath 11-06-12)

No comments:

Post a Comment