By "Prajaa Naatyamandali" Jagan
ఆశయాల కోసమని బ్రతికేవాళ్లము
సమసమాజ స్దాపనకై కదిలినొల్లము !!
త్యాగాల దారుల్లో సుక్కలవుతము
నేల తల్లి గుండెలలో మొక్కలవుతము!!
పోరాడే జనమంతా చుట్టాలవుతరు
ఉద్యమాల బాటల్లో వెంట ఉంటరు!!
కష్టజీవులెక్కడున్న ఆప్తులవుతరు
కంటిపాపోలె మమ్ము కాచుకుంటారు!!
మూల మలుపు గోడలపై రాతలవుతము
కదిలించే కరపత్రం జ్ఞానమవుతము
పోరు సైరనూదేటి పోష్టరవుతము
ఊరేగే జనములోన జన్డాలవుతము!!
గుడిసెలోన కటికనేల పరుపు అవుతది
ఆకలైతే కూలితల్లి అమ్మ అవుతది!!
పేదవారి ప్రేమను మూట గట్టితే
చందమామ చల్లదనంకంటే మించేలే!!
ఇంటిపనులు ఇద్దరమూ కలిసి చెయ్యాలే
ఉద్యమాల బాధ్యతలు పంచుకోవాలె !!
ఆదా మగ తేడాలు మాకు లేవులే
అరచేతిలోని గీతలల్లె కలిసి బతకాలె!!
బువ్వలేని వారమంతా సంఘమవుదము
బతికినంత కాలము మన బంధమవుదము
పోరు చేస్తే మన బతుకు మారిపోవులే
సూర్య గ్రహణం విడిచినట్లు వెలుగులొస్తవి !!
"Prajaa Naatya Mandali" Jagan
No comments:
Post a Comment