Tuesday, June 26, 2012

చీకటి మబ్బులు


చీకటి మబ్బులు కమ్ముకోస్తేనే కదా 
రేపొచ్చే ఉషోదయాన్ని నువ్వు ఆస్వాదించ గలిగేది!!!

ఆకలి బాధ తెలిసోస్తే కదా
 పచ్చడి మెతుకుల రుచి నీకు తెలిసొచ్చేది??
గరళాన్ని గుటకేస్తే కదా అమృతం విలవ నీకు తెలిసేది!!!

పాడెపై పడున్న"ప్రజాస్వామ్యాన్ని చూస్తేనే కదా
నీలో దాగున్న "కమ్మునిష్టు" నిద్దుర లేచేది!!

ఇది నిద్ర లేచే సమయం!!
అదిగో యుద్ధ భేరి!!
ఇవిగో  తూటాలు!!!
పోరాడు!!!

గెలుపా??
మార్క్స్ "కలని" కన్నులారా చూద్దువు గాని!!!

ఓటమా??
భయం వలదు!!!
నీ చితి మంటల సాక్షిగా మరో యోధుడు ఉదయిస్తాడు!!!
ఉద్యమానికి ప్రాణం పోస్తాడు - Bhagath 

No comments:

Post a Comment